Showing posts with label మరువకురా మరువకురా దేవుని. Show all posts
Showing posts with label మరువకురా మరువకురా దేవుని. Show all posts

28 May 2021

Maruvakura Maruvakura Devuni | మరువకురా మరువకురా దేవుని


మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా ..
విడువకురా విడువకురా ఆ ప్రభు సన్నిధి విడువకురా..
అ.ప: ఆ ప్రేమే నిత్యమురా - ప్రభు సన్నిధి మోక్షమురా (2)
                                         ||మరువకురా||
1. పరమును చేరే మార్గము ఇరుకని - శ్రమలుంటాయని ఎరుగుమురా (2)
నశించు సువర్ణము అగ్నిపరీక్షలో - శుద్ధియగునని గమనించరా (2)
                                         ||మరువకురా||
2. లోక సంద్రములో ఎదురీదాలని - సుడులుంటాయని ఎరుగుమురా (2)
తీరము చేరిన మెప్పును మహిమ - ఘనత కలుగునని గమనించరా (2)
                                         ||మరువకురా||
3. విశ్వాసపరుగులో శోధనవలన - దుఃఖముందని ఎరుగుమురా (2)
కడముట్టించిన నిత్యానందము - బహుమానముందని గమనించరా(2)
                                         ||మరువకురా||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...