Showing posts with label ఓడిపోనివ్వడు యేసయ్య. Show all posts
Showing posts with label ఓడిపోనివ్వడు యేసయ్య. Show all posts

10 July 2022

Odiponivvadu yesayya | ఓడిపోనివ్వడు యేసయ్య

ఓడిపోనివ్వడు యేసయ్య - ఓడిపోనివ్వడు (2)
ఓటమి తప్పని రోజైననూ - ఓడిపోనివ్వడు
చెయి దాటిపోయిన స్థితులైననూ - ఓడిపోనివ్వడు (2)
||ఓడిపోనివ్వడు||

1.పందెమందు ఉండగా - ఓపికతో సాగాలిగా
ధైర్యం ప్రభు మనలో నింపెగా - పౌలు లాగా సాగాలిగా (2)
గురి యొద్దకే నీ ప్రయాణము
ఉన్నత పిలుపునకు బహుమానము (2)
సీయోనులో మన స్థానము సుస్థిరము (2) ||ఓడిపోనివ్వడు||

2.నా అన్న వారే కాదనగా - రక్త సంబంధులై వెల కట్టారుగా
బానిసను చేసి అమ్మారుగా - యోసేపును చూసాడుగా (2)
తోడుండెనన్న వాగ్ధానము
రాజుల యెదుటే తనకు సన్మానము (2)
మహా చక్రవర్తి క్రీస్తు మదిలో స్థానము (2)

దాటిపోడెన్నడు యేసయ్య - దాటిపోడెన్నడు (2)
దీన స్థితిలో మనమున్ననూ - దాటిపోడెన్నడు
నవ్వుల పాలైన రోజైననూ - దాటిపోడెన్నడు (2) ||ఓడిపోనివ్వడు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...