Showing posts with label గుంజా వెంకటరత్నము. Show all posts
Showing posts with label గుంజా వెంకటరత్నము. Show all posts

21 August 2020

Yehova sannidhini nee | యెహోవ సన్నిధిని నీ స్తోత్ర

583
కోఁత పండుగ
రా - శంకరాభరణము,  తా - ఆది

యెహోవ సన్నిధిని - నీ స్తోత్ర గానముతో =  మహోపకారునకు - మానుగనర్పణ సమర్పించుడి ||యెహోవ||

1.ప్రభు వడుగు నర్పణలు - ప్రేమ కృతజ్ఞతలు = అభయ ప్రధానములు - విభునకు నియ్యుడు విరివిగను ||యెహోవ|| 

2.రిక్త హస్తములతో - రావలదు సన్నిధికి = భక్త వత్సలునకు - శక్తికొలది మీ రర్పించుడి ||యెహోవ||

3.శృంగారాలయమిలలో - పొంగార గట్టుటకు = బంగారు వెండి యును బాగుగ నియ్యుండి ప్రభుపేర ||యెహోవ||

4.వరుమానములచేత - వాంఛింప వలదండి = గురునాజ్ఞ చొప్పునను - విరివిగ హృదయము లర్పించుడి ||యెహోవ||

5.యెహోవ జనులారా - యియ్యుండి మనసార = యెహోవ యిచ్చినది - యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ||
- గుంజా వెంకటరత్నము
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...