Showing posts with label పేదనరుని రూపము ధరించి యేసురాజు. Show all posts
Showing posts with label పేదనరుని రూపము ధరించి యేసురాజు. Show all posts

02 May 2021

Peda Naruni Rupamu Dharinchi | పేద నరుని రూపము ధరించి యేసురాజు


పేదనరుని రూపము ధరించి - యేసురాజు నీ చెంత నిలచే
అంగీకరించు మాయనను ||పేదనరుని||

1. కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడే -
    నింద వేదన శ్రమలను సహించెనేసు (2)
    చిందే తనదు రక్తము నీ పాపముకై (2)
    దీనుడై నిన్ను పిలచుచుండే (2) ||పేదనరుని||

2. తలవాల్చుటకు ఇల స్థలమే లేదు -
    దప్పి తీర్చుకొన నీరు దొరక లేదు (2)
    తన్ను ఆధరించు వారెవరు లేరు 
    ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే 
    పాట్లుపడే నిన్ను విడిపింపను (2)
                                       ||పేదనరుని||
3. మాయ లోకమును నీవు నమ్మకుము
    మనుష్యుల మనస్సు మారిపోవునిలా (2)
    నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు 
    నిశ్చయముగా ప్రభువులో ఆనందింప 
    నేడే రమ్ము విస్వాసముతో (2) ||పేదనరుని||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...