Showing posts with label 685 రండి రండి యేసుని యొద్దకు. Show all posts
Showing posts with label 685 రండి రండి యేసుని యొద్దకు. Show all posts

06 July 2020

Randi Randi Yesuni Yoddaku | రండి రండి యేసుని యొద్దకు

685

రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు 
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే (2) ||రండి||

1.యేసుని పిలుపు వినియు నింక - యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన - అబ్బదు శాంతి ఆత్మకు నిలలో (2) ||రండి||

2.కరవు రణము మరణము చూచి - కలుగదు మారు మనస్సు
ప్రవచనములు సంపూర్ణము లాయెను - యూదులు తిరిగి వచ్చుచున్నారు (2) ||రండి||

3.ప్రభుయేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చెగదా 
సిలువను రక్తము చిందించియును - 
బలియాయెను యాఘనుడు మనకై (2) ||రండి||

4.యేసుని నామమునందే పరమ - నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును - 
శక్తిమంతుడు యేసే యిచ్చును (2) ||రండి||

5. నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును
నేనే గాకింకెవరు లేరని - 
యెంచి చెప్పిన యేసుని యొద్దకు(2) ||రండి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...