Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

02 June 2026

ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ Enduku marachithivi yesuni prema

290
తప్పిపోయిన వారిని మేలుకొల్పుట 
రా - ఆనంద భైరవి, తా - త్రిపుట 

ఎందుకు మఱచితివి - యేసుని ప్రేమ - ఎందుకు మఱచితివి = ఎందుకు మఱచితివి పొందితివి నిందలు - సుందర మగునట్టి - సుఖమైన ప్రభు ప్రేమ ||నెందుకు||

2.దేవగ్రంథము నీవు - చదువలేదా - భావమున దానిఁ గైకొనలేదా = సేవక వృత్తులు - సేయక పోతివి - చావరాని చావు - సంపాదించితి వయ్యో ||ఎందుకు||

3.చిందెను రక్తము - సిలువపైనిఁ - పొందెను గష్టము - మేకుల పోట్ల = నెంద ఱెందఱు కల్వ - రీమెట్టపై నతని - నిందించి చంపిరి - నిర్దయులై యకటా ||ఎందుకు||

4.పాపేచ్ఛలోనుండి - మరలి వాని - శ్రీ పాదములు బట్టుము ప్రార్థించుము = కాపాడుటకు దయతోఁ - గనిపెట్టి యున్నాఁడు - పాపి నీ విభుఁడైన - ప్రభు మార్గమునఁ బొమ్ము ||ఎందుకు||

- దావీదు చౌదరి

15 April 2026

నేను నా ఇల్లు నా ఇంటి వారందరు Nenu naa illu naa intivarandaru


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించెదము (2)
నీ కనుపాప వలె నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే (2)
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను||

ఎడారిలో ఉన్న నా జీవితమును
మేలుతో నింపితివే (2)
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబినేజరే||

నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును
నీ కృపతో నింపితివే (2)
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబినేజరే||

జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే
ఆశ్చర్యమాశ్చర్యమే (2)
నీ పాత్రను కానే కాను
కేవలము నీ కృపయే స్తోత్రం (2) ||ఎబినేజరే||

16 June 2024

Entha paapinainanu yesu ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును

339 
Sinners Jesus will receive

1.ఎంత పాపి నైనను 
యేసు చేర్చుకొనును 
అంచు నీ సువార్తను 
అంతటఁ జాటించుఁడి 

||హల్లెలూయ హల్లెలూయ 
యెంత పాపి నైనను 
యేసు చేర్చుకొనున 
టంచుఁ బ్రకటించుఁడి||

2.మెండుగా క్షమాపణన్ 
పూర్ణ సమాధానము 
నెంత పాపి కైనఁ దా 
నిచ్చి చేర్చుకొనును.

3.తన దివ్య సిల్వచేఁ 
దీసి పాప శాపమున్ 
నన్ బవిత్రపర్చెను 
నాకు హాయి నిచ్చెను

4.ఘోర పాపి నైనను 
నన్ను ఁ జేర్చుకొనును 
పూర్ణశుద్ధి నిచ్చును 
స్వర్గమందుఁ జేర్చును
- ఎర్డ్ మాన్ న్యూమిస్టర్
అను : అల్లూరి పెదవీరాస్వామి

16 April 2024

Evarikosamo ee prana thyagamu ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము

 ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము (2)
 నీకోసమే నాకోసమే కలువరి పయనం
 ఈ కలువరి పయనం ||ఎవరికోసమో||

1.ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాపలోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో - మోముపైన ఉమ్ములతో -  నడువలేని నడకలతో
తడబడుతూ పోయావా - సోలి వాలి పోయావా

2.జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళకిరీటం నీకు పెట్టాము
జీవ జలములు నాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి
"తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరిని క్షమించు"
అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని 

29 August 2023

Endukantha dukhamu endukantha kalavaramu | ఎందుకంత దు:ఖము ఎందుకంత కలవరం

ఎందుకంత దు:ఖము ఎందుకంత కలవరం  ఎందుకంత వేదన ఎందుకంత రోదన (2)
చెదరిపోయెనా నీ కలలన్నియు విడచిపోయెనా నీ ఆశలు (2)
ఊఊ..

1. లేనిపోని మాటలు మోయలేని నిందలు
అడుగడుగున బ్రతుకులో - భారమాయెనా 
ఏమి చేయలేవంటూ ఏది చేతకాదంటూ 
పలుకువారి మాటలే కృంగదీసినా (2)
నమ్ముమూ యేసునూ చేయిపట్టి నడుపునూ
చేరుమూ సిలువను చేరదీసి నిలుపునూ ||ఎందు||

2. నలుగురు మెడపట్టి - ఉన్నవారు వెలివేసి 
పైకి రా లేవంటూ నవ్విపోయినా నలుదిక్కులు తిరుగుచూ బాధకు గురిచేస్తూ 
లేవలేవు అంటూనే విడచిపోయినా 2)
నమ్ముమూ యేసునూ చేయిపట్టి నడుపునూ
చేరుమూ సిలువను చేరదీసి నిలుపునూ ||ఎందు|| || ఎందు||

11 August 2023

Ebinejare ebinejare ఎబినేజరే Nenu na illu na inti నేను నా ఇల్లు నా ఇంటి


నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించేదము (2)
నీ కనుపాపలే నన్ను కాచి - నేను చెదరక మోసావు స్తోత్రం (2)

ఎబినేజరే - ఎబినేజరే - ఇంత కాలము కాచితివే
ఎబినేజరే - ఎబినేజరే - నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం - కౌగిలిలో దాచితివి స్తోత్రం

1.ఎడారిలో ఉన్న నా జీవితమును - మేళ్లతో నింపితివి (2)
ఒక కీడైన దరి చేరక నన్ను - తండ్రిగా కాచావు స్తోత్రం (2) ||ఎబెనేజరే||

2.ఆశలే లేని నా బ్రతుకును - నీ కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమను పాడగా - పదములు సరిపోవు తండ్రి (2) ||ఎబెనేజరే||

23 July 2023

Entho sundaramainavi ఎంతో సుందరమైనవి


267
సువార్తికుల ఘనత
రా - కళ్యాణి, తా - త్రిపుట 

ఎంతో సుందరమైనవి - ధర గిరులపై - నెంతో యందమైనవి = సంత తంబుఁ బరమ - ప్రేమను దెల్ప - సంతస మందుచు - సరిగ బ్రకటన జేయ = అంతటను బనిఁ బూని ప్రభు న త్యంతముగఁ బ్రక టించి వసుధ న - నంత మగు శుభవార్తఁ జాటెడు - వింత యగు బోధకుల పాదము ||లెంతో||

1.మందమతులగు వారలు - మూర్ఖత్వంబు - నొందు నెల్ల జనంబులు = వందుచుఁ గుందుచు - వన గిరి కందరము - లందు నున్న సకల - మౌ మోటుజన మెరుఁగఁ = పొందుగాఁ ప్రభు యే సొసంగెడు - సుందరం బగు సత్య వాక్యం - బందుకొని చాటించుచుండెడు - అంద మగు బోధ కుల పాదము ||లెంతో||

2.మదిలోఁ ప్రభుని నమ్మిన - పాపుల నెల్లఁ - తుదిని మోక్ష పదమ్మున = విదితమ్ముగాఁ జేర్చి - ప్రీతిఁ జూపున టంచు - ఇదిగో రమ్మని క్రీస్తు - పద సన్నిధిని జేర్ప - సదయులై శుభవార్తమానము = ముదమునను మదిలోన నిడి కొని - పదిలముగఁ ప్రకటించుచుండెడి - విదితు లగు బోధకుల పాదము ||లెంతో||

3.యేసు క్రీస్తు రారాజై - యున్నాఁడనుచు - భాసురంబుగఁ దెల్పుచు = వాసిగాఁ ప్రభు యేసు - వసుధ రక్షకుఁడనుచు యీ సువార్తను జాటి యిచట నెమ్మదినొంద - దోసకారి జనంబు లందరి - కీ సుమంగళ వార్తఁ దెలుపుచు - దోస మంతయుఁ బాపు మన ప్రభు - యేసుఁ జూపెడు వారి పాదము ||లెంతో||
- మేడికాయల సాధువు 

16 April 2023

Endhukani nenante | ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ


ఎందుకనీ నేనంటే - ఇంత ప్రేమ 
దేనికనీ నాపైన - ఇంత కరుణ 
జడివాన లోయలో - ఎదురీత బాటలో 
ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య ||ఎందుకనీ||
 
1.ఆశ చూపే లోకం- గాయాలు రేపెనే 
గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా 
ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా ||ఎందుకనీ||
 
2.మోయలేని భారం - నీపైన మోపగా 
ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా 
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా ||ఎందుకనీ||

22 March 2023

Endukayya ee vedhana | ఎందుకయ్యా ఈ వేదనా ఎవరి కొరకు


ఎందుకయ్యా ఈ వేదనా - ఎవరి కొరకు ఈ శోధనా (2)
ఎందుకొరకు ఈ త్యాగము -ఎవరి కొరకు ఈ బలిదానం (2) ||ఎందుకయ్యా||

1.రెల్లుగడ్డినే రాజదండముగా చేసి.. 
ముళ్ళ కిరీటము శిరమున మోపి.. (2)
మోము పైన ఉమ్మి వేసి ..వలువలులాగి విలువలు మరచి..
యూదుల రాజు నీవేనంటూ అపహసించిరి ... అవమానించిరి ||ఎందుకయ్యా||

2.పాప భారము భుజముపై మోస్తూ... కలువరికే పయనమవ్వగా.. (2)
సిలువ మ్రానును మోయలేక ..
తడబడు అడుగులతో సొమ్మసిల్లగా..(2)
ప్రేమ మనసులు తల్లడిల్లెను ...
కఠిన శిలలు కన్నీరు కార్చేను ||ఎందుకయ్యా||

10 October 2022

Ela undagalanu nee prema | ఎలా ఉండగలను నీ ప్రేమ

 

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా 
ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా 
ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను 
నీ తోడు నీడ లేకుండా 
నీ ప్రేమ వర్ణించలేనిది - నీ ప్రేమ వివరించలేనిది 
నీ ప్రేమ మరచి పోలేనిది - నీ ప్రేమ విడిచి పొలేనిది ||ఎలా|| 

శాశ్వత ప్రేమతో ప్రేమించావు  
కునుకక కాపాడి రక్షించావు (2)
విడువడ ఎడబాయక తోడున్నావు 
సర్వకాలము నాతో ఉన్నావు (2) ||నీ ప్రేమ|| 

శ్రమలలో నన్ను విడచిపోలేదు 
దుఃఖములో నన్ను ఓదార్చావు (2)
మెలులతో నన్ను తృప్తిపరిచావు  
నిత్యము నన్ను నాడిపించావు (2) ||నీ ప్రేమ|| 

పాపిని నన్ను ప్రేమించావు 
నా కొరకు నీ ప్రాణమిచ్చావు (2)
రక్తము చిందించి విమొచించావు 
నీ సొత్తుగా నన్ను చేసూకొన్నావు (2) ||నీ ప్రేమ||

24 September 2022

Evvaru unna lekunna| ఎవరు ఉన్నా లేకున్నా


ఎవరు ఉన్నా లేకున్నా -
యేసయ్య ఉంటే నాకు చాలు (2)
అందరి ప్రేమ అంతంత వరకే
యేసయ్య ప్రేమ అంతము వరకు (2) ||ఎవరు||  

కునుకడు నిదురపోడు
కాపాడుతాడు నన్నెప్పుడు (2)
ఆపదొచ్చినా అపాయమొచ్చినా (2)
రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు (2) ||అందరి|| 

తల్లి మరచినా తండ్రి విడచినా
నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు (2)
ముదిమి వచ్చినా తల నెరిసినా (2)
చంక పెట్టుకొని నన్ను మోస్తాడు (2) ||అందరి||  

అలసిన కృషించినా
తృప్తి పరచును నన్నెల్లప్పుడు (2)
శత్రువొచ్చినా శోధనలు చుట్టినా (2)
రెక్కలు చాపి నన్ను కాపాడును (2) ||అందరి||

11 September 2022

Entha pedda poratamo | ఎంత పెద్ద పోరాటమో

ఎంత పెద్ద పోరాటమో - అంత పెద్ద విజయమో (2)
పోరాడతాను నిత్యము - విజయమనేది తథ్యము (2)

వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత||

ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత||

యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2)
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత|

30 July 2022

Ela cheppanayya nee premanu | ఎలా చెప్పనయ్యా నీ ప్రేమను

ఎలా చెప్పనయ్యా నీ ప్రేమను నేనెలా తెలుపనయ్యా నీ త్యాగము (2)
సృష్టించిన చూపించా - సృష్టి అందము చూపించా
మాటలు వినిపించా- బలియాగము వివరించా (2) ||ఎలా||

1.దినుడై భువికొచ్చావనా - జీవపు వాక్యమును విత్తావనా (2)
అది ఏమైనా సరియే - నేనుసిద్ధముగా వున్నా నాతో మాట్లాడించుమయా (2) ||ఎలా|| 

2.అవమానమును బరియించావనా - మరణపు ముల్లును విరిచావనా (2)
అది ఏమైనా సరియే నేను సిద్ధముగా ఉన్నా నాతో మాట్లాడించుమయా (2) ||ఎలా||

08 June 2022

Etti vaado yesu enni vinthalu | ఎట్టి వాడో యేసు ఎన్ని వింతలు

ఎట్టి వాడో యేసు - ఎన్ని వింతలు తనవి 
వట్టి నరుడు కాడు - పట్టి చూడ ప్రభుని  (2) ||ఎట్టి||

గాలి సంద్రాలను - గద్దింపగా యేసు (2) 
హద్దు మీరక ఆగి - సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి||

పక్షవాతపు రోగిని - తక్షణమే లెమ్మనగా (2) 
పరుపెత్తుకొని లేచి - పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి || 

పట్టు యేసుని పాదం - తట్టు దేవుని ద్వారం (2) 
కట్టు ఇక నీ పాపం - నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||
                          – గోడి సామ్యూల్

20 May 2022

Evaru bhagyavanthu laudu| ఎవరు భాగ్యవంతు లౌదు

154  
ధన్యతలు
రా – యదుకుల కాంభోజి,  తా – ఆదీ

ఎవరు భాగ్యవంతు లౌదు - ¹రవని లోపల = మోక్ష - ²వివరమైన క్రీస్తు బోధ - చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||

1.³కవులు లాభ ⁴మరసి చేయు - కపట మంత్రముల్ = విధులు - ⁵దవులఁ బోవఁ దరిమి యేసు ⁶తత్వముఁగొనువారికన్న ||నెవరు||

2.దీనమానసుల కట్టి ⁷యుప - దేశ మిచ్చెను = దివ్య - మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు - ప్రభువు తెల్పె ||నెవరు||

3.⁸వృజినములకై దుఃఖించెడి - సుజను లెవ్వరో = వారు - నిజముగ నోదార్పుఁ బొంది నిత్య ⁹సంతోషింతు లని తెల్పె ||నెవరు||

4.శాంతి నీతికరుణల యందా - సక్తిగల వారు = భూస్వతంత్రులై పరి తృప్తినొంది - దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||

5.పరిశుద్ధ హృదయులు ¹⁰పరా - త్పరునఁ జూతురు = సర్వ - నరుల సమాధానపరచు - నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||

6.నీతికొర కాపద నొందెడి - నిశ్చ లాత్ములు = వారు - ¹¹ఖ్యాతిగఁ బర లోక రాజ్య - ఘన సౌఖ్యము లెల్లను ¹²బడయుదురు ||ఎవరు||
                          – పురుషోత్తము చౌదరి
--------------------------------------------------
¹భూమిపైన. ²స్పష్టమై. ³కవిత్వము చెప్పువారు. ⁴విచారించి పాపములకై. ⁵దూరముగ. ⁶వాస్తవము. ⁷బోధ. ⁸పాపములకై. ⁹సంతోషింపచేయబడువారు. ¹⁰దేవుని. '¹¹ప్రసిద్ధిగా. " ¹²పొందుదురు.

12 May 2022

Entha manchi prema needi | ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా 
నీలా ప్రేమించేది ఎవరయ్యా (2)
అడగక పోయినా అక్కరలెరిగిన (2) 
అల్ఫా ఓమేగవు నీవె కదా (2) ||ఎంత|| 

నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై (2)
రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు (2)
రాజులను మార్చిన రారాజువు (2)
రాజ్యలని కూల్చిన జయశాలివి (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2)
యేసయ్యా నీ కృపయే అమరం 2 ||ఎంత|| 

నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై (2) 
అధికారుల అహమును అణచినవాడ (2)
అధికారులను మార్చిన వాడా (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2) 
యేసయ్యా నీ కృపయే అమరం (2) ||ఎంత|| 

నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై (2)
ఆకాశమునుండి మన్నాను పంపావు (2) 
బండను చీల్చిన బలవంతుడా -
మారా మధురంగా మార్చినవాడా (2)
యేసయ్యా నీ ప్రేమే మధురం (2) 
యేసయ్యా నీ కృపయే అమరం (2) ||ఎంత|| 

18 March 2022

Enaleni sthuthulatho | ఎనలేని స్తుతులతో ఆరాధింతుము

ఎనలేని స్తుతులతో - ఆరాధింతుము ప్రభువా (2)
దీన మనసుతో - నిన్ను కొలుతుమయ్యా (2) ||ఎనలేని||

1. నీ నామ గానం మాకెంతో ముదము - నీ ప్రేమ వాత్సల్యం మాకెంతో ప్రియము (2)
నీ కార్యములే ఆశ్చర్య కార్యములు - నీ తలంపులే మాకెంతో మధురం (2) ||ఎనలేని||

2. మా ఉన్నత దుర్గము మాదేవుడే - మేమాశ్రయించిన మా శైలము (2)
మా దీపమును వెలిగించువాడు - మా దేవుడే మాకు వెలుగు (2) ||ఎనలేని||

3. సన్మార్గమందు నడిపించినావు - దుర్మార్గులందరిని రక్షించినావు (2)
దరిచేరి నమ్మిన దీనులందరిని - నీ ఆత్మ ద్వారా నడిపించినావు (2) ||ఎనలేని||
DOWNLOAD MP3 SONG HERE 👇

Ennadu gaanchedamo yesuni | ఎన్నఁడు గాంచెదమో యేసుని

195           
క్రీస్తు శ్రమల ధ్యానము
రా- ముఖారి, తా- ఆది
(ఛాయ: పాపము దలచు సుమీ) తా- ఆది

ఎన్నఁడు గాంచెదమో యేసుని -  నెన్నఁడు గాంచెదమో = యెన్నఁడు జూతుము - కన్నె కుమారుని - సన్నుతి జేయుచును ||నెన్నఁడు||

1.అంధుల గాచె నఁట - యెహోవా - నందనుఁ డితఁడౌనట = పొందుగఁ బాపాత్ములకొర - కై తన - ప్రాణము విడిచెనఁట ||యెన్నఁడు||

2.వేసిరి సిలువనఁట - క్రీస్తుని - జేసిరి హేళనఁట =  డాసిరి యూదులఁట - బల్లెము - దూసిరి ప్రక్కనఁట ||యెన్నఁడు||

3.చిందెను రక్తమఁట - పరమ - సంధులు దెల్పెనఁట = నిందల కోర్చె నఁట - మన దగు - నేరము గాచెనఁట ||యెన్నఁడు||

4.ఆపద కోర్చెనఁట - పాపపు - మోపులు మోసెనఁట = కోపము మాన్పెనఁ ట - యెహోవా - కొడుకై వెలసెనఁట ||యెన్నఁడు||

5.అక్షయుఁ డితఁడెనఁట - జగతికి - రక్షకుఁ డాయెనఁట = దీక్షగ నమ్మిన నరులం - దరికి ని - రీక్షణ దేవుఁడఁట ||యెన్నఁడు||
                     – గొల్లపల్లి నతానియేలు

06 March 2022

Entha krupamayadavu yesayya | ఎంత కృపామయుడవు యేసయ్యా

ఎంత కృపామయుడవు యేసయ్యా - ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా (2)
నలిగితివి వేసారితీవి - నలిగితివి వేసారితీవి (2)
నాకై ప్రాణము నిచ్చితివి - నాకై ప్రాణము నిచ్చితివి (2)

1. బండ లాంటిది నాదు మొండి హృదయం -
 ఎండిపోయిన నాదు పాప జీవితం (2)
మార్చితివి నీ స్వాస్త్యముగ (2)
ఇచ్చినావు మెత్తనైనా కొత్తహృదయం (2) ||ఎంత||

2.వ్యాధి బాధలందు నేను క్రుంగీయుండగా - ఆదరించెను నీ వాక్యము నన్ను (2)
స్వస్ఠపరచెను నీ హస్తము నన్ను (2) 
ప్రేమతో పిలచిన నాధుడవు (2) ||ఎంత||

3.కన్న తల్లి తండ్రులు నన్ను విడచినను - 
ఈ లోకము నను వెలివేసిన (2)
మరువలేదు నన్ను విడువలేదు (2) 
ప్రేమతో పిలచిన నాధుడవు (2) ||ఎంత||

4.ఆదరణ లేని నన్ను ప్రేమించితివి - 
అభిషేకించితివి ఆత్మలోను (2)
నిలచుటకు ఫలించుటకు (2)
ఆత్మతో నను ముద్రించితివి (2) ||ఎంత||

02 March 2022

Entho dhukhamu bondithiva | ఎంతో దుఃఖముఁ బొందితివా

182
సిలువలోని దైవ ప్రేమ
రా - ముఖారి,  తా - త్రిపుట

ఎంతో దుఃఖముఁ బొందితివా - నాకొర కెంతో - దుఃఖము పొంది తివా = యెంతో దుఃఖము నీకు - ఎంతో చింతయు నీకు - ఎంతో దిగులయ్యా నాకు - ఆ - పొంతి పిలాతు యూ - దులు నీకుఁ బెట్టిన - శ్రమలను దలపోయఁ గా ||నెంతో||
 
1.వచ్చిరి యూదులు - ముచ్చట లాడుచు - నెచ్చట వాఁడనుచు = నిన్ను - మచ్చరముతో వారి - యిచ్చ వచ్చినట్లు - కొట్టి దూషించినారా ||యెంతో||
 
2.సుందరమగు దేహ - మందున దెబ్బలు - గ్రంధులు గట్టినవా = నీవు - పొందిన బాధ నా - డెందము తలఁపనా - నందములే దాయెను ||ఎంతో||
 
3.కొట్టుకొట్టుమని - తిట్టికేల్ దట్టిని - న్నట్టిట్టు నెట్టుచును = వారు - పెట్టుశ్రమలు తుద - మట్టున కోర్చియుఁ - బెట్టితివా ప్రాణము ||నెంతో||
 
4.నెపముఁ బెట్టుచుఁ దిట్టి - యపహసించుచు యూద - చపలులు గొట్టి నారా = నా - యపరాధములకు నా - పదలను బొంది నీ - కృప నాకుఁ జూపినావా ||యెంతో||
 
5.చక్కని నా యేసు - మిక్కిలి బాధ నీ - కెక్కువ గలిగె నయ్యా = ఆహా - యొక్క దుష్టుఁడీటె - ప్రక్కను గ్రుచ్చి తన - యక్కస దీర్చుకొనెనా ||యెంతో||
 
6.అన్నదమ్ములైన - అక్క సెల్లెం డ్రైనఁ - కన్న పిత్రాదు లైన = నన్ను - ఎన్నఁ డైన బ్రేమించలే రైరి నా - యన్నా ప్రేమించినావా ||యెంతో||
  – బూదాల లైమన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...