Showing posts with label Manasa enduke kalavaramu. Show all posts
Showing posts with label Manasa enduke kalavaramu. Show all posts

24 May 2022

Manasa enduke kalavaramu | మనసా ఎందుకే కలవరము నీకెవరు

మనసా ఎందుకే కలవరము - నీకెవరు లేరనేగా
ఎవరున్నా లేకున్నా నీతోడుగా ఉన్నాడు యేసు

1. నీ జన్మభూమిని విడిచి - నీ కన్నవారిని మరచి
నీవు నమ్మిన యేసుకోసం - గవిని వెలుపలకు నీవు చేరితివి
నీవు చేసిన క్రియల మూలముగ - బహుమాన మున్నదని మరువకుమా

2. ఇక కొంచెము కాలమేగా - నీవు పొందుచున్న శ్రమలు
శోధనల మధ్యలో నిలిచి - స్తుతి గీతమే పాడుమా
అల్పకాల శ్రమల పిదప - తన మహిమలో నీవు ఉండెదవు

3. అటు చూడు వరుడు యేసు - తన సంఘవధువు కొరకు
బహుమానములు పంపెను - పరిశుద్ధాత్ముని ద్వారా
ఇదియే సమయం సిద్ధపడుమా - సీయోను సౌందర్య కన్యకగా

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...