Showing posts with label Yesayya namamlo shakthi. Show all posts
Showing posts with label Yesayya namamlo shakthi. Show all posts

25 March 2022

Yesayya namamlo shakthi | యేసయ్య నామంలో శక్తి

యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా
నమ్మితే చాలు నీవు - పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య||

1. పాపాలను క్షమియించే - శక్తి కలిగినది యేసయ్య నామం
పాపిని పవిత్రపరచే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||

2. రోగికి స్వస్థతనిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం
మనసుకు నెమ్మదినిచ్చే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||

3. దురాత్మలను పారద్రోలే - శక్తి కలిగినది యేసయ్య నామం
దుఃఖితులను ఆదరించే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||

4. సృష్టిని శాసించగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం
మృతులను లేపగలిగిన - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||

5. పాతాళాన్ని తప్పించే - శక్తి కలిగినది యేసయ్య నామం
పరలోకానికి చేర్చే - శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...