Showing posts with label Daari Tappipotunnavaa Viswasi lyrics. Show all posts
Showing posts with label Daari Tappipotunnavaa Viswasi lyrics. Show all posts

04 July 2021

Daari Thappi Pothunnavaa Viswasi | దారి తప్పిపోతున్నావా విశ్వాసి నీ తీరమేదో

దారి తప్పిపోతున్నావా విశ్వాసి - నీ తీరమేదో గమనించావా విశ్వాసి 
ఈలోకం ముండ్ల బాట - విశ్రాంతి లేని చోట యేసయ్య
 జీవపు బాట - సాగిపో ఆయన వెంట 
యేసుతోనే నీ ఉంటావా విశ్వాసి - ఈ లోకం విడిచి రానంటావా విశ్వాసి ఆ -- ఆ -- ఆ || దారి || 

ఓడలో నల్లకాకి - చూడనంపె లోకానికి 
చూడచూడ లోకం చూచి - ఓడమరిచి పోయెను కాకి
 కాకిలాగ నీ ఉంటావా విశ్వాసి - పావురంలా మళ్లోస్తావా విశ్వాసి ఆ -- ఆ -- ఆ || ఈ లోకం || 

అననీయ సప్పీర చూడు - ధనమును ఆశించినారు 
అబద్దం సెప్పినారు - మరణం పొందారు చూడు 
క్రీస్తునందు నీవుంటేనే విశ్వాసి - మరణం నుండి లేవగలవు విశ్వాసి ఆ -- ఆ -- ఆ || ఈ లోకం ||

 మల్లిపోకె మాయా లోకం - చూడచూడ సక్కని సమయం
 పట్టుకో యేసుని పాదం - చేరుకో పరలోకం 
యేసునందు నీ వుంటేనే విశ్వాసి - ఈ లోకం విడిచి రానంటావా విశ్వాసి ఆ -- ఆ --ఆ || ఈ లోకం ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...