Uhinchalenayya vivarinchalenayya ఊహించలేనయ్యా వివరించలేనయ్యా


ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఎనలేని నీ ప్రేమను (2)
నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)
తరియించు వరమే దొరికెను (2) ||ఊహించ||

1.నా మనసు వేదనలో - నాకున్న శోధనలో
ఉల్లాసమే పంచెను
ఓ మధుర భావనలో - తుదిలేని లాలనలో
మధురామృతమునే నింపెను (2)
అనాథయిన నను వెదకెను
ప్రధానులలో ఉంచెను (2) ||ఊహించ||

2.నీ మరణ వేదనలో - నీ సిలువ శోధనలో
నీ ప్రేమ రుజువై నిలిచెను
వెలలేని త్యాగముతో - అనురాగ బోధలతో
నా హృదయమే కరిగెను (2)
ఇది నీ ప్రేమకే సాధ్యము
వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ||

Ninnu nammi vacchi ne siggu chendhaledhu నిన్ను నమ్మి వచ్చి, నే సిగ్గుచెందలేదు


నిన్ను నమ్మి ఏమి - నే సిగ్గుచెందలేదు
నిన్ను నమ్మి వచ్చి - ఏమి సిగ్గుచెందలేదు

నిన్ను నమ్మి ఏమి - నే సిగ్గుచెందలేదు
నీ దయ నన్ను చేయి విడువ లేదు
వట్టి చేతితో వచ్చితిని - రెండు పరివారాలనిచ్చితివే (2)

ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి ఏల్‌-ఎలోహేయి
నిన్నే స్తుతింతున్..

గాయపడ్డాను - కన్నీళ్లు కార్చాను
కలతచెందిన నన్ను కరుణించావు
నిబంధనను నాతో చేసితివే
కోల్పోయినవన్నీ ఇచ్చితివే (2) ||ఏల్‌||

ప్రియులందరు విడిచి పోయినా
ప్రియమైనవన్నీ నాకిచ్చితివే (2)
పరదేశిగా నేనున్న చోటే
స్వాస్థ్యముగా నాకు మార్చితివే ||ఏల్‌||

Vishwasamutho vededi variki విశ్వాసముతో వేఁడెడి వారికి

388
విశ్వాస ప్రార్థన 
(ఛాయ: మనసానందము) 
రా - సౌరాష్ట్ర, తా - ఆది 

విశ్వాసముతో - వేఁడెడి వారికి - విశ్వ మంతయును - వీల్పడును = శాశ్వత రాజ్య - థీశ్వరుఁ డాఢ్యుఁడు - శాశ్వత మగు నీ - శాసన మె చ్చెను ||విశ్వా||

1.బిడ్డలు తండ్రుల - వేడఁగ నన్నము - బెడ్డ లిచ్చు వె - ఱ్ఱులు గలరే = దొడ్డ తండ్రి నిలఁ - దోడ్పా టడిగిన - నడ్డులేక విమ - లాత్మ నొసంగును ||విశ్వా||

2.నమ్మకమునఁ జెడు - నరులను గానము - నమ్మక చెడుదురు - నరులయ్యో = ఇమ్మహి సకల శు - భమ్ములు గలుగును - సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము ||విశ్వా||

3.వెతకెడు వారికి - వెసఁ గృపఁ జూపును - గతిఁ గని వేడం - గాఁ దెర చున్ = సతతము యేసుని - చక్కని పేరట - హిత మతి వేఁడగ - నెంత యు మేలగు ||విశ్వా||

4.బల మేమియుఁ గనఁ - బడ దాహ నే సలిపెడు భక్తిని - సతి మను చు = నలయకు నేలను - నావగింజ మరి నిలిపినఁ జెట్టయి - నింగికి నెదుగదె ||విశ్వా||

5.అవిశ్వాసమున - నతి భీతులచే - నవిసి క్రుంగ నగు - నే మనసా = భువిఁ బాపాత్ములఁ - బ్రోచెడు ప్రభు కృపఁ - జవిఁ జూడుము నుతి - సల్పుచు వేగమే ||విశ్వా||
- ఎ. జెకర్యా 

Paschatapamu bondumu పశ్చాత్తాపము బొందుము

333
పశ్చాత్తాప పడుటకు ప్రేరణ
(చాయ: పరిశుద్ధాత్మను గోరుము)
రా - ఆనంద భైరవి, తా - అట

పశ్చాత్తాపము బొందుము - జీవమ నీవు - ప్రభుని సన్నిధి కేగుము = పశ్చాత్తాపములేని - ప్రజలెవ్వరికి గాని - నిశ్చయముగ గల్గు - నిత్యమౌ నరకంబు ||పశ్చాత్తా||

1.ఎంత పాపవైనను - జీవము క్రీస్తు - చెంత పార్థనఁ జేయుము = సంతోషమును మన - శ్శాంతిని నొసఁగున - నంతుఁడైన విమ-లాత్ముఁ డాదరించు ||పశ్చాత్తా||

2.జారచోరకార్యము - లేవైనను - బారఁదోలును వేగము = నారాజ్యమును వెదకు - నరు లందఱకు జీవ - ధార లెచ్చెదనని - కోరి కర్త వచించె ||పశ్చాత్తా||

3.వినుము ప్రభువు వాక్యము - జీవము నీవు - గనుము రక్షణ భాగ్యము = తనువు నిత్యముగాదు - నిను నీవె నమ్మకు - వినయ బుద్ధిని గ్రీస్తు - ఘనము వెదుకుము వేగ ||పశ్చాత్తా||

4.దిక్కుమాలిన దానవే - జీవము ప్రభుని - మ్రొక్కి పరమును జేరవే = నిక్కమిది నీ పాప - మెక్కువగా నున్న - మక్కువతో నిన్ను - గ్రక్కున విడిపించు ||పశ్చాత్తా||

5.బలములేని దానవే - జీవమ యాత్మ - బలము బొందుము వేగమే = యిలను విద్యాధన - బలముల నమ్మక - కలుష జాలము వీడి - కర కడకేగుము ||పశ్చాత్తా||

6.మందపోషకుఁడు క్రీస్తు - జీవమ యేసా - నందపూర్ణుఁడు థీరుఁడు = వందిత సత్సంఘ - మందుఁ జేరిన సత్యా - నందంబు నిత్యంబు - నొందుచు నుందువు ||పశ్చాత్తా||
- మోర్త ప్రకాశము 

Evarikosamo ee prana thyagamu ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము

 ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము (2)
 నీకోసమే నాకోసమే కలువరి పయనం
 ఈ కలువరి పయనం ||ఎవరికోసమో||

1.ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాపలోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో - మోముపైన ఉమ్ములతో -  నడువలేని నడకలతో
తడబడుతూ పోయావా - సోలి వాలి పోయావా

2.జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళకిరీటం నీకు పెట్టాము
జీవ జలములు నాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడు చుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటూ పొడిచితిమి
"తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు,వీరిని క్షమించు"
అని వేడుకొన్నావా.... పరమ తండ్రిని 

Nenante neekenduko ee prema నేనంటే నీకెందుకో ఈ ప్రేమా

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా. - నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా - నన్ను విడిచిపోవెందుకు 
కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో - వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు - ప్రాణమా.. నా ప్రాణమా (2) ||నేనంటే||

1.నిన్ను మరచిపోయినా - నన్ను మరచిపోలేవు -
నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

2.ప్రార్ధించకపోయినా - పలకరిస్తు ఉంటావు -
మాట వినకపోయినా - కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| 
DOWNLOAD THIS SONG  HERE 👇

Yesu kreestunii golva యేసు క్రీస్తుని గొల్వ రన్న

297
యేసు క్రీస్తును కొలుచుట
రా - ముఖారి, తా - ఆది 

యేసు క్రీస్తుని గొల్వ రన్న - యీ జగతిలోన - నెవ్వరు లేరు వాని కన్న = యేసుని వాక్యము - ఎవ్వరి కబ్బునో - దోసము విడి పర - వాసము దొరకును ||యేసు||

1.సత్యుఁడు నిత్యుఁడాయ నన్న - యీ సర్వ సృష్టిఁ - జక్కఁగ సలిపి నిలిపె నన్న = వ్యత్యాసము లే - మియు లేకుండఁగ - సత్యుండు చేసెను - సర్వజగం బును||యేసు||

2.నిరాకారుఁడు నిశ్చయుఁడన్న - నరుల రక్షింప - నరావతారుఁడై నాఁడన్న = నరుల పాపములుఁ - పరిహరించుట - కొరకై మరియ కొడుకై పుట్టెను ||యేసు||

3.పరిశుద్ధవంతుఁ డాయ నన్న - ప్రభు యేసు నందఁ - పాపమే గానఁ బడుట సున్న = పరులను గావను - ధరలోఁ దిరిగెను - నరుల నడుమ బహు - నిరపరాధముతో ||యేసు||

4.భేదాభేదములు గాని బోధ - నాధుఁడొనరించె - సాధు లెల్లను సంతోషింప = బాధలుఁబడు స - ద్రిక్తులతోడను - సాదర వాక్కులు - జక్కగ పలికెను ||యేసు||

5.మహిలోన మనుజు లెవ్వ రైనఁ - జేయ లేనట్టి - మహిమాద్బుతములఁ జేసె నన్న = మహా రోగులను - మఱి మృతులను - మహా మహుండు స్వస్థుల - మఱి గావించెను ||యేసు||

6.వర్ణింప వలనుకాని వాఁడు - మన కోసర మతడు - మరణమై మరల బ్రతికినాడు = పరలోకమునకు - మరి వేంచేసిన - పరుఁ డగు క్రీస్తుని - పాదముఁ బట్టుము ||యేసు||

7.పరిశుద్ధ దూతల నాదముతో - ప్రభు యేసు క్రీస్తు - ప్రకాశ వస్త్ర మహిమలతోఁ = పరమునుండి బహు - త్వరగా వచ్చును -- ధరలో నమ్మిన - నరులను బ్రోచును ||యేసు||

8.న్యాయంబు దీర్చు దినము గలదు - నమ్మని వారెల్ల - సాయంబు వెదకినను గనపడదు = సువార్త న్యాయముఁ దీర్చును - నడవడి చొప్పున - నమ్మని పాపుల - నరకము జేర్చును ||యేసు||

9.నమ్మండీ నష్టము నొందక - యేసుని నమ్మిన - పొమ్మని చెప్పఁడు సుమ్మండి = ఇమ్ముగఁ గృపతో - నిలలోఁ గాచును - పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును ||యేసు||
- గొల్లపల్లి నతానియేలు 

Manovilasithambou dinambu మనోవిలసితంబౌ దినంబు

 595
మట్టలాదివారము
రా - మోహన, తా- ఆది 
మనోవిలసితంబౌ - దినంబు - మహిమాన్వితంబు = అనంతజగతీమనోహ రంబు - ఘనాదిప్రభుయశః ప్రకాశంబు ||మనో||

1.మందమారుతములందము నొసగగ - డెందములకు నానందము నిడగా = సుందర పక్షుల సుమధురగానము - సుఖావహంబై శోభించెనుగా ||మనో||

2.అరుణభాస్కరుని కిరణాకరము - ధరదిక్తటముల దరిజేరెనుగా = ధరా వలయమాఖర - భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనో||

3.పులుగిల కిలకిల కలరవములతో - పొందుగ గలసిన భూరి రవంబు = లలితమనోహరశ్రావ్యమ వినుమా - తలపన్ దానికి కారణమేమో ||మనో||

4.రయమున నొలీవ నగంబుగనుమా - రభసయుక్తమగు జనమును గనుమా = జయంజయంబను జయ ధ్యానంబులు - వియదంతము జనమ్రోగుట వినుమా ||మనో||

5.ప్రసన్నవదనుడు - భానుతేజుడు - అసంఖ్యజనగణ పరివృతబలుడు = ప్రసితరాసభాసీనుడు యేసుడు - అసమ శాంతితో - నరుదెంచెనహో ||మనో||

6.జయములు బాడెడు బాల చయముతో - సాత్వికుడై రాసభంబు నెక్కి = జయోత్సవంబుతో సర్వేశ్వరుడు - చనిహృదయము సమర్పించె దము ||మనో|| 
- ఇ.జి. ఆనందము

Kaluvari premanu kanugonavela కలువరి ప్రేమను కనుగొనవేల


కలువరి ప్రేమను కనుగొనవేల 
సిలువ విలువను ఎరుగవదేల

1. నీ నా పాపము మరణ శాపమై మ్రానుగ పడెను ఆయన వీపుపై 
కరమున శిరమున ముండ్లబాధలు దేహము నిండా రక్తపు ధారలు

2. నీతి సూర్యుని శ్రమగనలేక సూర్యుడే మరుగై వెలుగు దాచెనా 
సైనికుడొకడు గుండె కరుగగా నీతిమంతుడితడని మహిమపరచెనా

Ee Shubhavela Ragane ఈ శుభవేళ రాగానే

ఈ శుభవేళ రాగానే కళ కళ లాడు ఈ లోకం
వేడుకగానే కూడుకొని - మరి మరి నిన్నే పోగడేను ||ఈ శుభవేళ||

1.మనుజులమైన మా కొరకు - ఇల కరుదెంచె దీనుడవై 
వెతుకగ నిన్నె ప్రణమిల్లి - 
                                                  ||ఈ శుభవేళ||

జగముల దాత జనముల దూత యుగపతి యేసే 
జగతిలో యేసునిమాట - సత్యము కట్టినమూట (2)
సతతంబది మన పాట ఆహహ... ఆహహ... ఆహా..


తళుకు తళుకుమని మెరుపు ... దారిలో..





Ea reetiga kolicheda ఏ రీతిగా కొలిచెద ప్రభు

ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ సేవలో నిలిచెద ఇదే ఆశ మదిలో అనుదినం ఇదే నా ప్రపంచం అనుక్షణం సదా యేసు నీలో బ్రతికెద

ఏ రీతిగా కొలిచెద - ప్రభు నీ ప్రేమలో నిలిచెద

1. నీ మమతే - అమూల్యమైనదీ
ఊహలకే - అతీతమైనదీ
నా గతం - ఓడించగా
నీ దరే - చేరానుగా
పాపములో నన్ను - విడనాడక
విమోచించినా - నిజ దైవమా
ప్రార్ధనలే నాలో - ఫలియించగా
ప్రతీ శ్వాసలో - ప్రభవించవా

నీ ప్రేమ ఇలలో - పాడెద - నిరతం దేవా

2. నీ వరమే - విశేషమైనదీ
వాక్యముగా - వసించుచున్నదీ
నీ స్వరం - నా దీపమై
నీ బలం - ఆధారమై
ఆశ్రయమైనావు - కలకాలము
కృపాసాగరా - స్తుతి పాత్రుడా
శాశ్వత నీ ప్రేమ - వివరించుట
ఎలా సాధ్యమూ - ప్రియ యేసయా

Parama vaidyuda bharateeyula పరమ వైద్యుఁడ భారతీయుల

599
క్రీస్తు అనుగ్రహించు స్వస్థత
రా - మిశ్రమ, తా - ఆది
(ఛాయ: శరణు జొచ్చితి)

పరమ వైద్యుఁడ భారతీయుల వ్యాధి బాధలఁ బాపుమా పరుల కుపచారం బొనర్చుట పరమ విధియని చూపుమా ||పరమ||

1.ప్రేమతో వైద్యులును దాదులు పెంపుఁ బొందఁగజేయుమా గ్రామ రోగులఁ గాంచి వారికి క్షేమమును దయ చేయుమా ||పరమ||

2.భరత ఖండము నందు వైద్యపు బడులను నెలకొల్పుమా పరఁగ నీవే వైద్య శాలలఁ బాలనంబు సల్పుమా ||పరమ||

3.కుఁటి గ్రుడ్డి మూఁగ సాలలఁ గూర్మితో దర్శించుమా యంటు రోగుల యాశ్రయముల నంటి పరామర్శించుమా ||పరమ||

4.లెక్కలేని గర్భవతుల యక్కఱలను దీర్చుమా దిక్కు లేని బిడ్డలకు నీ దీవెనల సమకూర్చుమా ||పరమ||

5.యంత్రశాలల గనులయందు నలయు వారలం బ్రోవుమా మంత్ర తంత్రము లందుఁ జిక్కు న మాయకులను గావుమా ||పరమ||

6.గ్రామ వైద్య సేవఁ జేసెడి ఘనులఁ బరిపాలించుమా గ్రామవాసులఁ గూల్చు వ్యాధులఁ గాంచి నిర్మూలించుమా ||పరమ||

7.దురభిమాన మూఢ భక్తిని ద్వరగ దూర పరచుమా మరియు శుచిచే రోగములు మటు మాయ మగు నని కరపుమా ||పరమ||

8.దేహశుద్ధిని జిత్తశుద్ధిని దేశ జనులకుఁ గూర్చుమా దేహములఁ బర శుద్ధ మగు నీ దేవళములుగ మార్చుమా ||పరమ||
- మల్లెల దావీదు 

Vaadukaga vakyamunu వాడుకగా వాక్యమును

వాడుకగా వాక్యమును చదివితిమి గాని 
వాస్తవముగా దాని భావమే మరిచితిమి

ఆచారముగా ఆలయమేగితిమి గాని
ఆచరణలో ఆజ్ఞలను విడిచితిమి

తుదకు వాక్యము నీవని యెరిగితిమి
నీ ఆలయముగా మేము మారితిమి
తప్పులను తెలుసుకొని - తలవంచి నిలిచితిమి

దేవా దయతో మమ్ములను మన్నించితివి
అక్కున చేర్చుకొని ఆదరించితివి
ఎల్లలు లేని నీ ప్రేమను - మా పై కురిపించితివి

అందుకే...యేసూ
అంజలి ఘటియించినాము

అందరి మనసులలోని చీకటుల
హారీయించి తరియింప చేయగా
నీ సుందర పదములు ముందర
మేమందరం
యేసూ అంజలి ఘటియించినాము

అంజలి ఘటియించడం అంటే అర్థం
శ్రద్ధతో, భయభక్తి తో
దేవున్ని ఆరాధించడం
లేదా దేవున్ని వేడుకోవడం అని అర్థం