Showing posts with label Naa Prana Priyuda Yesu Raajaa. Show all posts
Showing posts with label Naa Prana Priyuda Yesu Raajaa. Show all posts

07 July 2021

Naa prana priyuda yesu raja | నా ప్రాణ ప్రియుడా యేసు రాజా

666
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ 
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో - సత్యముగా ||నా ప్రాణ||
 
1.అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్ ||నా ప్రాణ||
 
2.వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ     స్తుతులతో - 
నమస్కరించి ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా ||నా ప్రాణ||
 
3.గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా 
మరచినా గాని నీ వెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా ||నా ప్రాణ||
 
4.రక్షణాలంకారములను - అక్షయమగు నీయాహరమున్ - 
రక్షకుడా నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షించుచూ - స్తుతింతును ||నా ప్రాణ||
 
5.నీ నీతిని నీ రక్షణను - నా   పెదవులు       ప్రకటించును -
కృతజ్ఞత స్తుతులతోడ - నీ ప్రేమను నే వివరింతునూ - విమోచకా ||నా ప్రాణ||
 
6.వాగ్దానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే - 
పాడెదము ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా ||నా ప్రాణ||
– మాధుర్యం గారు 
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...