Showing posts with label Zion songs lyrics. Show all posts
Showing posts with label Zion songs lyrics. Show all posts

08 May 2023

Anyajanulela lechi lyrics | అన్యజనులేల లేచి


అన్యజనులేల లేచి
గల్లత్తు చేయుచున్నారు - అన్యజనులేల
జనములేల వ్యర్థమైన
దాని తలంచుచున్నవి (2) ||అన్యజనులేల||
 
భూలోక రాజులు లేచి
వారేకముగా ఆలోచించి - భూలోక రాజులు
వారి పాశములను తెంపి
పారవేయుద మనుచున్నారు (2) ||అన్యజనులేల||
 
ఆకాశ వాసుండు వారిని
అపహసించుచున్నాడు నవ్వి – ఆకాశ వాసుండు
వారలతో పల్కి కోపముతో
వారిని తల్లడిల్ల చేయును (2) ||అన్యజనులేల||
 
పరిశుద్ధమైన నాదు
పర్వతమగు సీయోను మీద - పరిశుద్ధమైన
నారాజు నాసీనునిగా జేసి
యున్నానని సెలవిచ్చెను (2) ||అన్యజనులేల||
 
కట్టడ వివరింతు నాకు
యిట్లు చెప్పెను యెహోవాయందు - కట్టడ వివరింతు
నీవు నా కుమారుడవు
నిన్ను నేను కనియున్నాను (2) ||అన్యజనులేల||
 
నన్ను అడుగుము నీకు
జనముల భూమిని స్వాస్థ్యముగా - నన్ను అడుగుము
దిగంతముల వరకు
స్వాస్థ్యముగా నొసంగెదను నీకు (2) ||అన్యజనులేల||
 
ఇనుప దండముతో నీవు
వారిని నలుగగొట్టెదవు - ఇనుప దండముతో
కుండను పగులగొట్టునట్లు
వారిని పగులగొట్టెదవు (2) ||అన్యజనులేల||
 
ఓ రాజులారా మీరు
జ్ఞానవంతులై యుండుడి - ఓ రాజులారా
ఓ భూపతులారా మీరు
నాభోద నొందుడి నేడే (2) ||అన్యజనులేల||

06 May 2023

Prematho yesu piluchuchunnadu | ప్రేమతో యేసు పిలుచుచున్నాడు



ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము
రక్షణను పొంది - లక్షణముగా వెళ్ళుదము

1. పాపమెరుగని ప్రభు నీ కొరకు
పాపముగను చేయబడెను
శాపగ్రహియాయె సిలువలో
శాపగ్రహియాయె సిలువలో పరుగిడి రమ్ము

2. ముండ్ల కిరీటమును ధరించి
ముఖముపై నుమ్మి వేయబడె
ప్రాణమిడె నేసు సిలువలో
ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము

3. సిలువలో నీకై దప్పిగొని
కలుష నీ క్షమకై ప్రార్థించి
సహించి ప్రాణమిడె నీ కొరకు
సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము

4. తప్పిన గొర్రెను రక్షంప
తనదు రక్తమును చిందించె
కాపరి స్వరము ధ్వనించె
కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము

5. తామసించ తగదిక ప్రియుడా
త్వరపడుము నీ రక్షణ కొరకు
నేడే నీ రక్షణ దినము
నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము

6. తానే కడుగును తన రక్తముతో
తండ్రివలె నీ పాపమునంత
తనయుడవై పోదు విపుడే
తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము

7. ప్రేమవార్త ప్రకటింపబడె
ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము
కృపాకాలమిదే జాగేల
కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము

09 April 2023

Painunna akashamandunna | పైనున్న ఆకాశమందునా

పైనున్న ఆకాశమందునా - క్రిందున్న భూలోకమందునా (2)
లేదు రక్షణ ఏ నామమున - లేదు పాప విమోచన (2) ||పైనున్న||

అన్ని నామములకు పైని కలదు -
ఉన్నతంబగు యేసుని నామము (2)
యేసు నామములో శక్తి కలదు (2)
దోషులకు శాశ్వత ముక్తి కలదు (2) ||పైనున్న||

అలసి సొలసిన వారికి విశ్రం -
జీవము లేని వారికి జీవము (2)
నాశనమునకు జోగేడి వారికి (2)
యేసు నామమే రక్షణ మార్గము (2) ||పైనున్న||

యేసు నామము స్మరియించగానే -
మనసు మారి నూతనమగును (2)
బేధమేమియు లేదెవ్వరికిని (2)
నాథుని స్మరియించి తరింప (2) ||పైనున్న||

Prabhu goppa karyamulu | ప్రభు గొప్ప కార్యములు చేసెనని

ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము
ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా
 
ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె
పాత్రులముగా సేవింతుము

1.దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము
దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాడెదము
||ప్రభు||

2.సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని
సితార స్వరమండలములతో - మన మార్భాటించెదము ||ప్రభు||

3.మన భారములన్నియు తొలగించె - ఘనకార్యములను జేసె
దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో ||ప్రభు||

4.నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు
బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం ||ప్రభు||

5.ప్రేమా సౌందర్యములు గలవాడు - క్షేమము నిచ్చువాడు
మహిమైశ్వర్యములు గలవాడాయనే మహిని బొగడెదము ||ప్రభు||

6.మనకెన్నో వాగ్దానము లిచ్చె మన మనుభవించితిమి
ఘనతా మహిమ ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమెన్ ||ప్రభు||

16 December 2022

Aanandamu prabhu nakosagenu | ఆనందము ప్రభు నాకొసగెను

ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను (2)
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను (2) ||ఆనందము||

ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము||

అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ (2) ||ఆనందము||

శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ (2)
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము||

25 April 2022

Ne yesuni vembadinthunani | నే యేసును వెంబడింతునని నేడేగా

నే యేసుని వెంబడింతునని - నేడేగా నిశ్చయించితిని
నే వెనుదిరుగన్ వెనుకాడన్ - నేడేసుడు పిల్చిన సుదినం

నాముందు సిలువ - నావెనుక లోకాశల్ నాదే దారి - నామనసులో ప్రభు
నాచుట్టు - విరోధుల్ నావారెవరు - నాయేసుని మించిన మిత్రుల్
నాకిలలో గనిపించరని

కరువులైనను - కలతలైనను కలసిరాని - కలిమిలేములు - కలవరంబులు
కలిగిననూ - కదలనింకా కష్టములైన - వదలను నాదు నిశ్చయము

శ్రమయైనను - బాధలైనను హింసయైన - వస్త్రహీనత - ఉపద్రవములు
ఖడ్గములైన - నా యేసుని ప్రేమనుండి నన్ను యెడబా పేటి వాడెవడు

14 October 2021

Yehova Naaku Velugaye | యెహోవా నాకు వెలుగాయె

యెహోవా నాకు వెలుగాయె - యెహోవా నాకు రక్షణయే 
నా ప్రాణ దుర్గమయ్యె - నేను ఎవరికీ ఎన్నడు భయపడను (2)

1. నాకు మార్గమును ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించే (2) 
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో - స్తుతి గానము చేసెదను (2)  ||యెహోవా||

2. నా కొండయు నా కోటయు - నా ఆశ్రయము నీవే (2) 
నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో - స్తుతి గానము చేసెదను (2) ||యెహోవా||

3. నా తల్లియు నా తండ్రియు - ఒకవేళ విడచినను (2) ఆపత్కాలములో చేయి విడువకను - యెహోవా నన్ను చేరదీయును (2) || యెహోవా ||

14 August 2021

Kalvari Girilona Silvalo | కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)

1. ప్రతివానికి రూపు నిచ్చె - అతనికి రూపు లేదు (2)
పదివేలలో అతిప్రియుడు - పరిహాసముల నొందినాడు (2) ||నీ కోసమే||

2. వధ చేయబడు గొర్రెవలె - బదులేమీ పలుకలేదు (2)
దూషించు వారిని చూచి - దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||

3. సాతాను మరణమున్ గెల్చి - పాతాళ మందు గూల్చి (2)
సజీవుడై లేచినాడు - స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||

07 July 2021

Naa prana priyuda yesu raja | నా ప్రాణ ప్రియుడా యేసు రాజా

666
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా - అర్పింతును నా - హృదయార్పణ 
విరిగి నలిగిన ఆత్మతోను - హృదయ పూర్వక ఆరాధనతో - సత్యముగా ||నా ప్రాణ||
 
1.అద్భుతకరుడా ఆలోచన - ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బహుప్రియుడా - మనోహరుడా - మహిమ రాజా - స్తుతించెదన్ ||నా ప్రాణ||
 
2.వీమోచన గానములతో - సౌందర్య ప్రేమ     స్తుతులతో - 
నమస్కరించి ఆరాధింతున్ - హర్షింతును నే పాడెదన్ - నా ప్రభువా ||నా ప్రాణ||
 
3.గర్భమున పుట్టిన బిడ్డను - కరుణించక తల్లి మరచునా 
మరచినా గాని నీ వెన్నడు - మరువవు విడువవు ఎడబాయవు - కరుణారాజా ||నా ప్రాణ||
 
4.రక్షణాలంకారములను - అక్షయమగు నీయాహరమున్ - 
రక్షకుడా నా కొసగితివి - దీక్షతో నిన్ను వీక్షించుచూ - స్తుతింతును ||నా ప్రాణ||
 
5.నీ నీతిని నీ రక్షణను - నా   పెదవులు       ప్రకటించును -
కృతజ్ఞత స్తుతులతోడ - నీ ప్రేమను నే వివరింతునూ - విమోచకా ||నా ప్రాణ||
 
6.వాగ్దానములు నాలో నెరవేరెన్ - విమోచించి నా కిచ్చితివే - 
పాడెదము ప్రహర్షింతును - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా ||నా ప్రాణ||
– మాధుర్యం గారు 
DOWNLOAD MP3 SONG HERE 👇

06 July 2021

Halleluya paadeda prabhu Ninnu Koniyadeda | హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను

హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2) 
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| 

1.వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) 
నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే (2) 
ప్రభువా.. నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా|| 

2.ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ (2) 
ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) 
ప్రభువా.. నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

3.కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును (2)
నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2)
ప్రభువా.. నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||

02 July 2021

Athyantha Sundarudunu Yellari | అత్యంత సుందరుండును ఎల్లరి

1.అత్యంత సుందరుండును - ఎల్లరి కాంక్షణీయుడు
దేవాది దేవుడైన మా - కల్వరి యేసు నాథుడు

పల్లవి: కల్వరి నాథుడా - నన్ను జయించితి
రక్షింప మృతుడైన - కల్వరి యేసు నాథుడా

2.గాయపడి శ్రమలతో - పాపదుఃఖము మోసితివి
సిల్వలో మరణించితివి - దుఃఖ కల్వరి నాథుడా

3.శాంతి జీవము నీయను - ఖైదీల విమోచనమునకై
రక్తపు ఊట తెరచితివి - ప్రేమ కల్వరి నాథుడా

4.తెచ్చిన ఈవులెల్లను - మేలుకొరకు మనకిచ్చి
ప్రేమనదిని పోసెను - దయాకల్వరి నాథుడా

5.మహిమ పూర్ణుడగు నిన్ను - కండ్లార చూతుమనుటయే
ఇచ్చట మా ఆదరణ - సాటిలేని కల్వరి ప్రభూ

6.స్పటిక సముద్ర తీరమున - నీ ప్రేమయందు మున్గుచు
నీ వలె నుందు నిత్యము - మహిమ కల్వరి నాథుడా

30 June 2021

Aakashamandu Neevundaga Nenu | ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి

ఆకాశమందు నీవుండగా - నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా - నేను దేనికి భయపడను (2)

1. శత్రుసమూహము నన్ను చుట్టినా - సైతనుడు సంహరింప జూసినా (2)
నా సహవాసిగా నీవుండగా - నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు||
2. వ్యాధులు కరువులు శోధనలు - బాధలు దుఃఖము వేదనలు (2)
మరణము మ్రింగగ కాంక్షించినా - నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు||

3. పడిపోయిన వెనుకంజ వేయక - పశ్చాత్తాపము పడి అడుగు (2)
నిను క్షమియించును నీ ప్రభువే - నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||

27 June 2021

Devaa Naa Moraalakinchithivi | దేవా నా మొరాలకించితివి

దేవా నా మొరాలకించితివి - నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము ||దేవా||

1. కనికరించి నా మొరను – ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2)
స్తోత్రము చేయుదు హల్లెలూయని
నా జీవిత కాలమంతా (2) నా జీవిత కాలమంతా…
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ||దేవా||

2. కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి -
నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2)
నీ కృపాతిశయమును నిత్యము - కీర్తింతునో ప్రభువా (2) కీర్తింతునో ప్రభువా….
హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా..హల్లెలూయా..
హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||
DOWNLOAD MP3 SONG HERE 👇

Prabhuva Neeve Nammakamaina | ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు

ప్రభువా నీవే నమ్మకమైన సామర్ధ్యుడవు
ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడ

1. ఇహపరమందు నివసించువారు నీ నామమున మోకరింతురు
మహిమ పరతురు దేవుని
అంగీకరించు ప్రతివానిజిహ్వ నీవే క్రీస్తువనుచు

2. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్ల పరిపాలించుచున్నావు
ప్రేమగల ప్రభువా
పాపిని రక్షింప యిహమున కరిగి గొప్పరక్షణనిచ్చె

3. ఐగుప్తునుండి విడిపించిన వారిని నలువది వత్సరములు
నడిపించితివి కాచితివి కనుపాపగ
వుంచియున్నావు మాదిరిగా వారిన్ నీ ఆలోచన గొప్పది

4. పరమును తెరచి మన్నా కురిపించి అందరికి జీవజలమిచ్చితివి
పొందిరి తృప్తి నీయందు
అగ్ని స్తంభము మేఘ స్తంభమును నిత్యము నడిపించును

5. తుఫానురేగి నిరాశపరచ శత్రువు మామధ్య చెలరేగగ
మమ్ములను రక్షించితివి
వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యము నిచ్చితివి
>

08 June 2021

Ee Loka Yathralo Ne Saaguchunda | ఈ లోక యాత్రలో నే సాగుచుండ

ఈ లోక యాత్రలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు - ఒకసారి యేడ్పు (2)
అయినను క్రీస్తేసు నాతోడ నుండు (2) || ఈ లోక ||

1. జీవిత యాత్ర ఎంతో కఠినము (2) 
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు యెన్నెన్నో ఉండు (2) 
కాయువారెవరు రక్షించేదెవరు (2) || ఈ లోక ||

2. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆధరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు(2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) || ఈ లోక ||

3.తోడై యుండెదవు అంతము వరకు (2) 
నీవు విడువవు అందరు విడచినను (2) 
నూతన బలమును నాకొసగెదవు (2) 
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) || ఈ లోక ||
DOWNLOAD MP3 SONG HERE👇

31 May 2021

Devadi Devaa Prabhuvula Prabhu | దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల


దేవాది దేవా ప్రభువుల ప్రభూ 
రాజుల రాజా హల్లెలూయ 

1. నీ రక్తముతో విమోచించి - 
నీ రక్తముతో సంపాదించి 
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి - 
పరలోక పాటన్ నా కొసగితివి ||దేవాది దేవా||

2.జీవిత నావలో తుఫాను రేగ - 
భయపడకుడని అభయము 
జయప్రదముగా నన్ను నడిపించి - 
జయజీవితము నా కొసగుచున్న ||దేవాది దేవా|| 

3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - 
కరుణతో నీ సొత్తుగా నన్ను 
అరమర లేక నన్నాదరించి - 
పరలోక దర్శనంబిచ్చితివి ||దేవాది దేవా||

4. మరణ పాత్రులం యిధరణిలోన - 
దురిత ఋణముల స్మరణను మాన్పి 
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - 
నీ రాజ్యమందు రాజులన్ ||దేవాది దేవా|| 

5. శోధనగాధల కష్టములలో - 
నా దుఃఖములలో నే నేడ్వకుండా 
నీ దయ నాపై నిండార నింపి - 
ఓదార్చి నన్ను నీ దారినడుప ||దేవాది దేవా|| 

6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - 
ప్రభు జాడలు సారము జల్లున్ 
ప్రతి బీడునూ సారము చిలకన్ - 
ప్రతి పర్వతము ఆనందించున్ ||దేవాది దేవా|| 

7.పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట - 
సర్వశక్తిగల క్రీస్తుని యెదుట 
పరలోక నూతన గీతము పాడ - 
జేర్చితివి నన్ నీ జనమునందు  ||దేవాది దేవా||
DOWNLOAD MP3 SONG HERE 👇

27 May 2021

Madhuram Madhuram Yesuni | మధురం మధురం యేసుని నామం

మధురం మధురం యేసుని నామం
మధురం మధురం యేసుని నామం 
హృది మదిలో యేసే నిలయం (2)
            
యేసుని ప్రేమ జీవపు ఊట 
రక్షణ మనకు ప్రతి పూట...ఆఆఆఆ (2)
యేసుని వాక్యం పరిమళ తోట (2)
యేసే మనకు ఉన్నత కోట ॥మధురం॥
              
వినిపించాలి అందరి నోట 
యేసుని నామం ప్రతి చోట (2)
మధురమైనది యేసుని మాట (2)
యేసే మనకు ఉన్నత కోట ॥మధురం॥

26 May 2021

Sri Yesu Naamam Shakthigala | శ్రీ యేసు నామం శక్తిగల నామం

శ్రీ యేసు నామం - శక్తిగల నామం 
పాపికి పుణ్య నామం 

1.ఎల్ల నామములకెల్ల - మేలైన నామం యేసుని - దివ్య నామం (2)
సర్వజనులెల్ల - సర్వ కాలమంతా (2) 
హర్షముతో - పాడు నామం (2)

2.పాప పరిహారమిచ్చి - పాపులను రక్షింప - పుడమికే తెంచె నామం (2)
పాప రహిత జీవితం - ప్రసాదించే నామం (2) 
పరిశుద్ధ - పుణ్య నామం (2)

3.పాప గోడలన్నియు - పడగొట్టునట్టి - ప్రభు యేసు ప్రియ నామం (2)
దోషములు మోసములు - నాశనమొనరించు (2) 
పరిశుద్ధ - పుణ్య నామం (2)

4.పాపచింతలన్నీ - పారద్రోలు నామం - ప్రభు యేసు పుణ్య నామం (2)
నిత్య శాపం మాపి - సత్య మార్గం చూపి (2) 
నిత్య రాజ్యం చేర్చు నామం

5.వ్యాధి బాధలనియ్యు - భరించిన నామం - స్వస్థపరచు యేసు నామం (2)
కష్టనష్టములలో - కాచి కాపాడెడు (2) 
క్రీస్తు యేసు - దివ్య నామం 

6.శత్రు సైతానుని - సంహరించినట్టి - శక్తిగల యేసు నామం (2)
నిత్య జీవమిచ్చి - సత్య వేదమిచ్చిన (2) 
శ్రీ యేసు ఘన నామం 

7.ఎంత ఘోరపాపమైన - ఎంత మొత్తమైన - క్షమియించు యేసు నామం (2)
పాప పరితముతో - ప్రభు పాదం చేరిన (2) 
కాపు నిచ్చు - కృప నామం (2)
DOWNLOAD MP3 SONG HERE 👇

25 May 2021

Prabhu yesu na rakshaka | ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు

ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు 
నాకు నిరతము నే నిన్ను జూడ - 
అల్ఫయు నీవే - ఓమేగయు నీవే 

1.ప్రియుడైన యోహాను పత్మాసులో - 
ప్రియమైన యేసూ - నీ స్వరూపము (2)
ప్రియమార జూచి - బహు ధన్యుడయ్యె 
ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము (2) || ప్రభు ||

2.లెక్కలేని మార్లు పడిపోతిని - 
దిక్కులేనివాడ - నే నైతిని (2)
చక్కజేసి నా - నేత్రాలు దెరచి 
గ్రక్కున - నిన్ను జూడనిమ్ము (2) || ప్రభు || 

3.ఎఱిగి ఎఱిగి నే - చెడిపోతిని - 
యేసు నీ గాయము - రేపితిని (2)
మోసపోతి నేను - దృష్టి దొలగితి 
దాసుడ నన్ను - జూడనిమ్ము (2) || ప్రభు || 

4.ఎందరేసుని వైపు - చూచెదరో - 
పొందెదరు వెల్గు - ముఖమున (2)
సందియంబు లేక - సంతోషించుచు - 
ముందుకు - పరుగెత్తెదరు (2) ||ప్రభు||

5.విశ్వాసకర్తా  ఓ యేసు ప్రభూ - 
కొనసాగించువాడా - యేసు ప్రభూ (2)
వినయముతో నేను - నీవైపు జూచుచు - 
విసుగక - పరుగెత్త నేర్పు (2) || ప్రభు || 

6.కంటికి కనబడని - వెన్నియో - 
చెవికి వినబడని - వెన్నియో (2)
హృదయ గోచరము - కాని వెన్నియో 
సిద్ధపరచితివా - నాకై (2) || ప్రభు || 

7.లోక భోగాలపై  నా నేత్రాలు - 
సోకకుండునట్లు  కృపజూపుము (2)
నీ మహిమ దివ్య - స్వరూపమును - 
నిండార నను - జూడనిమ్ము (2) || ప్రభు || 

Aanandamuga Yehova Nee Krupalanni | ఆనందముగా యెహోవా నీ కృపలన్ని

ఆనందముగా యెహోవా నీ కృపలన్ని 
అన్ని కాలంబులందు కీర్తించెదన్ (2) 

1. చావు గోతినుండి - లెవనెత్తి నాకు - జీవమిచ్చిన జీవ దాత (2)
 వివరింతునే నీదు - విశ్వాస్యత నెంతయో - 
సవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా||

2. సింహపు పిల్లలు - ఆకలిగొనిన - యెహొవ సహాయుడందరికి (2)
ఇహమందునా ఏమేలు కొదువ యుండదు - 
అహా  ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||

3. ఎన్నెన్నో శోధన బాధలు రేగి - నన్ను కృంగదీయ పోరాడినన్ (2)
ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిన - 
కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా||

4. పర్వతంబులు - పారిపోయినను - ఉర్విలోమార్పు కలిగిననూ (2)
తరుణములు విరోధముగపై లేచినా - 
స్మరియించెద నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా||
=======================
Aanandamugaa Yehovaa Nee Krupaalanni 
Anni Kaalambulandu Keerthinchedan ( 2 ) 

Chaavu Gothinundi Levaneththi Naaku - Jeevamichchina Jeeva Daatha (2)
Vivarinthu Ne Needu Vishwaasyatha Nenthayo
 Savyambugaa Ee Bhuviyanduna ||Aananda||

Simhapu Pillalu – Aakaligonina - Yehova Sahaayu Dandariki (2)
Ihamandunaa Ae Melu Koduva Yundadu 
Aaha ! Emandu Nee Vishwaasyathan ||Aananda||

Ennenno Shodhana Baadhalu Regi – Nannu Krungadeeya Poraadinan (2)
Ghanamaina Nee Vishwaasyathan Naaku Choopina 
Kanna Thandri Ninnu Koniyaadedan ||Aananda||

Parvathambulu - Paaripoyinanu- Urvilo Maarpu Kaliginanoo (2)
Tharunamulu Virodhamuga Pai Lechina
 Smariyincheda Nee Vishwasyathan ||Aananda||

DOWNLOAD MP3 SONG HERE

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...