Showing posts with label 064 ఎంత ప్రేమించెనో దేవుఁడు. Show all posts
Showing posts with label 064 ఎంత ప్రేమించెనో దేవుఁడు. Show all posts

20 August 2021

Entha Premincheno Devudu | ఎంత ప్రేమించెనో దేవుఁడు

64
దేవుని ప్రేమ
రా – సురటి,  తా – ఆది  
(ఛాయ: కూడికొని యున్నాము)
                       
ఎంత ప్రేమించెనో - దేవుఁడు మనపై - నెంత దయఁజూ పెనో = వింతగల యీ దైవ ప్రేమను - సాంతమున ధ్యానింపరే || ఎంత ||

1.పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ - ఘనదేవునికి పిల్లలమనబడుటకై = తన కుమారుని మరణ బలిరక్తమున మన - లను స్వీకరించుకొనెను దీనిని జూడరే || ఎంత ||

2.పెంటకుప్పమీఁద పడియున్న యీ నీచ - మంటి పురుగులను లేవనెత్తి = మింటి పై ఘనులతోఁ గూర్చుండఁజేయ నీ - మంటి కేతెంచె మన - వంటి దేహము దాల్చి || ఎంత ||

3.ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ - సాక్షాత్తుగా మనపయినుండగా= ఈ క్షితి నా ప్రేమ ద్రాక్షారసముకంటె - దీక్షగవేడి యపేక్షింప తగునాహా || ఎంత ||

4.మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన - ఘనుఁడా కాశమునుండి మరలి వచ్చి = మన దైన్యదేహమును తనరూపముకు మార్చి - కొనిపోయి తన రాజ్యమును మనకీయును || ఎంత ||

5.గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ - పెట్టియున్న సత్ క్రైస్తవులూ ప్రభు = డెట్టివాఁడొ మనమునట్టి వారుగ ప్రభుని - కట్టడలను మదిని బెట్టియుందము వేడ్క || నెంత ||
                                  - చదలవాడ జకర్యా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...