Showing posts with label Bro. Yesanna songs. Show all posts
Showing posts with label Bro. Yesanna songs. Show all posts

24 September 2022

Naa pranama naa samasthama|నా ప్రాణమా నా సమస్తమా

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది (2)
నా ప్రాణమా నా సమస్తమా - ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా (2)
నా ప్రాణమా నా సమస్తమా   

1.పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి (2)
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా||  

2.అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటి పాపగ నీవు నన్ను కాచితివి (2)
కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను
ఇలలో నిన్ను కొలచెదను ||నా ప్రాణమా||
 
3.నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మా ఫలములు దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్లను నేనెట్లు మరతు ప్రభు (2)
నీ కొరకు నే సాక్షిగ ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా|| 
DOWNLOAD MP3 SONG HERE 👇 

17 April 2022

Yesayya nee krupa nanu | యేసయ్యా నీ కృపా నను అమరత్వానికి

యేసయ్యా నీ కృపా - నను అమరత్వానికి
అర్హునిగా మార్చెను - యేసయ్యా నీ కృపా ||యేసయ్యా|
|

1.నీ హస్తపు నీడకు పరుగెత్తగా - నీ శాశ్వత కృపతో నింపితివా
నీ సన్నిధిలో దీనుడనై - కాచుకొనెద నీ కృప ఎన్నడు ||యేసయ్యా||

2.నీ నిత్య మహిమకు పిలిచితివా - నీ స్వాస్ధ్యముగా నన్ను మార్చితివా
ఆత్మాభిషేకముతో స్ధిరపరచిన - ఆరాధ్యుడా నిన్నే ఘనపరతును ||యేసయ్యా||

3.గువ్వవలె నే నెరిగి నిను చేరనా - నీ కౌగిటనే నొదిగి హర్షించనా
ఈ కోరిక నాలో తీరునా? - రాకడలోనే తీరును ||యేసయ్యా||
DOWNLOAD MP3 SONG HERE 👇

08 April 2022

Sthuthi pathruda sthothrarhuda | స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా - స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి||

1.నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే - శత్రువుల చేతినుండి విడిపించినావు - కాపాడినావు (2) ||స్తుతి||

2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి - దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై - నను నిల్పెను నీ సన్నిధిలో - నీ సంఘములో (2) ||స్తుతి||
                         – పాస్టర్ యేసుదాసు
DOWNLOAD MP3 SONG HERE 👇

Sthuthi simhasanaseenuda na aardhanaku | స్తుతి సింహాసనాసీనుడా

స్తుతి సింహాసనాసీనుడా - నాఆరాధనకు యోగ్యుడా (2)
నాలో నీవుండగ నీలో నేనుండగ - ఇక నేనేల భయపడుదును (2)
 
1.ఆకాశము నీ సింహాసనం - భూమి నీ పాదపీఠం (2)
ఆ సింహాసనం విడిచి సిలువకు దిగివచ్చి ప్రాణ త్యాగము చేసి (2)
నీ ప్రేమామృతం త్రాగించితివి - నిను స్తుతించుటకు బ్రతికించితివి (2) ||స్తుతి||
  
2.రాజాధిరాజా ప్రభువులకు ప్రభువా - ఎవరు నీకిలలో సాటి (2)
సదాకాలం నిలిచే నీ సింహాసనం - జయించిన వారికే సొంతం (2)
ఈ జీవన పోరాటములో - నాకు జయమిచ్చుట నీకే సాధ్యం (2) ||స్తుతి||
 
3.నా రాజ్యము లోకసంబంధమైనది - కానే కాదంటివే (2)
నా షాలేము రారాజ స్థాపించితివి - నీ బలముతొ ప్రేమరాజ్యం (2)
మార్పు లేని నీ కృపకు నా ప్రభువా - మార్చితివే నీ రాజ్య పౌరుని (2) ||స్తుతి||
DOWNLOAD MP3 SONG HERE 👇

13 March 2022

Mahadanandamaina needu sannidhi | మహాదానందమైన నీదు సన్నిధి

మహాదానందమైన నీదు సన్నిధి 
ఆపత్కాలమందు దాగు చోటది 
మానవులు అన్నియు ఆలకించినా 
వినయము గల వారికి ఘనతయిచ్చినా 
నీ సింహాసనమును స్థాపించుటకు.. 
నీవు కోరుకున్న సన్నిధానము (2) 
ఎంత మధురము నీ ప్రేమ మందిరం 
పరవశమే నాకు యేసయ్య (2) ||మహా||

1. విసిగిన హృదయం కలవరమొంది -
వినయము కలిగి నిన్ను చేరగా (2) 
పరమందుండి నీవు కరుణ చూపగ 
లేత చిగురు పైన మంచు కురుయురీతిగా (2) 
ప్రేమను చూపి బహువు చాపి 
నీలో నన్ను లీనము చేసిన (2)
ప్రేమ సాగర జీవితాంతము .. 
నీ సన్నిధిని కాచుకొందును (2)

2. లెక్కించ లేని  స్తుతులతో నీవు -
శాశ్వత కాలము స్తుతి నొందెదవు (2) 
మహిమతో నీవు సంచరించగా ఆ... 
ఏడు దీప స్తంభమూలకు వెలుగు కలుగగా (2) 
ఉన్నతమైన ప్రత్యక్షతను -
నే చూచుటకు కృపనిచ్చితివి (2) 
కృపా సాగర వధువు సంఘమై -
నీ కోసమే వేచియుందును (2) ||మహా||

3. సియ్యెను శిఖరమే నీ సింహాసనం -
శుద్ధులు నివసించు మహిమ నగరము (2) 
ఎవరు పాడలేని క్రొత్త కీర్తన ఆ .. 
మధురముగా నీ యెదుట నేను పాడేదా (2) 
సౌందర్యముగా  అలంకరించిన -
నగరములోనే నివసించెదను (2)
ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా -
నీతోనే రాజ్యమేలేదా (2)||మహా||

09 March 2022

Krupa Krupa Sajeevulatho | కృపా కృపా సజీవులతో

కృపా - కృపా సజీవులతో - నను నిలిపినది నీ కృపా (2)
నా శ్రమదినమున నాతో నిలిచి - నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప (2)
కృపా సాగర మహోనాతమైన - నీ కృపా చాలుయా || కృపా||

1. శాశ్వతమైన నీ ప్రేమతో - నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే - నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని (2)
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై - నీ కమనియ కాంతులను విరజిమ్మెనే (2)
నీ మహిమను ప్రకటింప - నను నిలిపేనే || కృపా||

2. గాలితుఫానుల అలజడితో - గూడుచెదరిన గువ్వవలే
గమ్యమును చూపే నిను వేడుకొనగా - నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి (2)
నీ వాత్యల్యమే నవ వసంతము - నా జీవిత దినములు ఆద్యంతము (2)
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము ||కృపా||

3. అత్యునతమైన కృపలతో - ఆత్మఫలము సంపదలతో
అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది - నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ (2)
నా హృదయార్పణ నిను మురిపించని - నీ రుణాతిశయములను కీర్తించని (2)
ఈ నీరీక్షణ నాలో నేరవని || కృపా|

13 August 2021

Aathma Parishudhathmuda Naalo | ఆత్మ పరిశుద్దాత్ముడా నాలో నివసించుము

ఆత్మ పరిశుద్దాత్ముడా - నాలో నివసించుము

ఆత్మ పరిశుద్దాత్ముడా - నాలో నివసించుము
జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము(2)
నా ప్రాణ ఆత్మ శరీరమును - యేసయ్య రాకకై సిద్దపరచుము (2)

1. నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి -
లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి (2)
నాలో నివసించుము - నీతో నడిపించుము(2)||ఆత్మ||

2. పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి -
అన్యభాషలు మాట్లాడుటకు - వాక్ శక్తి నొసగితివి (2)
నాలో నివసించుము - నీతో నడిపించుము(2)||ఆత్మ||

2. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే -
ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి (2)
నాలో నివసించుము - నీతో నడిపించుము (2)

DOWNLOAD MP3 SONG HERE 👇

29 April 2021

Anuragalu Kuripinche Nee Prema Thalachi | అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి


అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి
అరుదైన రాగాలనే స్వరపరచి
ఆనంద గానలే సప్త స్వరాలుగా నే పాడనా (2)
యేసయ్య నా హృదయ సీమను ఏలుమయ
నీ దివ్య సన్నిది చాలునయ (2) ||అనురాగాలు||

1. నీ జ్ఞాన ఆత్మయే వికసింపచేసెను నన్ను 
సర్వ సత్యములలో నే నడచుటకు
మరపురాని మనుజాశాలను విడిచి -
మనసార కొనియాడి జీవించెద ఇక నీ కోసమే (2) ||అనురాగాలు||

2. అపురూప దర్శనమే బలపరుచుచున్నది నన్ను
వెనుదిరిగి చూడక పోరాడుటకు (2)
ఆశ్చర్యకరమైన నీ కృప పొంది - 
కడవరకు నీ కాడినే మోయుట నా తుది నిర్ణయమే (2)  ||అనురాగాలు||

3. నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను
స్వర్ణ కాంతిమయమైన నగరము కొరకు (2)
అమూల్యమైన విశ్వాసము పొంది -
అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నాప్రాణమే (2)  ||అనురాగాలు||
DOWNLOAD MP3 SONG HERE 👇

21 March 2021

Silanaina Nannu Silpiga | శిలనైన నన్ను శిల్పివై మార్చావు

శిలనైన నన్ను శిల్పివై మార్చావు
నాలోని ఆశలు విస్తరింపచేశావు (2)
నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు (2)
నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నాకాపరి (2) ||శిల||

1.మొడుబారిన నాజీవితం – 
నీ ప్రేమతోనే చిగురింపచేసావు (2)
నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2)
వర్ణించలేను లెక్కించలేను (2) ||నీ ప్రేమే||

2.ఏవిలువలేని అభాగ్యుడను నేను – 
నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు (2)
నాయెడల నీకున్న తలంపులు విస్తారం (2)
నీ కొరకే నేను జీవింతునిలలో (2) ||నీ ప్రేమే||

3.వూహించలేను నీ ప్రేమ మధురం 
నా ప్రేమ మూర్తి నీకే నా వందనం (2)
నీ ప్రేమే నాకాధారం – నాజీవితం లక్ష్యం (2)
నీ ప్రేమ లేక – నేనుండలేను (2)||నీ ప్రేమే||
DOWNLOAD MP3 SONG HERE 👇

05 March 2021

Deenuda Ajeyuda Aadarana Kiranama | దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా


దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా 
పూజ్యుడా పరిపూర్ణుడా - ఆనంద నిలయమా
జీవదాతవు నీవని శృతిమించి పాడనా 
జీవధారవు నీవని కానుకనై పూజించనా 
అక్షయ దీపము నీవే - నా రక్షణ శృంగము నీవే 
స్వరార్చన చేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే

సమ్మతిలేని సుడిగుండాలే - ఆవరించగా 
గమనములేని పోరాటాలే - తరుముచుండగా 
నిరుపేదనైన నాయెడల - సందేహమేమి లేకుండా హేతువేలేని - ప్రేమ చూపించి - సిలువచాటునే దాచావు సంతోషము నీవే - అమృత సంగీతము నీవే 
స్తుతిమాలిక నీకే - వజ్రసంకల్పము నీవే ||దీనుడా||

సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన - సత్యవంతుడా 
విరిగి నలిగిన మనస్సుతో - హృదయార్చనే చేసేద కరుణనీడలో - కృపావాడలో - నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా 
విశ్వాసము నీవే - విజయశిఖరము నీవేగా ||దీనుడా||

ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే 
స్పటికము పోలిన సుందరమైనది - నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు అమరలోకాన - నీసన్నిధిలో - క్రొత్త కీర్తనే పాడెదను ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా 
ఉల్లాసము నీలో - ఊహలపల్లకి నీవేగా ||దీనుడా||
DOWNLOAD MP3 SONG HERE 👇

20 January 2021

Nee Prema Naalo Madhuramainadi | నీ ప్రేమ నాలో మధురమైనది



నీ ప్రేమ నాలో మధురమైనది - అది నా ఊహకందని క్షేమ శిఖరము ( 2 ) 
ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను - పరవశించి నాలో మహిమ పరతు నిన్నే 
సర్వ కృపనిధి నీవు - సర్వాధికారివి నీవు 
సత్యా స్వరూపివి నీవు - ఆరాధింతును నిన్నే   ||నీ ప్రేమ నాలో||
1. చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో -  కాదనలేదే నా మనవును నీవు (2) 
హృదయం నిండిన గానం- నను నడిపే ప్రేమ కావ్యం
నిరతము నాలో నీవే - చెరగని దివ్య రూపం (2) 
ఇది నీ బహు బంధాల అనుబంధమా
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే 
నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ నాలో||

2. నా ప్రతి పదములో జీవము నీవే- నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
ఎన్నడు విడువని ప్రేమ- నిను చేరే క్షణము రాదా
నీడగా నాతో నిలిచే -నీకృపాయే నాకు చాలును (2)
ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా 
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే 
నా యేసురాజా ఆరాధన నీకే (2)  ||నీ ప్రేమ నాలో||

3. నీ సింహాసనము నను చేర్చుటకు- సిలువను మోయుట నేర్పించితివి (2) 
కొండలు లోయలు దాటే-మహిమాత్మతో నింపినావు
దయగల ఆత్మతో నింపి- సమాభూమిపై నడిపినావు 
ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా 
తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే 
నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ నాలో||
Download this song here 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...