Showing posts with label Merlyn Salvadi. Show all posts
Showing posts with label Merlyn Salvadi. Show all posts

30 November 2021

Najarethu Patnana Nagumalle | నజరేతు పట్నాన నగుమల్లె


నజరేతు పట్నాన నగుమల్లె ధరణిలొ - యోసేపు మరియమ్మ నగుమల్లె ధరణిలొ..(2)
హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయ..

మేము వెళ్లి చూచినాము స్వామి యేసునాదుని (2)
ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబు లల్లరగ (2)

బెతలెము పురములొన బీద కన్య మరియకు (2)
పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ (2)

పేద వడ్ల వారి కన్య మరియమ్మ - ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ - ప్రేమ గల్ల యెసు తల్లి

పెరెల్లిన దేవ దేవుడె యేసయ్య - ప్రేమ గల అవతారం (2)

స్వర్గ ద్వారాలు తెరిచిరి యేసయ్య - స్వర్గ రాజు పుట్టగానె యేసయ్య - స్వర్గ రాజు పుట్టగానె

సరుగున దూతల్ వచ్చిరి యేసయ్య - చక్కని పాటల్ పాడిరి (2)

నువు బొయె దారిలొ యెరూషలేము గుడి కాడ (2) 
అచ్చం మల్లె పూల తొట యేసయ్య (2)

దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని (2)
దొరొల్లె బయిలెల్లి నారే యేసయ్య (2)

రాజులకు రాజు పుట్టన్నయ్య (2) 
రారె చూడ మనం ఎల్లుదం అన్నయ్య (2)
తారన్జూచి తూర్పు జ్ఞానుల్ అన్నయ్య (2)
తరలినారె బెత్లహెమ్ అన్నయ్య (2)

పదర పొదామురన్న - శ్రీ యేసుని చూడ - పదర పొదమురన్న (2)

శ్రీ యేసన్న నట లొక రక్షకుడట (2)
లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట (2)

పదర.. హెయ్ పదర.. హెయ్

పదర పొదమురన్న - శ్రీ యేసుని చూడ - పదర పొదాము రన్న (4)

Kenny Salvadi, Merlyn Salvadi

DOWNLOAD MP3 SONG HERE 👇

28 November 2021

Nara Janmamethi Varasuthuniga | నర జన్మమెత్తి వరసుతునిగా


నర జన్మమెత్తి వరసుతునిగా అరుదేంచే నేడు సరసముగా
శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి క్రీస్తేసు స్వామి ఈ భువిలోన

మానస వేడి.. పావనమూర్తి.. మానవులను పాలించుకర్త.. నరజన్మ మెత్తి 

లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ మెత్తి కన్య మరియ గర్భవతియయ్యే (2) 
మానసవేడి.. పావనమూర్తి.. మానవులను పాలించుకర్త.. నరజన్మ మెత్తి..

బంతి యనగ యాడరే - మన బాలచిన్న ముద్దుల యేసుకు (2) 
ముత్తికతోడ కూడియాడి ముద్దుల పరుడు పల్కపరుడు గగ గరిగ మమ మప మప గమప పదనిస (2)
పదనిస పదనిస పద పద గమ గమ గరిసరి (2) ||బంతి||

జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి (2) 
ముత్తికతోడ కూడియాడి ముద్దుల పరుడు పల్కపరుడు గగ గరిగ మమ మప మప గమప పదనిస (2)
పదనిస పదనిస పద పద గమ గమ గరిసరి (2) ||బంతి||

జననము నొందెను జయయేసు - జయగీతములు పాడుడి (2) ఆ.. ఆ... ఆ 
గొర్రెల కాపరులకు దూత - గొప్ప వార్తను తెలిపినంట (2) 
జననము నొందెను జయయేసు - జయగీతములు పాడుడి (2) ఆ.. ఆ... ఆ 

శ్రీ యేసుండు జన్మించి రేయిలో (2)
నేడు పాయక బెత్లహేము యూరిలో (2)
సత్రమందున పశువుల శాలయందున (2)
దేవ పుత్రుండు మనుజు డాయేనందున (2) ||శ్రీ యేసుండు||

చూడ బోదము రారే సకలజనంబులారా - శ్రీ యేసు నాధుని జన్మంబు (2)
ఆనందముతో మనమందరం (2) 
ఆహా చూడ బోదము రారే సకలజనంబులారా - శ్రీ యేసు నాధుని జన్మంబు (2)

ఘల్లు ఘల్లున మనమెళ్ళి - యేసుని పాదంబు జంభులకు మ్రొక్కెదము (2) 
ఆనందముతో మనమందరం (2) 

ఆహా చూడ.. ఆహా చూడ.. 
ఆహా చూడబోదము రారె సకల జనంబులారా శ్రీ యేసు నాధుని జన్మంబు (2)
      Kenny Salvadi, Merlyn Salvadi
              
DOWNLOAD MP3 SONG HERE 👇

27 August 2021

Ne Odipoyina Ninne Sthuthinchedan | నే ఓడిపోయిన నిన్నే స్తుతించెదను

నే ఓడిపోయిన నిన్నే స్తుతించెదను
నే లోయలో ఉన్నా నిన్నే స్తుతించెదను
నేను నిలబడలేకున్నా నిన్నే స్తుతించెదను
నేను గాయముతో ఉన్నా నిన్నే స్తుతించెదను

నా యేసయ్యా నీకే మొర పెట్టుచూ - 
నా భారమును నీపై వేయుచూ
నా జీవితం సరిచేయుచు - 
ప్రతి భారం తొలగించుచు

నా నిరీక్షణ నీవే – నా అండయు నీవే –
నా ఆశ్రయం నీవే – నా సర్వమూ నీవే (2)

నేను కరువులో నున్న నిన్నే స్తుతించెదను
నేను వ్యాధిలో నున్న నిన్నే స్తుతించెదను
సహాయము లేకున్నా నిన్నే స్తుతించెదను
నన్నూ వెలివేసినా నిన్నే స్తుతించెదను
నా యేసయ్యా నీకే మొర పెట్టుచూ - 
నా భారమును నీపై వేయుచూ
నా జీవితం సరిచేయుచు - 
ప్రతి భారం తొలగించుచు

నా నిరీక్షణ నీవే – నా అండయు నీవే –
నా ఆశ్రయం నీవే – నా సర్వమూ నీవే (2)

నా నిరీక్షణ నీవే – నా అండయు నీవే –
నా ఆశ్రయము నీవే – నా సర్వమూ నీవే (2)

నా నిరీక్షణ నీవే –నీవే... నా అండయు నీవే –
నా ఆశ్రయము నీవే – యేసయ్యా.. నా సర్వమూ నీవే 

నా నిరీక్షణ నీవే – నా అండయు నీవే –
నా ఆశ్రయము నీవే – నా సర్వమూ నీవే 
DOWNLOAD MP3 SONG HERE 👇

24 August 2021

Naatho Unnadu Nannu Viduvadu | నాతో ఉన్నాడు నన్ను విడువడు

నాతో ఉన్నాడు , నన్ను విడువడు 
గాఢాంధకారపు లోయలో -  నేను సంచరించినా (2)
నాతో ఉన్నాడు - నన్ను విడువడు (2)

1. ఎవరులేని చోటలో, ఉంటాడు నా ప్రక్కనే - 
కనుమేరలో ఎవరు లేనపుడు - కన్నులు మూస్తే కనిపిస్తాడు (2)
నా యేసు నాతో ఉన్నాడు - నా యేసు నన్ను విడువడు 

2. నాలో ధైర్యం లేనప్పుడు, బలపరిచే వాక్యం నిస్తాడు -
కోల్పోయిన వాటన్నిటిని తిరిగి రెండంతలుగా దీవిస్తాడు (2)
నా యేసు నాతో ఉన్నాడు - నా యేసు నన్ను విడువడు
                            Lyrics: Merlyn Salvadi

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...