Showing posts with label 071 నీవు నా దేవుండవై యున్నావు. Show all posts
Showing posts with label 071 నీవు నా దేవుండవై యున్నావు. Show all posts

19 August 2021

Neevu Naa Devudavai Unnavu | నీవు నా దేవుండవై యున్నావు

71                        క్రీస్తును స్తుతించుట
రా - ముఖారి                                            తా - త్రిపుట
                   
నీవు నా దేవుండవై యు – న్నావు యేసు నాధ నీవిలఁ – బ్రోవవే ! నన్నుఁ గావవే ||నీవు||

1. పాప మానవ – శాప భారము – నోపి సిల్వను – బడిన క్షేమా – ధిపతి సర్వ – భూపతి ||నీవు||

2. శ్రేయమౌ కా - యంబు భక్తుల – కీయ సిద్ధముఁ జేయు యేసు - నాయకా - మోక్ష – దాయకా ||నీవు||

3. జీవ మారెడి – త్రోవ నేఁబడి – చావనై యున్నాను పతిత – పావనా యాత్మ – జీవనా ||నీవు||

4. జాగు సేయక – బాగు సేయను – రాఁగదె నే ఘోర పాప – రోగిని – దుఃఖ – భాగిని ||నీవు||

5. పాపమున నా - రూపు మాపితి – ప్రాపు నీవని నమ్మితిని నను లేపనా – కృపను – జూపవా ||నీవు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...