Showing posts with label Jeeva swaralu. Show all posts
Showing posts with label Jeeva swaralu. Show all posts

30 March 2023

Daveedu suthuniki jayamu | దావీదు సుతునికి జయము జయం


దావీదు సుతునికి జయము జయం స్తుతులు చెల్లించెదం (2)
యేరుషలేముకు యేసునిరాక - ఆర్భాటముతో జరుగు వేడుక 
స్వరమెత్తి పాడాలి విజయ గీతిక - స్వరమెత్తి పాడాలి విజయ గీతిక
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
1.రాజుల రాజు సాత్వికుడై - నీతి సామ్రాజ్యపు స్థాపకుడై (2)
ఏతెంచుచుండెను నీ యొద్దకు - ప్రవచనము నెరవేర్చుటకు (2)
ప్రవచనములు నెరవేర్చుటకు 
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
2.కట్టబడియున్న గాడిదను - విప్పి తోలుకొని తెమ్మనెను (2)
కూర్చుండి సాగెను సీయోనుకు - సమాధానము ప్రకటించుటకు (2)
సమాధానమును ప్రకటించుటకు
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
3.బాలుర పసిపిల్లల నోట - ఉంచిన స్తోత్రధ్వనుల చేత (2)
స్థాపించియుండెను దుర్గమును - అణిచివేయను శత్రువును (2)
అణిచివేయుటకు శత్రువును
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||

30 January 2023

Siramu vanchenu sarva lokam | శిరము వంచెను సర్వ లొకము

శిరము వంచెను సర్వ లొకమ్ - యేసు దేవా నీ ముందు (2)
సంతసించె ప్రతి హృదయం (2)- రక్షక నీ జన్మయందు (2) ||శిరము||

1.పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము - రాజుగానే ఉదయించినావు చిత్రము (2)
మహిమ సింహాసనం - విడిచి నాకోసము (2)
పశుల పాకలో పుట్టినావు స్తోత్రము (2) ||శిరము||

2.యుద్ధముచేసి రాజ్యమేలేది సహజము - శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము (2)
పరలోకానందము - చేసితివి త్యాగము (2)
మంటిదేహము దాల్చినావు స్తోత్రము (2) ||శిరము||

3.పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము - ముందే యెరిగి జన్మించినావు చిత్రము (2)
మార్పు చేసుకొని నీ మహిమ రూపము (2)
మనిషి రూపులో – వచ్చినావు స్తోత్రము (2) ||శిరము||
DOWNLOAD MP3 SONG HERE 👇

11 December 2022

Chinnadaina urilona | చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు


చిన్నదైన ఊరిలోన యేసుక్రీస్తు పేరుతోన రేడు పుట్టినాడు (2)
దివ్యమైన లోకమందు వాసముండువాడు
దీనులైన వారి మధ్య ఉండగోరినాడు 
రాజ్యాలన్నింటిలో సంబరాలు నేడు
పూజ్యనీయునికి కీర్తనాలుపాడు (2)

నీడలేక గూడులేక సాయమొవచ్చు జడలేక
కృంగియున్నవారికింక తోడు (2)
నమ్ముకున్నవారికి ఆయనే న్యాయం చెయ్యగలిగినోడు (2)
సత్యమును జీవమును తానైయున్నాడు. ||రాజ్యాలన్నిటిలో||

బుద్దిలేక శుద్దిలేక దిద్దుబాటు చేతకాక
కూలబడ్డవారికింక తోడు (2)
కోరుకున్నవారికి ఆయనే రక్షణ ఇవ్వగలిగినోడు (2)
కొండయును కోటయును తానైయున్నాడు ||రాజ్యాలన్నిటిలో||

శాంతిలేక కాంతిలేక ఆశపడ్డదేదిరాక
బెంగపడ్డవారికింక తోడు. (2)
వేడుకున్నవారికి ఆయనే భారందించగలిగినోడు. (2)
మార్గమును ద్వారామును తానైయున్నాడు ||రాజ్యాలన్నిటిలో||

26 September 2021

Paramanduna ihamanduna | పరమందున ఇహమందున

పరమందున ఇహమందున సర్వధికారివి (2)
అను నిత్యము దూతాలితో స్తుతియించబడు చుంటివి (2)
రాజ్యం మహిమ యేసయ్య నీదే (2) 
 
1. నీవే సర్వోపకారివి మమ్మును పోషించు చుంటివి (2)
నీవే మా ప్రార్థనలన్ని అంగీకరించు చుంటివి (2) ||రాజ్యం||
 
2. నీవే సర్వాంతర్యామివి మమ్మును పాలించు చుంటివి (2)
నీవే మా వేదనలన్ని మరచిపో చేయుచుంటివి (2) ||రాజ్యం||
 
3. నీవే సత్య స్వరుపివి మమ్మును దీవించుచుంటివి (2)
నీవే మా దోషములన్ని క్షమియించి వేయు చుంటివి (2) ||రాజ్యం||
DOWNLOAD MP3 SONG HERE 👇

04 September 2021

O Nesthama Ee Shubhavartha | ఓ నేస్తమా ఈ శుభవార్త

ఓ నేస్తమా ఈ శుభవార్త తెలియునా (2)
నిను ప్రేమించే వారొకరున్నారని - వాస్తవం తెలియునా (2)
నిను రక్షించువాడు యేసయ్యేనని - సత్యం తెలియునా (2)

1.నీవు నమ్మిన వారే.. మోసంతో నీ గుండెనే చీల్చినా
నీ సొంతం జనులే.. నీ ఆశల మేడలు అన్నియు కూల్చిన (2)
ఊహించనివి జరిగినా - అవమానం మిగిలినా (2) ||నిను||

2.నీ కష్టార్జితము.. అన్యాయము చేయు వారికే చిక్కినా
నీకున్న స్వాస్ధ్యము.. దోపిడిదారుల చేతికే చిక్కినా (2)
ఉద్యోగమే ఊడినా - వ్యాపారంలో ఓడినా (2) ||నిను||
DOWNLOAD MP3 SONG HERE 👇

14 July 2021

Galamethi Paadina Swaramalapinchina | గళమెత్తి పాడినా స్వరమాలపించినా

గళమెత్తి పాడినా - స్వరమాలపించినా 
నీ గానమే - యేసూ నీ కోసమే 
నీ ధ్యానమే - యేసూ నీ కోసమే 

1. నశియించిపోయే నన్ను బ్రతికించినావే
కృశియించిపోయే నాలో వసియించినావే 
నీ కార్యము వివరించెదన్ - నీ నామము హెచ్చించెదన్ 
నాకున్న సర్వమా - ఏకైక దైవమా

2. మతిలేక తిరిగే నన్ను సరిచేసినావే 
గతిలేని నా బ్రతుకునకు గురి చూపినావే 
నీలో అతిశయించెదన్ - నీలో ఆనందించెదన్
 నాకున్న సర్వమా - ఏకైక దైవమా 

3. శ్రమచేత నలిగిన నన్ను కరుణించినావే 
కృపచేత ఆపదనుండి విడిపించినావే 
నీ నీతిని వర్ణించెదన్ - నీ ప్రేమను ప్రకటించెదన్
 నాకున్న సర్వమా - ఏకైక దైవమా
DOWNLOAD MP3 SONG HERE 👇

Kanikara Sampannudu Krupachupu | కనికర సంపన్నుడు కృపచూపు దేవుడు

కనికర సంపన్నుడు - కృపచూపు దేవుడు విమోచకుడు - సహాయకుడు 

అ.ప: శ్రీ యేసు దేవుడు - శ్రీ యేసు దేవుడు 

1. దోషము క్షమియించువాడు - పాపము తొలగించువాడు ప్రేమించును - దీవించును

2. భారము భరియించువాడు - క్షేమము కలిగించువాడు రోగమును తొలగించును 

3. దీనుల మొర వినువాడు - ఆమేన్ అవుననువాడు పాలించును - పోషించును

Saageti Ee Jeevayathralo Regeti | సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి

సాగేటి ఈ జీవయాత్రలో - రేగేటి పెనుతుఫానులెన్నో
ఆదరించవా నీ జీవవాక్కుతో - సేదదీర్చవా నీ చేతిస్పర్శతో 

1. సుడిగుండాలెన్నో లోకసాగరాన - వడిగా నను లాగి పడద్రోసే సమయాన
నడిపించగలిగిన నా చుక్కాని నీవే -  విడిపించ గలిగిన నాకున్న దిక్కు నీవే 
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా 

2. వడగాడ్పులెన్నో నా పయనంలోన - నడవనీక సొమ్మసిల్లజేసే సమయాన
తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే - కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే 
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా 

3. అలలా శ్రమలెన్నో బ్రతుకు నావ పైన- చెలరేగి విలవిలలాడించే సమయాన 
నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే - కలవరమును తొలగించే కన్నతండ్రి నీవే 
యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా

08 October 2020

Nadipisthadu Na Devudu | నడిపిస్తాడు నా దేవుడు

నడిపిస్తాడు నాదేవుడు - శ్రమలోనైనా నను విడువడు (2)
అడుగులు తడబడినా - అలసట పైబడినా (2)
చేయి పట్టి వెన్నుతట్టి - చక్కని ఆలొచన చెప్పి (2) ||నడి||

1.అంధకారమే దారి మూసినా - నిందలే నను కృంగదీసినా (2)
తనచిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకు ననుచేర్చుతాడు (2) ||నడి||

2.కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను  చీల్చివేసినా (2)
తనచిత్తం నెరవేర్చుతాడు  గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడి||

3.నాకున్నకలిమి కరిగిపోయిన - నాకున్నబలిమి  తరిగిపోయిన(2)
తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నను చేర్చుతాడు (2) ||నడి||
===================
Nadipistadu naa devudu - shramalonaina nannu viduvadu (2)
Adugulu tadabadina- alasata paibadina (2)
Cheyi patti vennu tatti - chakkani aalochana cheppi (2) ||Nadi||

1.Andhakaarame daari musina - nindale nanu krungadeesina (2)
Thana chitham neraverchutaada - gamyam varaku nanu cherchutaadu (2) ||Nadi||

2.Kashtala kolimi kaalchivesina -shokaalu gundenu cheelchivesina (2)
Thana chitham neraverchutaada - gamyam varaku nanu cherchutaadu (2) ||Nadi||

3.Naakunna kalimi karigi poyina - naakunna bhalimi tharigi poyina (2)
Thana chitham neraverchutaada - gamyam varaku nanu cherchutaadu (2) ||Nadi||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...