Showing posts with label నరకమంటే ఆషామాషీ కాదన్నా. Show all posts
Showing posts with label నరకమంటే ఆషామాషీ కాదన్నా. Show all posts

01 June 2021

Narakamante Aashamashi Kaadanna | నరకమంటే ఆషామాషీ కాదన్నా

నరకమంటే ఆషామాషీ కాదన్నా అది భగభగ మండే అగ్ని గుండమన్నా 
అందులో పడినవాడు చావడు మరి మంటలేమొ ఆరవు కానరాదు ఏ దరి 

1.పిరికోళ్ళు నమ్మనోళ్ళు అసహ్యులు మాంత్రికులు బొమ్మలకు మొక్కెటోళ్ళు 
దేవున్ని మరిచెటోళ్ళు అబద్దికులందరు అందు వేయబడుదురు 
విడిపించువారు లేక యాతనలు పడుదురు 

2.అపవాదికిని వాడి దూతలకోసం కాచుకొని యున్నది పాతాళ లోకం 
యేసయ్యను నమ్మనోళ్ళ గతికూడా అంతేలే
 హృదయం ఆయనకిస్తే స్వర్గం సొంతమౌనులే 

3.గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో ఎవని పేరైనను వ్రాయబడకయున్నచో 
నోరు తెరిచి పాతాళం ఎదురు చూచుచున్నది
 తప్పించుకొనుటకు ఇంకా తరుణమున్నది

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...