Showing posts with label జై జై యేసురాజు జై జై. Show all posts
Showing posts with label జై జై యేసురాజు జై జై. Show all posts

10 December 2020

Jai jai yesuraju jai jai | జై జై యేసురాజు జై జై

జై జై యేసురాజు జై జై - రాజాధిరాజ నీకే జై జై   ||జై జై||

1. పాపకూపములో బడియున్న - నన్ను జూచి చేయి జాచి చక్కగా దరికి జేర్చితివి  ||జై జై||

2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా  పరిహరించిన - పావనుడగు నా ప్రభు యేసు ||జై జై||

3. నీతిహీనుడనైన నాకు - నీతి రక్షణ వస్త్రములను - ప్రీతితో నొసగిన నీతిరాజ ||జై జై||

4. మంటిపురుగునైన నన్ను - మంటి నుండి మింట జేర్చిన - మహాప్రభుండా నీకే జై జై  ||జై జై||

5. పాపశాప గ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ సంపార్యముగా మార్చతివి  ||జై జై||

6. రాజులైన యాజకగుంపులో - నన్నుగూడ నీ సొతైన  సంపాద్యముగా మార్చితివి - పరిశుద్ధ జనములో జేర్చితివి ||జై జై||

7. తల్లియైన మరిచిన మరచును - నేను నిన్ను  మరువననిన నమ్మకమైన నా ప్రభువా  ||జై జై||

8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది అంతములేని స్వామి -   యుగ యుగములకు నీకే జై జై  ||జై జై||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...