Showing posts with label కొండలతట్టు నా కనులెత్తుచున్నాను. Show all posts
Showing posts with label కొండలతట్టు నా కనులెత్తుచున్నాను. Show all posts

20 July 2022

Kondalathattu naa kannulethuchunnanu | కొండలతట్టు నా కనులెత్తుచున్నాను


కొండలతట్టు నా కనులెత్తుచున్నాను 
నాకు సహాయము ఎచటనుండి వచ్చును
యెహోవా వలననే నాకు సహాయము కలుగును 
తన నామములోనే అన్నీ కలుగును

1.భూమి ఆకాశమును సృజియించిన యెహోవా 
నీ పాదమును తొట్రిల్లనీయడు
కునుకడు నిదురపోడు 
ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును
యెహోవా వలననే నాకు సహాయము కలుగును 
తన నామములోనే అన్నీ కలుగును

2.పగలు ఎండ రాత్రి వెన్నెల దెబ్బ ఏదైన తగులకుండ
తోడుగా నీడగా నీ వెంట ఉండి నడిపించును
ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును
యెహోవా వలననే నాకు సహాయము కలుగును 
తన నామములోనే అన్నీ కలుగును

2. ఇది మొదలు నిరంతరం 
నీ రాకపోకలలో యెహోవా 
ఏ అపాయము రాకుండా నీ ప్రాణము కాపాడువాడు
ఇశ్రాయేలును కాపాడువాడు నిన్ను కాపాడును
యెహోవా వలననే నాకు సహాయము కలుగును 
తన నామములోనే అన్నీ కలుగును 
 – PhilipGariki
– SharonPhilip
– Sharon Sisters

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...