Showing posts with label 010 ఎంత ప్రేమ ఎంత ప్రేమ. Show all posts
Showing posts with label 010 ఎంత ప్రేమ ఎంత ప్రేమ. Show all posts

04 July 2021

Entha Prema Entha Prema | ఎంత ప్రేమ ఎంత ప్రేమ

10
దేవుని ప్రేమ
రా - జంఝూటి,   తా - ఆది

  ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా - దేవుఁ = డెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే || ఎంత ||

1.ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా - దాని = నింత యంతయని వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత||

2.మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ - దానిఁ = జనువుఁగ జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత||

3.దేవదూతలైన దానిఁ బాడలేరట - యింక = దేవుఁడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ || ఎంత||

4.ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే - ప్రభు = జెంతఁజేరి సంత తంబు ప్రీతిఁ జేసెదన్ || ఎంత ||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...