కలనైనా ఇలా మరతును - ఎనలేని నీ ప్రేమను
నీవేగా నీవేగా... నీవే నా ప్రాణ దైవమా
1.శిలనేనైన రూపం చేసి - జీవం పోసితివి
నిరతము నాకు మాదిరి నీవై - దారి చూపితివి
నా చేతులను సుఖముతో నింపి - నడిపే నీ ప్రేమ
అపారము నీ దయాగుణం - అనంతము నీ ప్రేమామృతం (2) నీవు నా ప్రాణం
2.ఊహకు అందని త్యాగం చేసి - శ్వాసై నిలిచావు
నీ ముఖకాంతిలో వెలుగై నన్ను - మార్చుకొన్నావు
గతమేదైనా ప్రేమించావు స్తుతికే పాత్రుడవు
ప్రతిక్షణం నా నిరాశలో - ప్రభాతమైనా నా యేసయ్య (2) నీవు నా ధ్యానం ||మన్నించినా||