Showing posts with label Priya yesu raju ne chuchina lyrics. Show all posts
Showing posts with label Priya yesu raju ne chuchina lyrics. Show all posts

01 August 2020

Priya yesu raju ne chuchina | ప్రియ యేసు రాజును

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నే నాయనతో నుంటే చాలు
నిత్యమైన మోక్ష గృహము నందు చేరి 
భక్తుల గుంపులో హర్షించిన మేలు

1.యేసుని రక్తమందు కడుగబడి
వాక్యముచే నిత్యం భద్రపరచబడి (2)
నిష్కళంక పరిశుద్ధులతో పేదన్ నేను (2)
బంగారు వీధులలో తిరిగెదను ||ప్రియ||

2.దూతలు వీణలను మీటునపుడు
గంభీర జయధ్వనులు మ్రోగునపుడు (2)
హల్లెలూయా పాటలు పాడుచుండ (2)
ప్రియయేసుతో నేను ఉల్లసింతున్ (2) ||ప్రియ||

3.ముండ్ల మకుటంబైన తలను చూచి
స్వర్ణ కిరీటం బెట్టి యానందింతున్
కొరడాలతో కొట్టబడిన వీపున్ జూచి (2)
ప్రతియొక్క గాయమును ముద్దాడుదున్(2) ||ప్రియ||

4.హృదయము స్తుతులతో నింపబడె
నా భాగ్య గృహమును స్మరియించుచు (2)
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయా (2)
వర్ణింప నా నాలుక చాలదయ్యా (2) ||ప్రియ||

5.ఆహా యా బూర యెపుడు మ్రోగుతుందో !
ఆహా నాయాశ యెపుడు తీరుతుందో ! (2)
తండ్రి నా కన్నీటిని తుడుచునెపుడో ! (2)
ఆశతో వేచియుండె నా హృదయం ! (2) ||ప్రియ||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...