Showing posts with label శ్రీ యేసు నామం శక్తిగల నామం. Show all posts
Showing posts with label శ్రీ యేసు నామం శక్తిగల నామం. Show all posts

26 May 2021

Sri Yesu Naamam Shakthigala | శ్రీ యేసు నామం శక్తిగల నామం

శ్రీ యేసు నామం - శక్తిగల నామం 
పాపికి పుణ్య నామం 

1.ఎల్ల నామములకెల్ల - మేలైన నామం యేసుని - దివ్య నామం (2)
సర్వజనులెల్ల - సర్వ కాలమంతా (2) 
హర్షముతో - పాడు నామం (2)

2.పాప పరిహారమిచ్చి - పాపులను రక్షింప - పుడమికే తెంచె నామం (2)
పాప రహిత జీవితం - ప్రసాదించే నామం (2) 
పరిశుద్ధ - పుణ్య నామం (2)

3.పాప గోడలన్నియు - పడగొట్టునట్టి - ప్రభు యేసు ప్రియ నామం (2)
దోషములు మోసములు - నాశనమొనరించు (2) 
పరిశుద్ధ - పుణ్య నామం (2)

4.పాపచింతలన్నీ - పారద్రోలు నామం - ప్రభు యేసు పుణ్య నామం (2)
నిత్య శాపం మాపి - సత్య మార్గం చూపి (2) 
నిత్య రాజ్యం చేర్చు నామం

5.వ్యాధి బాధలనియ్యు - భరించిన నామం - స్వస్థపరచు యేసు నామం (2)
కష్టనష్టములలో - కాచి కాపాడెడు (2) 
క్రీస్తు యేసు - దివ్య నామం 

6.శత్రు సైతానుని - సంహరించినట్టి - శక్తిగల యేసు నామం (2)
నిత్య జీవమిచ్చి - సత్య వేదమిచ్చిన (2) 
శ్రీ యేసు ఘన నామం 

7.ఎంత ఘోరపాపమైన - ఎంత మొత్తమైన - క్షమియించు యేసు నామం (2)
పాప పరితముతో - ప్రభు పాదం చేరిన (2) 
కాపు నిచ్చు - కృప నామం (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...