Showing posts with label Calvary Prathyakshatha songs. Show all posts
Showing posts with label Calvary Prathyakshatha songs. Show all posts

06 May 2021

Nee Prajala Rodhanalo | నీ ప్రజల రోదనలో ఈ ఆర్త నాదములో


నీ ప్రజల రోదనలో ఈ ఆర్త నాదములో 
కన్నీటి లోయలలో  గాడాంధకారములో 
మా మనవులే ఆలకింపవా.. నీ ప్రజలనే దృష్టించవా..
మా వేదనే తొలగించవా.. నీ స్వస్తతే దయచేయవా..
మా దోషములను క్షమియించవా..
నీ కరుణ కటాక్షములు చూపించవా (2) ||నీ ప్రజల||

1. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలము - 
నీ సన్నిధిలో సాగి లిడెదము - 
మా చెడు నడతను విడిచి పెట్టెదం - 
నీ మార్గములను అనుసరింతుము (2)
మా మీద దృష్టి నిలిపి మా ప్రార్ధనాలకించి (2)
మా దేశమునే స్వస్థపరచవా - 
మా దేశమునే బాగు చేయవా (2) ||నీ ప్రజల||

2. నీ సొంత రక్తమిచ్చి మము కొంటివే - 
సొత్తయిన జనముగా మము చేసితివే -
నీ రాజ్య వారసులుగా మము మార్చితివే - 
నీ ప్రియ బిడ్డలుగా మము నుంచితివే (2)
మమ్మును కనికరించి నీ మాటనే నెరవేర్చి (2)
నీ ప్రజలనే విడిపించవా - 
.నీ ప్రజలనే కాపాడవా (2) ||నీ ప్రజల||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...