Showing posts with label Bethlehemu Nagarilo Pashula Paka lyrics. Show all posts
Showing posts with label Bethlehemu Nagarilo Pashula Paka lyrics. Show all posts

14 April 2021

Bethlehemu Nagarilo Pashula Paka | బెత్లహేము నగరిలో పశువుల

బెత్లహేము నగరిలో పశువుల పాక నీడలో
రారాజు పుట్టెను తనే యేసు దైవము
సర్వలోకానికి నేడే శుభోదయం 
శుభోదయం శుభోదయం

కన్నెమరియ కన్నతల్లిగా ఎన్నటికి మరువలేని కల్పవల్లిగా
లాలి లాలి లాలియని యేసు బాలా జోలని 
లోకమంతా ఉయ్యాలగా ఊపినట్టి దేవతరా
చాటరా యేసు నామము దాటరా నరకలోకము
నేడే శుభోదయం

లేమి ఇంట ఉన్నవాడుగా వెలసినావు ప్రేమజ్యోతిగా
నీవు లేని హృదయము ఏమీలేని సదనము
ఏమి సుఖము పొందుటకొ పుట్టితివి మట్టిలో
చాటరా యేసు నామము దాటరా నరకలోకము 
నేడే శుభోదయం

పల్లెలోని గొల్లవారలు వెళ్ళిరిగా ప్రభునిచూడ తెల్లవారులు
మంచి గొర్రెల కాపరి మనకు వెలుగునిచ్చురా 
మందలన్నీ మేపుటకే కన్నె మరియ కన్నదిరా
చాటరా యేసు నామము దాటరా నరకలోకం 
నేడే శుభోదయం

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...