Showing posts with label Ee Roju Sajeevamuga Neelo lyrics. Show all posts
Showing posts with label Ee Roju Sajeevamuga Neelo lyrics. Show all posts

27 March 2021

Ee roju sajeevuniga neelo | ఈ రోజు సజీవునిగా నీలో జీవింప

ఈ రోజు సజీవునిగా నీలో జీవింప చేసితివే
కృతజ్ఞత స్తుతి చెల్లింతునయ్యా - 
నిత్యమూ నీసన్నిధిలో (2)

1.ఆకర్షించేను నీప్రేమ నన్ను -
సుందరుడా మనోహరుడా (2)
యేసయ్య నీ ప్రేమలోనే - 
మనసుకి నెమ్మది - ఆదరణ దొరికే (2)
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా ||ఈ రోజు||

2.మరుగైయున్న పరలోక సంగతులు -
పామరుడను నాకు తెలియజేసితివి (2) 
ఆత్మదీపం వెలిగించి నాలో -
నీతో నడచుటకు - కృపచూపితివే ( 2)
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా ||ఈ రోజు||

3.నూతన యెరూషలేము నా నివాసమని -
నూతన సృష్టిగా నన్ను మార్చినావు (2)
నూతన వధువుగా సిద్ధపడుచు -
ఎదురుచూస్తూ - జీవింతునయ్యా (2)
ఆ హల్లెలూయా - ఆ హల్లెలూయా ||ఈ రోజు||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...