Showing posts with label Palm Sunday. Show all posts
Showing posts with label Palm Sunday. Show all posts

11 April 2022

Yesu raju rajula rajai | యేసు రాజు రాజుల రాజై

యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె - త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే - హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే - హోసన్నా జయం మనకే ||యేసు||

యోర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా||

శరీర రోగమైనా
అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2) ||హోసన్నా||

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2) ||హోసన్నా||

16 August 2020

Idigo Nee Raju Vachuchunde | ఇదిగో నీరాజు వచ్చుచుండె

631

ఇదిగో నీరాజు వచ్చుచుండె - సీయోను కుమారి  సంతోషించు - యెరుషలేం కుమారి ఉల్లసించు ||ఇదిగో||

1.నీదురాజు నీతితో - దోషమేమియు లేకయే
పాపరహితుడు ప్రభు - వచ్చు చుండె ||ఇదిగో|| 
 
2.రక్షణగలవాడుగ - అక్షయుండగు యేసుడు
ఇచ్చతోడ యెరుషలేం - వచ్చు చుండె ||ఇదిగో|| 

3.స్వాతికుండు యీభువిన్ - అత్యంతమగు ప్రేమతో
నిత్యరాజు నరులకె - వచ్చుచుండె ||ఇదిగో||

4.దీనవరుడు నీ ప్రభు - ఘనత కలిగిన దేవుడు
ప్రాణమీయ పాపులకై - వచ్చుచుండె ||ఇదిగో||

5.ఇలను గాడిదనెక్కియే - బాలుర స్తోత్రములతో 
బలుడగు నీ ప్రభు - వచ్చుచుండె ||ఇదిగో||

6.దావీదు కుమారుడు - దేవుడు పాపులకు
జయ గీతములతో - వచ్చుచుండె ||ఇదిగో||

7.యేసుని ప్రేమించుచు - హోసన్నా పాడెదము
యేసుడిల వచ్చుచుండె - హల్లెలూయ ||ఇదిగో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...