Amarudavu Neevu Naa Yesayya | అమరుడవు నీవు నా యేసయ్యా


అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా 
ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో 
స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు||

శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే 
శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే (2) 
ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు 
దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు||

వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా -
పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2)
తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను 
కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు||

జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా -
మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2)
జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన 
ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
DOWNLOAD MP3 SONG HERE 👇

12 comments:

Kavali kiran said...

ఈ పాటలో ఉన్న అర్ధాన్ని ఏమని వర్ణించగలము

Unknown said...

joyalkala1491@gmail.com

Unknown said...

Nice song

Unknown said...

This is song or lesson what is this

Unknown said...

I love this song, it makes my mind relief wen i feel tension

Unknown said...

Good song

Unknown said...

గుడ్ సాంగ్

Jeeva bidekanna said...

Glory to god

Unknown said...

Beautiful song

Unknown said...

Very nice song

Unknown said...

Super Song🎵🎵🎵

Grace said...

Thank you