Showing posts with label 191 ఎంతో వింత యెంతో చింత. Show all posts
Showing posts with label 191 ఎంతో వింత యెంతో చింత. Show all posts

16 August 2020

Entho Vintha Yentho Chintha | ఎంతో వింత యెంతో చింత

ఎంతో వింత యెంతో చింత - యేసునాధు మరణ మంత = పంతముతో జేసి రంత - సొంత ప్రజలు స్వామినంత ||ఎంతో||

1. పట్టికట్టి నెట్టి కొట్టి - తిట్టి రేసు నాధు నకటా = అట్టిశ్రమల నొందిపలుక - డాయెయేసు స్వామినాడు ||ఎంతో||

2. మొయ్యలేని మ్రానునొకటి - మోపి రేసు వీపుపైని = మొయ్యలేక మౌనితోడ - మూర్ఛబోయె నేసుతండ్రి ||ఎంతో||

3. కొయ్యపై నేసయ్యన్ బెట్టి - కాలు సేతులలో జిలల్ = కరినులంత గూడి కొట్టిరి - ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ||ఎంతో||

4.దాహముగొన జేదుచిరక - ద్రావనిడిరి ద్రోహులకటా = ధాత్రి ప్రజల బాధ కోర్చి - ధన్యుడా దివి కేగె నహహా ||ఎంతో||

5.బల్లెముతోబ్రక్కన్ బొడవన్ - పారెనీరు రక్తమహహా = ఏరైపారె యేసురక్త - మెల్ల ప్రజల కెలమి నొసగు ||నెంతో||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...