Showing posts with label Neetho na Jeevitham santhoshame. Show all posts
Showing posts with label Neetho na Jeevitham santhoshame. Show all posts

19 January 2022

Neetho na Jeevitham santhoshame | నీతో నా జీవితం సంతోషమే

నీతో నా జీవితం సంతోషమే - నీతో నా అనుబంధం మాధుర్యమే (2)
నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై
నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తి ప్రదాతవై
ఆరాధ్యుడా యేసయ్యా… నీతో నా అనుబంధం మాధుర్యమే

భీకర ధ్వనిగలా మార్గమునందు - నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2)
కలనైన మరువను నీవు నడిపిన మార్గం - క్షణమైన విడువను నీతో సహవాసం (2)||ఆరాధ్యుడా||

సంతోషమందైనా శ్రమలయందైనను - నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2)
నిత్యమైన మహిమలో నను నిలుపుటకు - శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) ||ఆరాధ్యుడా||

ఆకాశమందుండి ఆశీర్వదించితివి - అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2)
నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు - నూతన కృపలతో నను నింపుచున్నావు (2)||నీతో నా||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...