Showing posts with label ఓ జీవజలరాశి యేసువా. Show all posts
Showing posts with label ఓ జీవజలరాశి యేసువా. Show all posts

25 May 2021

Oh jeeva jalarasi Yesuva | ఓ జీవజలరాశి యేసువా

ఓ జీవజలరాశి యేసువా నీ జీవ జలధార గ్రోలితిన్ 
ఏ దారి కానక ఈ అడవిలోన ఆయాస మొందంగ దాహంబుతో (2)
                                           ||ఓ జీవజలరాశి||
1. జీవామృతంపు ఊటగా - చావొందు లోకాన ప్రవహింపగా (2)
జీవచ్ఛవము లా పడియున్న నన్ను - జీవంబు పుట్టించి బ్రతికించినావా (2)
                                             ||ఓ జీవజలరాశి||
2. ఆనంద రాజ్య సమృద్ధివై - ఆనంద వాహినివై ప్రవహించినావా (2)
నీ నిండు దీవెనలు కురిపించి నాలో - ఆనంద భాగ్యాలు పండించుమా (2)
                                             ||ఓ జీవజలరాశి||
3. నే చిన్ని కాలువ భూలోకమందు - నీ జీవాధారలు నను నింపగా (2)
వేలాది జీవులే నీరంబులోన - పరలోక జీవులై జీవింతురు (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...