Showing posts with label స్తుతి సింహాసనాసీనుడా. Show all posts
Showing posts with label స్తుతి సింహాసనాసీనుడా. Show all posts

08 April 2022

Sthuthi simhasanaseenuda na aardhanaku | స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా - నాఆరాధనకు యోగ్యుడా (2)
నాలో నీవుండగ నీలో నేనుండగ - ఇక నేనేల భయపడుదును (2)
 
1.ఆకాశము నీ సింహాసనం - భూమి నీ పాదపీఠం (2)
ఆ సింహాసనం విడిచి సిలువకు దిగివచ్చి ప్రాణ త్యాగము చేసి (2)
నీ ప్రేమామృతం త్రాగించితివి - నిను స్తుతించుటకు బ్రతికించితివి (2) ||స్తుతి||
  
2.రాజాధిరాజా ప్రభువులకు ప్రభువా - ఎవరు నీకిలలో సాటి (2)
సదాకాలం నిలిచే నీ సింహాసనం - జయించిన వారికే సొంతం (2)
ఈ జీవన పోరాటములో - నాకు జయమిచ్చుట నీకే సాధ్యం (2) ||స్తుతి||
 
3.నా రాజ్యము లోకసంబంధమైనది - కానే కాదంటివే (2)
నా షాలేము రారాజ స్థాపించితివి - నీ బలముతొ ప్రేమరాజ్యం (2)
మార్పు లేని నీ కృపకు నా ప్రభువా - మార్చితివే నీ రాజ్య పౌరుని (2) ||స్తుతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Sthuthi simhasanaseenuda | స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా - అత్యంత ప్రేమామయుడా (2)
పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా (2)
ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే (2)
 
1. ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త - బలవంతుడగు దేవా - నిత్యుడగు తండ్రి (2)
సమాధాన కర్తయగు అధిపతి నీవే.. ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే. (2)
ఆరాధనా నీకే (2)
 
2. మా రక్షణకర్త మారని మా దేవా - మాలోన వసియించు  మహిమా స్వరూప (2)
మహిమా ఘనతా ప్రభావము నీకే.. ఆరాధన నీకే (2)
ఆరాధనా నీకే.. ఆరాధనా నీకే (2)
ఆరాధనా నీకే (2) ||స్తుతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

24 August 2020

Sthuthi simhasanasinuda yesuraja lyrics | స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా - యేసురాజా దివ్యతేజ
 
1. అద్వితీయుడవు - అతి సుందరుడవు - నీవే ప్రభు
నీతి న్యాయములు నీ - సింహాసనాధారం
కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు  ||స్తుతి||
 
2. బలియు అర్పణ - కోరవు నీవు బలియైతివి - 
నా  దోషముకై - నా హృదయమే నీ ప్రియమగు ఆలయం 
స్తుతియాగము నే చేసెద నిరతం ||స్తుతి||
 
3. బూరధ్వనులే - నింగిలో మ్రోగగ రాజాధిరాజా - నీవే - వచ్చు వేళ సంసిద్ధతతో - వెలిగే సిద్దెతో
 పెండ్లి కుమారుడా నిన్నెదుర్కొందును ||స్తుతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...