Showing posts with label good Friday song. Show all posts
Showing posts with label good Friday song. Show all posts

27 March 2022

Siluvalo nee rupame | సిలువలో నీ రూపమే

సిలువలో నీ రూపమే - రక్తమయమాయె నాకోసమే
ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు (2)

కపట ముద్దులు మోమున గుద్దులు - కఠినగాయాలు కందిన నీ ఒళ్లు (2)
కారినా రక్తం పారెను ఏరులై (2)
కలుషాత్ముడ నను కడుగనేగా (2) ||సిలువలో||

అన్నెం పున్నెం ఎరుగని నీవు - అక్రమ మన్యాయం అసలే ఎరుగవు (2)
అన్యాయము నీకు న్యాయము చెప్పేనా
అరుపుల కేకల అలజడిలోన (2) ||సిలువలో||

19 February 2021

Siluva mranupai vrelade | సిలువ మ్రానుపై వ్రేలాడే

సిలువ మ్రానుపై వ్రేలాడే - ఈ ఘోరపాపికై రక్తము కార్చే
నా యేసయ్యా...నా యేసయ్యా...నా యేసయ్యా ||సిలువ||
 
1.నా పాప సంకెళ్ళలో - చిక్కుకున్న నీ దేహము -
నను విడుదల చేయుటకై - నీవు చేసినా ఈ యాగము (2)
భరియించితివా సహియించితివా - ఈ పాపికై బలియైతివా (2) 
ఈ పాపికై బలియైతివా  ||సిలువ||
 
2.ఏ పాపమెరుగని నిన్నూ - హింసించినా ఈ లోకము -
ఏ నేరమెరుగని నిన్నూ - శిక్షించినా ఆ సైన్యము (2)
క్షమియించివా రక్షించితివా - నాపై నీ ప్రేమ చూపించితివా (2)
నాపై నీ ప్రేమ చూపించితివా ||సిలువ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...