Showing posts with label yehova maa thandri kada lyrics. Show all posts
Showing posts with label yehova maa thandri kada lyrics. Show all posts

18 August 2020

Yehova maa thandri kada | యెహోవా మా తండ్రి గాడ

435 
మన బంధువులు 
రా - నవరోజు, తా - ఆది 

యెహోవా మాతండ్రి గాడ - యేసుడు మాయన్న గాడ = మహిమగల శుద్ధాత్మయిట్టి - వరుసదెలిపె గదమాతోడ ||యెహోవా॥

1.మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్ మా స్నేహితులు = సాక్షాత్కారమై యున్నపుడు - లక్ష్య పెట్ట మిహ బాధలను ||యెహోవా||

2.అబ్రాహాము దావీదు మొదలై - నట్టి వర భక్తా గ్రేసరులే = శుభ్రముగ మా చుట్టాలైనన్ - హర్ష మిక మాకేమి కొదువ ||యెహోవా||

3.పేతు రాది సకలాపోస్తుల్ - పేర్మిగల మా నిజ కూటస్థుల్ = ఖ్యాతి సభలో మేమున్నప్పుడు - ఘనతలిక మా కేమి వెలితి ||యెహోవా||

4.తనువు బలి పెట్టెను మాయన్న - తప్పు ల్విడ గొట్టెను మా తండ్రి = మనసులో సాక్ష్యమిట్లున్న - మనుజు లెట్లన్నను మాకేమి ||యెహోవా||

5.పరమ విభు జీవ గ్రంథములో - బ్రభుని రక్తాక్షర ముద్రితమై = చిరముగా నుండు మా పేరు - చెఱుపు బెట్టెడువా రింకెవరు||యెహోవా||

6.కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని = పరమ ఫలముల్ మా కున్నపుడు - సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||
    - పురుషోత్తము చౌదరి 
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...