Showing posts with label 140 యేసు నీ నామామృతము. Show all posts
Showing posts with label 140 యేసు నీ నామామృతము. Show all posts

17 August 2020

Yesu Nee Namamruthamu | యేసు నీ నామామృతము

140         
యేసునామ మాధుర్యము
రా - కాంభోజి,  తా - ఆది

యేసు నీ నామామృతము మా - కెంతో రుచి యయ్యా = దేవ - మా దోసములను హరించి మోక్షని - వాసులుగ జేయుటకు - భాసుర ప్రకాశమైన ||యేసు||

1. వేడుకలరగ గూడి నిను గొని - యాడు వారికి - దేవ =  యెంతో - కీడు జేసిన పాడు వైరిని - గోడుగోడనంగ వాని - తాడనము జేసితివి ||యేసు||

2. పాపములు హరింప నీవే - ప్రాపు మాకయ్యా - దేవ = నీ - దాపు జేరిన వారి కందరి - కాపదలు బాపి నిత్య - కాపుగతి జూపినావు ||యేసు||

3. అక్షయ కరుణేక్ష భువన - రక్షకా నీవే - దేవ = మమ్ము - పక్షముగ రక్షించి మోక్షసు - రక్షణకు దీక్ష గొని - వీక్షితులమైన మాకు ||యేసు||

4. అందమగు నీ మందిరమున - బొందుగా మేము - దేవ= నీ - సుందర కరుణామృతము మా - డెందముల యందు గ్రోలు - టందుకు సుందరమైన ||యేసు||
                             - యోసేపు దానియలు
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...