Showing posts with label B. Show all posts
Showing posts with label B. Show all posts

09 December 2024

Bangaru bommavu neevamma బంగారు బొమ్మవు నీవమ్మా

బంగారు బొమ్మవు నీవమ్మా వధువు సంఘమా రావమ్మా
శృంగార ప్రభువు యేసమ్మ వరుడు క్రీస్తు గొరియ పిల్లమ్మ

1. పశ్చాత్తాపమే పెండ్లి చూపులమ్మా– పాప క్షమాపనే నిశ్చితార్దమమ్మా
విరిగిన మనసే వరుని కట్నమమ్మా– నలిగిన హృదయమే పెళ్లి పత్రికమ్మా
గొరియ పిల్ల రక్తములొ తడిచిన – పవిత్ర కన్యవై నిలచేవమ్మా ||బంగారు||

2. కొరడా దెబ్బలే పెండ్లి నలుగమ్మా– అసూయ ద్వేషాలే సుగంధ ద్రవ్యమమ్మా నెత్తుటి ధారలే పెళ్లి చీరమ్మా – ముళ్ళ కిరీటమే పెండ్లి ముసుగమ్మా ప్రకాశమానమై నిర్మలమయమై పరిశుద్ధ క్రియలై నడిచేవమ్మా ||బంగారు||

3. కల్వరి కొండే పెళ్లి పీటమ్మా – దేవుని దూతలే పెండ్లి సాక్షులమ్మా
సిలువ దండనే పెండ్లి సూత్రమమ్మా – దూషణ క్రియలే పెండ్లి అక్షింతలమ్మా సువర్ణమయమై స్వచ్చమైన స్పటికమువలే మెరిసేవమ్మా ||బంగారు||

27 August 2023

Bhayamu chendaku bhakthuda భయము చెందకు భక్తుడా


భయము చెందకు భక్తుడా - ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
భయము చెందకు నీవు - దిగులు చెందకు నీవు (2)
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||

1.బబులోను దేశమందున - ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
నాల్గవ వాడు ఉండలేదా - ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము||

2.చెరసాలలో వేసినా - తన దేహమంతా గాయాలతో నిండినా (2)
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
భూకంపం కలుగ లేదా - ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము||

3.ఆస్తి అంతా పోయినా - తన దేహమంతా.. కురుపులతో నిండినా (2)
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2)
అని యోబు పలుక లేదా - ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము||

23 July 2023

Bharatha desha suvartha sanghama భారత దేశ సువార్త సంఘమా


భారత దేశ సువార్త సంఘమా - భువి దివి సంగమమా (2)
ధర సాతానుని రాజ్యము కూల్చే - యుద్ధా రంగమా ||భారత||

1.ఎవని పంపుదును నా తరపున - ఇల ఎవరు పోవుదురు నాకై (2)
నేనున్నాను నన్ను పంపమని - రమ్మూ సంఘమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

2.అడవి ప్రాంతములు, ఎడారి భూములు - ద్వీపవాసులను గనుమా (2)
అంధకార ప్రాంతములో ప్రభుని - జ్యోతిని వెలిగించను కనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

3.బ్రతుకులోన ప్రభు శక్తిలేని - క్రైస్తవ జనాంగమును గనుమా (2)
కునుకు దివ్వెలను సరిచేయగ - ఉజ్జీవ జ్వాలగొని చనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||

11 December 2022

బేత్లెహేము పురమందున | Bethlehemu Puramanduna


బెత్లెహేము పురమందున - రారాజు పుట్టాడంట
రారండి జనులారా - రక్షకుని చూసొద్ధాం..
ఆడి పాడి ఆనందిద్దాం..
బెత్లెహెము పురమందున - రారాజు పుట్టాడంట
రారండి జనులారా - ఆడి పాడి ఆనందిద్దాం (2)
కలిసి మెలిసి పోదాం - రక్షకుని చూసొద్ధాం (2)  
ఆనందం పరమానందం - నింగీ నేేలా పరవశం (2) ||బెత్లె||

1.గొల్లలకు శుభవార్త - అభయమిచ్చి దూత చెప్పింది
దావీదు పురమందు - రక్షకుండు పుట్టాడని (2)
దివియందు దేవునికి మహిమ - భువియందు సమాధానం (2)
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం ||బెత్లె||

2.పాపాల వలయంలో - మనుజులు పడివున్నప్పుడు
పాపాన్ని రూపుమాప - పరిశుద్ధుడు ఇలకేతెంచెన్ (2)
కన్య మరియ గర్భాన్న - మనుజావతారుడై పుట్టెన్ (2)
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం ||బెత్లె||

3.నింగిలో వింతైన తారా - జ్ఞానులకు దారి చూపింది
రారాజుని గాంచి - కానుకలు అర్పించి పూజించిరి (2)
రారాజు జననం మానవాళికే వరం - విరోధికే కలవరం (2)
ఇదియే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం ఆనందం ||బెత్లె||

02 December 2022

Baludu kadhammo balavanthudu | బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు


బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు
పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2)
పరమును విడిచి పాకలో పుట్టిన
పాపుల రక్షకుడు మన యేసయ్య (2)

కన్య మరియ గర్భమునందు బెత్లహేము పురము నందు (2)
ఆ పశుశాలలోన పుట్టినాడమ్మ
ఆ వార్త తెలియగానే గొర్రెలను విడిచి
పరుగు పరుగున పాక చేరాము

మనసారా మ్రొక్కినాము మది నిండా కొలిచినాము (2)
మా మంచి కాపరని సంతోషించాము
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||

చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము
పరిశుద్ధుని చూసి పరవశించామే
రాజుల రాజని యూదుల రాజని
ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2)
బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2)
ఇమ్మానుయేలని పూజించామమ్మో
సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు||

08 June 2022

Bhajiyinthumu raare yesuni | భజియింతుము రారే యేసుని

భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)
కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము||

1.రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి
ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)
సుందరుడగు యేసు నామం (2)
స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||

2.పాపములను బాపును ప్రభుయేసుని రక్తధారలు
పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)
పాపముల వీడి యేసుని (2)
స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||
-------------------------------
Bhajiyinthumu raare yesuni sthothra geethamutho
Galamuletthi keerthinthumu shreshta ganamutho (2)
Koniyaadi paadedamu keerthinchi pogadedamu (4) ||Bhajiyinthumu||

1.Raaraaju kreesthu ramyamugaa sevinchi
Prabhuvula prabhuvunu poojinchi sthuthiyinchi (2)
Sundarudagu yesu naamam (2)
Sthuthinchi bhajinchi padedamu ||Bhajiyinthumu||

2.Paapamulanu bapunu prabhu yesuni rakthadhaaralu
Paramuna ninnu cherchunu prabhuni divya vaakkulu (2)
Papamula veedi yesuni (2)
Sthuthinchi bhajinchi padedamu ||Bhajiyinthumu||

04 April 2022

Balipashuvuga naa korakai | బలిపశువుగా నా కొరకై ఏతెంచావు

బలిపశువుగా నా కొరకై ఏతెంచావు
క్రయధనముగా నీ ప్రాణం చెల్లించావు
చేతకాని మరణం కాదది చేయబూనినా ప్రేమైక త్యాగమది విమోచనకార్యం జరిగినది క్షమాపణ ద్వారం తీయబడినది

1.శ్రమపొందుచున్నను బెదిరించకుంటివి వధకు తేబడు గొర్రెలా మౌనివైతివి 
హేళన చేయువారిపై కోపించక ప్రార్ధన చేసియుంటివి
కారణమేమి లేకనే దూషించినా బాధను ఓర్చుకుంటివి భారము దించియుంటివి 

2.అధికారమున్నను తలదించుకుంటివి - అవమానములో సహనము వీడవైతివి 
నేరము మోపుచున్నను చలించక ఉత్తరమియ్యకుంటివి
వ్యాధిని అనుభవించుచు ఏమాత్రము రూపము లేకయుంటివి 
స్వస్థత నిచ్చియుంటివి 

3.కొట్టుచుండ వీపును అప్పగించుకుంటివి ఉమ్మువారికి నీ ముఖమును దాచవైతివి 
ఎన్నిక చేయకున్నను గణించక దోషిగ నిలిచియుంటివి
రక్షణ అనుగ్రహించను నీమీదను శిక్షను వేసుకుంటివి
మార్గము చూపియుంటివి

08 February 2022

Bhalashouryuda nee bhalathishayame | బలశౌర్యుడా నీ బలాతిశయమే

బలశౌర్యుడా నీ బలాతిశయమే - ఇంతవరకు నన్ను 
విజయోత్సాహముతో - ఊరేగించుచున్నది బహుతరములకు - శోభాతిశయముగ - మార్చుటకు  - నా ముందు
అ.ప: బలశౌర్యుడా - నా యేసయ్య - బహుధీరుడా - బహుబలవంతుడా

1. నా మార్గములన్నియు - నీకప్పగించుకొనగ 
నీ నీతి నియమములు - నేననుసరించగలిగితిని 
శత్రువు సంధించిన బాణబలము వలన - నా అడుగులు తడబడిపోగా
బహుధీరుడవై నా చేయి పట్టి - నా నడతను స్థిరపరచితివి ॥బలశౌర్యుడా॥

2. నిర్జీవ అరణ్యములు - నాకెదురవ్వగా - 
బలమైన ముండ్లపొదలు - అడ్డుకంచెగా నా త్రోవ మూసివేయగా 
ముందడుగు వేయలేని ఆ నిశిరాత్రిలో - నా గమ్యము కనుమరుగైపోగా 
నీతి సూర్యునివై నా ప్రక్క నిలిచి - అడ్డుతొలగించి పచ్చికగా మార్చితివి ॥బలశౌర్యుడా॥ 

3. నశించిన ఇశ్రాయేలు - జాలరులను పిలచితివి 
ఈ తరపు ప్రజలకు - పామరుడనైన నన్ను పిలచితివి రక్షణయే నాకు ప్రాకారముగా చేసి - ప్రఖ్యాతినే నాకు గుమ్మముగా నిలిపి 
న్యాయాధిపతివై నాకు న్యాయము తీర్చి - నా దుఃఖ దినములను సమాప్తము చేసితివి ॥బలశౌర్యుడా॥

02 January 2022

Brathukuta Nee Kosame | బ్రతుకుట నీ కోసమే

బ్రతుకుట నీ కోసమే - మరణమైతే నాకిక మేలు (2)
సిలువ వేయబడినానయ్యా (2)
నీవే నాలో జీవించుమయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2)

ఏ క్షణమైనా ఏ దినమైనా - నీ కొరకే నే జీవించెద (2)
శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా (2)
ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2)
సేవలో సాగెదనయ్యా. ||యేసయ్యా||

లోకములోని నిందలు నాపై - రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2)
రాజులైనా అధిపతులైనా - ఉన్నవి అయినా రాబోవువైనా (2)
నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2)
ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య||

19 December 2021

Bethlehemulo kreesthu raaju | బెత్లహేములో క్రీస్తు రాజు పుట్టాడని

బెత్లహేములో క్రీస్తు రాజు పుట్టాడని - మనకు వెలుగు వచ్చెనని దూత తెలిపెను వార్తా (2)
సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమా (2)
స్తుతించుచు ఘనపరచుచు ఆరాధించేదం (అర్బాటించెదం) (2)

1. దీనుడై పసిబాలుడై దివినుండి భువికొచ్చేను - మన పాపమంత కడుగుటకై రక్షకునిగా పుట్టెను (2) 
గొల్లలు జ్ఞానులు ఆయనను చూచి సంబర పడిపోయిరి (2) 
సంబ్రానియు బోలమును కానుకగా అర్పించిరి ||బెత్ల||

2. వీడరాని ఉన్నత భాగ్యం మనకొరకై విడిచెను సర్వ ప్రజల రక్షణ కొరకై దాసుని పోలిక ధరించెను (2)
సత్రములో స్థలము లేనందున పశులతొట్టెలో పరుండెను(2)
ఈలోకనికి తండ్రి ప్రేమను పంచెను క్రీస్తుని జననము (2) ||బేత్ల||

DOWNLOAD MP3 SONG HERE 👇

05 December 2021

Merry Christmas | Build a fire and gather

Build a fire and gather 'round the tree 
Fill a glass and maybe come and sing with me 

So kiss me under the mistletoe 
Pour out the wine let's toast and pray for December snow 
I know there's been pain this year but it's time to let it go 
Next year you never know, but for now
Merry Christmas 

We'll dance in the kitchen while embers glow 
We've both known love, but this love that we got is the best of all 
I wish you could see you through my eyes then you would know 
My god you look beautiful right now 
Merry Christmas

The fire is raging on 
And we'll all sing along to the songs 
Just having so much fun 
While we're here can we all spare a thought for the 
ones who have gone 
Merry Christmas everyone 

So just keep kissing me under the mistletoe 
Pour out the wine let's toast and pray for December snow 
I know there's been pain this year but it's time to let it 
go Next year you never know, but for now Merry Christmas 

We'll dance in the kitchen while embers glow 
We've both known love , but this love that we got is the best of all 
I wish you could see you through my eyes then you would know 
My god you look beautiful right now 
Merry Christmas

I feel it when it comes 
Every year helping us carry on Filled up with so much love 
All our family and friends are together where we all belong 
Merry Christmas everyone 

It's Christmas time for you and I 
We'll have a good night and a Merry Christmas 
It's Christmas time for you and I 
We'll have a good night and a Merry Christmas

Song: Merry Christmas
Artist: Ed Sheeran , Elton John
Album: Merry Christmas

01 December 2021

Bethlehemu Puramulona | బెత్లహేము పురములోనా


బెత్లహేము పురములోనా జన్మించినావయ్య 
మా పాపాలన్ని కడుగుటకు - పశువుల శాలలో పవలించావా
 
ఎంత ప్రేమయ్యా నాపై నీకు వర్ణించలేనయ్య
అందుకో దేవా నా వందనం (2) నా వందనం (2)
Happy happy christmas 
Merry merry christmas

తూర్పు దిక్కున నీ చూచిక జ్ఞానులకు సంతోషమే (2)
తెచ్చినారు నీకు బహుమతులు బంగారు సాంబ్రాణి బొళం (2) 
అందుకో దేవా నా వందనం నా వందనం (2)

దివినుండి దేవదూత గొల్లలకు చెప్పేను శుభవార్త(2) 
రక్షకుడు పుట్టడని సంతోష గానాలతో (2) 
అందుకో దేవా నా వందనం (2)
Happy happy christmas 
Merry merry christmas

DOWNLOAD MP3 SONG HERE👇

29 October 2021

బలము నొందుకో

🙏ప్రభువు నామములో శుభోదయం.🙏..

⛪నేడు దిన ధ్యానము⛪

✝️ *బలము నొందుకో*✝️

యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.
నెహె 8:10

దేవుని యందు ఆనందించుట అనేది చాలా గొప్ప లక్షణం. దేవుడు తన ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. దేవుని యందు ఆనందించువాడు ఎల్లప్పుడూ విజయాలే పొందుకుంటాడు. ఒకవేళ కష్టం వచ్చినా దాని నుంచి జయించడానికి ఆయన నీకు శక్తినిస్తాడు. దేవుని కొరకు బలంగా కార్యాలు చేయగలుగుతావు. అలానే దేవుని లో ఆనందించని వాడు ఎన్నటికీ దేవుని బలము పొందుకోలేరు. లోకరీతి క్షణమైన జీవితంలో బలం అధికారం ఏదైనా ఉండవచ్చు కానీ అవి శాశ్వతమైన ఆనందం బలాలు కాదు అందుకే నీవు నీ జీవితంలో అశాశ్వతమైన వాటి కొరకు పరుగులు తీయగా శాశ్వతమైన ఆనందాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి. దేవుడు నీ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు అంతే కానీ అసలు ప్రయత్నించకుండా నా జీవితంలో ఆనందం లేదు నేను ఏమి చేయలేకపోతున్నాను. ఏమి చేయాలన్న నా దగ్గర బలము లేదే అని నిరాశ పడిన రోజున సాతానుకి నీ జీవితము పై అధికారం వస్తుంది. అందుచేతనే ఎంత కష్టం వచ్చినా కృంగిపోకు, నిరాశపడకు, దేవుని పై ఆధారపడు, నీ జీవితానికి ఆనందం లభిస్తుంది. దేవుని పై ఆధారపడే వారికే ఆయన బలము కలుగజేస్తాడు. అటువంటి  కృపా సహాయము దేవుడు నీకు కలుగజేయును గాక!

🛐 *ప్రార్ధన:-*🛐 
నా దేవా నా జీవితాంతం మీ పై ఆధారపడి బలము పొందుకొనే కృపను నాకు దయ చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

12 October 2021

Bhulokarajyamulanniyu | భూలోక రాజ్యములన్నియు


భూలోక రాజ్యములన్నియు యెహోవా దేవునివే
భూలోక నివాసులందరు ఆయన వారసులే (2)

సమస్త దేశములారా సంతోషగానము చేయుడి -
యెహోవాయే దేవుడని ఉత్సాహగానము చేయండి (2)
మహోన్నతం ప్రభు నామము పరిశుద్ధుడని కొనియాడుడి 
మహోన్నతుని మహత్యము సమాజములో కీర్తించుడి

సియోనులో సింహాసనాసీనుడు - నీతి న్యాయములతో పరిపాలించు వాడు (2)
అన్యజనులకు రక్షణ శృంగముగా (2)
నిబంధన జనులను నిత్యము నడిపించును (2) ||సమస్త||

సైన్యాధిపతిగా విజయము దయచేయును - శత్రువులను సహ మిత్రులను చేయువాడు (2)
భక్తులందరినీ అభయ హస్తముతో (2)
ప్రతి ఉదయమున కృపలతో తృప్తిపరచును(2) ||సమస్త||

ఈ లోక రాజ్యములు క్షయమై పోవునవి - దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము (2) 
తరతరములకు యుగయుగముల వరకు (2)
సర్వాధిపతిగా ప్రభువే పాలించును (2) ||సమస్త||

DOWNLOAD MP3 SONG HERE 👇

26 August 2021

Bhumiyu Daani Sampurnatha| భూమియు దాని సంపూర్ణత

భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే (2)

ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు||

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు||

వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2) ||భూమియు||

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2) ||భూమియు||

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2) ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2) ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2) ||భూమియు||

16 August 2021

Bhumandalmu daani sampurnatha | భూమండలము దాని సంపూర్ణత

24
సర్వము దేవుని సొత్తు
(దావీదు కీర్తన 24)
రా – హరికాంభోజి, తా – ఆది
(చాయః సఖులార సంఘంపుబడి)
                
భూమండలము దాని సం - పూర్ణత యును లోకమును = భూమండల వాసులను -  బొల్పార యెహోవావే || భూ ||

1.యెహోవ సంద్రము మీఁద - భూమి పునాది వేసె = మహాజలముల మీఁద - మనదేవుఁడది స్థిరపర్చె || భూ ||

2.యెహోవ పర్వతమునకు - నెక్కంగఁ బాత్రు డెవఁడు = మహాలయంబునందు - మరి నిల్వ యోగ్యుం డెవఁడు || భూ ||

3.అపవిత్ర మనసులేక - కపట ప్రమాణము లేక = సు పవిత్రమౌ చేతులను - శుద్ధాత్మ గల్గినవాఁడే || భూ ||

4.ఆలాటి వాఁడు ప్రభుని - యాశీర్వచనము నొందు = భూలోకమున రక్షణ - దేవుని నీతి మత్వముపొందు || భూ ||

5.ప్రభునాశ్ర యించు నట్టి వారు - యాకోబు దేవ = ప్రభుసన్ని ధానము వెదకు - ప్రజలెల్ల రట్టివారే || భూ ||

6.ద్వారంబు లార యిఁక మీ - తల లెల్లబైకెత్త వలెన్ = రారాజు కొరకుఁతలుపు లారాా -  మిమ్మెత్తుకొనుఁడి || భూ ||

7.ఇలలో మహా మహిమంబు - గలిగిన యీ రాజెవడు = బలశౌర్య ముల యెహోవ - బహుశూరుడౌ యెహోవ || భూ||
- మల్లెల దావీదు

12 July 2021

Brathakaalani Unna Brathakalekunna | బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా


బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా - నిలవాలని ఉన్నా నిలవలేకున్నా 
చూడాలని ఉన్నా చూడలేకున్నా - చేరాలని ఉన్నా నిను చేరలేకున్నా 
బ్రతికించుమో యేసయ్యా - దరి చేర్చుమో నన్నయ్య..(2)
||బ్రత||

1. కాపరిలేని గొఱ్ఱనైతి – కాటికి నే చేరువైతి 
కావలిలేని తోటనైతి – కారడవిగా నే మారితి 
గూడు చెదరిన గువ్వనైతి – గుండె పగిలిన ఏకాకినైతి
గుండె దిగులుగా వుందయ్యా – గూడు చేర్చుమో యేసయ్యా (2) ||బ్రత||

1. నా ఆశలే అడియాశలై – అడుగంటెనే నా జీవితం
శోధనల సుడివడిలో – తొట్రిల్లెనే నా పయనం
 చుక్కానిలేని నావనైతి – గమ్యము తెలియక అల్లాడుచుంటి 
గురి చేర్చుమో యేసయ్యా – నా గుండె గుడిలో నీవుండయా (2)  ||బ్రత||
                  album: neevunte chaalunaya,
      
DOWNLOAD MP3 SONG HERE 👇

23 June 2021

Bheekarundau maa yehova | భీకరుండౌ మా యెహోవా

6
యెహెూవా స్తుతి
రా - యమన్,   తా - ఆది
                                  
భీకరుండౌ మా యెహోవా - ¹పీఠ మెదుటం గూడరే = యేకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ ||

1.మట్టితోనే మమ్ము నెల్ల - మానవులుగ సృజించెను = ఇట్టి శక్తుండౌ ప్రభు న్మే మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||

2.²ఏరితోడు లేక మము స - ర్వేశ్వరుఁడు సృష్టించెను = ధారుణిం దా నొక్కఁడే మా - దైవమని పూజింతుము ||భీకరుండౌ||

3.³పుట్టగిట్టంజేయఁదానై - నట్టి దేవుని శక్తిని = బట్టుగా లోకస్థులారా - ప్రస్తుతింపరె భక్తిని ||భీకరుండౌl|

4.మేటి సంగీతంబులుపై - మింట ⁴నారవ మొందను = జాటరే వేవేల నోళ్ళన్ - సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||

5.మిక్కిలి కష్టంబులతో - ⁵మితికిని బాల్పొందను = దిక్కులేని గొఱ్ఱె లట్లు - దిరుగఁ జేర్పన్ మందను || భీకరుండౌ||
_____________________________
¹సింహాసనము. ²ఎవ్వరి. ³చంపను. ⁴మ్రోత. ⁵చావు. 
DOWNLOAD MP3 SONG HERE 👇

02 June 2021

Bethlehemu Vurilo Pashulapaaka Needalo | బెత్లేహేము ఊరిలో పశులపాక నీడలో

బెత్లేహేము ఊరిలో - పశులపాక నీడలో -
ఉదయించె బాలుడు - రవికోటి తేజుడు (2)
ఆనంద మానంద మానందం (2)

1.సింహాసనం విడచి - పరమసౌఖ్యం మరచి
 నరులహృది భానుడై - ధరకు దిగె దీనుడై (2) ||బెత్లేహేము||

2.మహిమరూపం మార్చి - మంటి దేహం దాల్చి-
 పాపశ్రమ మోయను - శాపమును బాపను (2) ||బెత్లేహేము||

3.తండ్రి చిత్తం నెరవేర్చ - పరిశుద్ధరక్తం కార్చ 
లోక ఇక్కట్లను తీర్చ - మరణశక్తిని హతమార్చ (2) ||బెత్లేహేము||
DOWNLOAD MP3 SONG HERE 👇

01 June 2021

Bethlehemu Puramunandu | బెత్లేహేము పురమునందు

బెత్లేహేము పురమునందు చిత్రమాయెనంట
కర్తయేసు బాలుడుగా జననమాయెనంట
అంధకారమైన.. ఆకస వీధులలో.. ఆనందపు మహిమ చోద్యమేమిటోనంట (2) ||బెత్లేహేము||

1.పరమ పురమే వదలి పావనుండు యేసు - 
నరజాతిని ప్రేమించి ఇలకు దిగెనంట (2)
ఇమ్మానుయేలుగా - నెమ్మది నీయగా (2) - 
కన్నె మరియ గర్బాన పుట్టెనంట చూడరండి ||బెత్లేహేము||

2.గొల్లలేమో వార్త విని - గొర్రెలనే వదలి - 
మెల్లగా అందరికి చాటి చెప్పిరంట (2) 
దావీదు పురములో - లోకరక్షకుడుగా (2) 
యేసయ్య జనియించిన సంబరమే కనరండి ||బెత్లేహేము||

3.సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ-
ఇష్టులైన మనుష్యులకు సమాధానమంట (2) 
రెక్కలు చాచి - చక్కనైన దూతలు (2)
మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి ||బెత్లేహేము||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...