Showing posts with label నిన్ను విడిచి నీ ప్రేమ మరచి. Show all posts
Showing posts with label నిన్ను విడిచి నీ ప్రేమ మరచి. Show all posts

25 April 2022

Ninnu vidachi nee prema | నిన్ను విడిచి నీ ప్రేమ మరచి

నిన్ను విడిచి నీ ప్రేమ మరచి - నేనెటు పోగలను దేవా
ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు
నాదేవా నా దేవా నా దేవా (నిన్ను విడిచి)

1.దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో
నాయకుడా నా ఆర్త ధ్వని విని
నావను నడిపించినావే - తీరము చూపించినావే
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నేనెటు పోగలను దేవా-ఎవ్వరు నీ ప్రేమ నాకిల చూపగలరు

2.శ్రమల పాలైతి సొమ్మసిల్లితి - సిలువకు నే చేరితి
శ్రీకరుడా నా శిలువను మోసి - ఆదరణె చూపినావే
నూతన బలమిచ్చినావే .... యేసయ్యా
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||

3.విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం
శ్రీమంతడా నా షాఓము రాజా
బ్రతికెద నీ కోసమే చావైన లాభమే
నేనెటు పోగలను దేవా - యేసయ్యా నా యేసయ్యా||నిన్ను||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...