Showing posts with label Chikati Dharule Vembadinchaga lyrics. Show all posts
Showing posts with label Chikati Dharule Vembadinchaga lyrics. Show all posts

27 March 2021

Chikati Dharule Vembadinchaga | చీకటిధారులే వెంబడించగా సూర్యుడు

చీకటి ధారులే వెంబడించగా - 
సూర్యుడు పగలే అస్తమించెను (2)
ఎంతో నొప్పిని భరియిస్తూ - 
నిందలన్నిటినీ సహియిస్తూ(2)
యేసూ మనకై మరణించెను 
                                             ||చీకటి||
1. ఎనలేని గాయాలను రేపుతూనే - 
యేసుని దాహము తీర్చగలవా ? 
హోసన్నా నీకే జయమంటూనే యేసుని సిలువకప్పగించితివా (2)
జోహారులు నీ అపార ప్రేమకు - 
జోహారులు నీ అమర ప్రేమకు 
జోహారులు నీ అమూల్య ప్రేమకు - 
యేసు జోహారులు - ఆ కలువరి ప్రేమకు 
                                             ||చీకటి||
2. బల్లెపు పోటు ముళ్ల మకుటము - 
కొరడా దెబ్బలు నీకై సహియించెను 
తనపై ఉమ్మి వేసినా నీకై యేసు - 
తన రక్తాన్ని చిందించెను (2)
జోహారులు నీ అపార ప్రేమకు - 
జోహారులు నీ అమర ప్రేమకు 
జోహారులు నీ అమూల్య ప్రేమకు - 
యేసు జోహారులు - ఆ కలువరి ప్రేమకు 
                                             ||చీకటి||
3. కలువరి సిలువ క్రీస్తు ప్రేమ ధారలు - 
నీ హృదయానికి చేదాయెనా -
ఆ త్యాగము బలియాగము నీకేనని తెలిసీ -
నీ గుండెయే బండాయెనా(2)
జోహారులు నీ అపార ప్రేమకు - 
జోహారులు నీ అమర ప్రేమకు 
జోహారులు నీ అమూల్య ప్రేమకు - 
యేసు జోహారులు - ఆ కలువరి ప్రేమకు
                                             ||చీకటి||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...