Showing posts with label విలియం డాసన్. Show all posts
Showing posts with label విలియం డాసన్. Show all posts

17 July 2022

Emi ledu sumi jagamulo | ఏమి లేదు సుమీ జగములో

175
క్రీస్తు ప్రేమ సాటిలేనిది
రా - మారువ, తా - అట
(చాయ: ఉన్న పాటున వచ్చు)

ఏమి లేదు సుమీ జగములో యేసుని - ప్రేమ సారము కన్నను = ¹పామరం బేటికి వృధా ²కను - దామరలు మూయగనె చీకటి - యౌ మనంబున నెల్ల సత్యము - గామి గని సర్వంబు విడువుఁ ||డేమి||

1.³దార పుత్రాది బంధు ⁴శ్రేణిపై మమ - కార భావము జెందుచుఁ - దద్విషయమై - కోరి దుఃఖము లొందుచు - భ్రమఁ గుందుచు = భూరి మాయా జాల బంధా - కర మిది యని తెలియ కీ సం - సార మంతయు నాది నాదని - యూరకే చెడిపోవ నేటికి ||నేమి||

2.ఈ దేహమునకుఁ బ్రాణమునకు సంబంధ - మించు కైనఁ గలదా - దేహాత్మలకు - భేదము గన వలదా - బుద్ధి గొన వలదా = యాది నే దేహము - నాత్మ ⁶స మాదరంబున నుండు నా తను - వీ ధరిత్రిని విడచి చను నపుడే ⁷దయామృతవార్ధి దిక్కగు ||నేమి||

3.⁸జాయా పుత్రోద్యాన ⁹గృహ విత్తా ట్టాలక - సకల వస్తు జాలము - ¹⁰ప్రతిష్ఠాను - భూతి విధేయులు - నఖిల సంపదలు = నీ యవని లోపల సమర్పణఁ - జేయఁగా బడుఁ గాని యించుక - ¹¹తోయమును గొని పోవశక్యము - లేద హా భ్రమ నొంద నేటికి ||నేమి||
   – విలియం డాసన్ 
________________________________ 
¹మోహము, ²పద్మమువంటి కన్నులు, ³భార్య, ⁴సమూహము, ⁵వలతాళ్ళవంటిది, ⁶మిగుల నాదరణయందు, ⁷దయారసమునకు సముద్రమువంటివాడు, ⁸భార్య, ⁹కోటవాకిటి మీది యిల్లు, ¹⁰అనుభవమునకు, ¹¹జలమును.

02 May 2022

Varanaamame sharanamu sharanamu | వరనామమే శరణము శరణము

141
క్రీస్తు నామమే మన శరణము
రా - శ్రీ రాగము,  తా - ఆట

వరనామమే - శరణము శరణము - క్రీస్తు - వరనామమే - శరణము శరణం ||వర||

1.పరమభక్త వ్రాత - దురిత సంఘాత దు = స్తర వన జాత భీ - కరకీలి యౌ క్రీస్తు ||వర||

2.సారహీన సం - సార పారావార = తారణ కారణ - తరణి యైన క్రీస్తు ||వర||

3.యూద దేశమునందు - నుండు బేత్లేహేమున = యూదు లను జనులలో - పాదుకొన్న క్రీస్తు ||వర||

4.ఇలలో పాపపు మాన - వుల నెల్ల మోక్ష సం = కలితులఁ జేయుఁగ - సిలువ నొందిన క్రీస్తు ||వర||

5.ఏచియున్నట్టి పి - శాచభారపు కాడి = మోసి దుఃఖించెడు - నీచులకును క్రీస్తు ||వర||

6.కొల్లగాను బాప - మెల్లఁ జేసి దాని = కుల్లములోఁదల్ల - డిల్లువారికిఁ క్రీస్తు ||వర||
                    – విలియం డాసన్
_______________________
¹శ్రేష్ఠమైన. ²రక్షకము. ³సమూహము యొక్క. ⁴సమూహమనెడు. ⁵దాటశక్యముగాని అడవుల సమూహమునకు. ⁶భయంకరమైన అగ్ని. ⁷సముద్రము. ⁸దాఁటుటకు. ⁹ఓడ. ¹⁰కూడుకొన్నవారిని. ¹¹బాధపెట్టి.

20 March 2022

Sirulella vrudha kaaga | సిరులెల్ల వృధ కాఁగఁ పరికించి

199    క్రీస్తు సిలువయే మన మహిమ
రా - ఆనందభైరవి (చాయ: నాకై చీలిన యుగ) తా- కురుజంపె

సిరులెల్ల వృధ కాఁగఁ - ¹పరికించి నాకున్న - గురువముఁ దిరస్కరింతున్ = ²వెర మహిమ రారాజు - మరణాద్భుతపు సిలువ - ³నరయుచున్నట్టి వేళన్ - ముఖ్యము లైన ||సిరు లెల్ల||

1.ఓ కర్త నా దేవుఁ - డౌ క్రీస్తు మృతియందుఁ -;గాక మరి ⁴మురియ నీయకు = ⁵ప్రాకట ⁶భ్రమకారి - వ్యర్ధ వస్తువులను - ప్రభుని రక్తంబు కొరకై - త్యజించెదను ||సిరు లెల్ల||

2.చారు మస్తక హస్త - పాదములవలన వి - చారంబు దయయుఁ గలసి = సారెఁ బ్రవహించుచున్నది చూడు మెపుడిట్టి - దారి గలదా ముళ్లు - తగు కిరీటం బౌన ||సిరు లెల్ల||

3.వాని నిజ రక్తంబు - వస్త్రంబువలె సిలువ - పై నతని తనువు గప్పె = ఐననేనీ లోక - మంతటికి మృతుఃడనై - తిని నా కీ లోకము - మృతంబయ్యె ||సిరు లెల్ల||
                      – విలియం డాసన్
__________________________
¹విచారించి. ²ఆశ్చర్యమైన. ³విచారించుచు.  ⁴అతిశయింప నియ్యకుము. ⁵ప్రసిద్ధముగా. ⁶మోసపుచ్చు.

20 August 2021

Ghanudaina Yehova Gadde | ఘనుఁడైన యెహోవా గద్దె

61
సృష్టికర్త స్తుతి
రా – కాంభోజి, తా – ఝంపై
                      
    ఘనుఁడైన యెహోవా - గద్దె ముందట మీరు - ¹వినతు లిప్పుడు చేయుడి - యోజనులార - వినయంబుగా నిర్మ - లానంద ²రసలహచేయుడ మన మనం బొప్పుచుండ - నో జనులార || ఘనుఁడైన ||

1.ఒక్కఁడే మన కర్తయుండు దేవుడని యున్ – జక్కగాను సృజియించు - సంహరించు ననియున్ - నిక్కముగఁ దెలిసికొండీ మన సహాయమే - మక్కర లేకుండ మనల = మిక్కుటపు పరిపాలనపు బలముచేఁ జేసె – మృత్తుచే మానవులఁగ – దిక్కు = గానక తిరుగు గొ – గ్రెల వలె మనము చెదరఁ – దిరుగఁదన దొడ్డిఁబెట్టె – నో జనులారా ||ఘనుఁడైన ||

2.మే మందరము వందనపు పాటతో మూగి – మించు నీ గుమ్మములలో – మామా స్వరము లెత్తుదుము నభము పొడవుగా – మధురలయ సహితముగను – భూమియున్ దనదు పదివేల జిహ్వల వలఁ – బొందైన నీ నగరి కా – ధామంబులను గాన సన్నుతి వితతిపూరి – తమ్ములుగఁ జేయు దేవా యో జనులార || ఘనుఁడైన ||

3.ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ – తగ విరహితాద్యంతమై – స్థిరమైన కాలంబువలెనే యున్న దయదయ - పొరలిపోవుచు నున్న వ = త్సరముల్ నిలిచిపోయి నప్పటికిని నీదు - సత్యంబు నిలిచియుండున్ – వర శిలా ఖండ పర్వతము తోడను సాటి – వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులార || ఘనుఁడైన ||
                                       - విలియం డాసన్
________________________________
¹స్తోత్రములు . ²ఆల

19 August 2021

Yesu Bhajanaye Manalanu | యేసు భజనయే మనలను

78                   క్రీస్తు సేవా సాఫల్యత
రా – జంఝూటి                              తా - ఏక
                            
యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు – జనులారా = దాసజనులు జేయు పలు – దోసములు మోయు || యేసు ||

1. మేల ¹కులశీల వ్రత – ²జా ³లాధిక మేల = చాల మన మీలాగునఁ – ⁴గాలావధిఁ గూల || యేసు ||

2. ⁵అక్షయ కరుణేక్ష ⁶భువన – రక్షణ ⁷ఖల శిక్షా = ధ్యక్ష ⁸బుధ పక్ష కృత – మోక్ష యను ⁹దీక్షన్ || యేసు ||

3. మాటికి ¹¹మిన్నేటికిఁ బో – నేటికిఁ గాల్ నొవ్వ = సూటిగ నరకోటి ¹²దురిత – వాటములను ¹³మీటు || యేసు ||

4. ¹⁴శ్రోత్రమ యపవిత్ర నర చ – రిత్రలు వినఁబోక = మైత్రిని బరమాత్ముని కథ – మాత్రము విను మనుచున్ || యేసు ||

5. మన జీవనమునకు మారుగఁ – తన ప్రాణము నిచ్చెన్ = తన రక్తముచేఁ బావన మొనరించెను మనలన్ || యేసు ||
                                          - విలియం డాసన్
__________________________________
¹కులాచారము. ²సమూహము. ³మొదలైనవి. ⁴కాలాంతముందు.⁵శాశ్వతమైన కరుణ గల చూపుగలవాఁడా. ⁶లోకమును రక్షించువాఁడా ⁷పాపులను శిక్షింపనధికారి . ⁸జ్ఞానుల పక్షమైనవాఁడా. ⁹మోక్షస్థానమునుచేసినవాఁడా. ¹⁰నిలకడచేత. ¹¹గంగానది? ¹²పాపములను అడ్డులను , లేకపాపము యొక్క యభివృద్ధులను . ¹³పోఁగొట్టు. ¹⁴చెవి 

17 August 2021

Vededa Naadagu Vinathini | వేడెద నాదగు వినతిని గైకొన

45 
ప్రాతఃకాల ప్రస్తుతి
రా – నాదనామక్రియ, తా – ఆది

వేఁడెద నాదగు వినతిని గైకొన వే జగదీశ ప్రభో = నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా - తోడ నుండవె ప్రభో || వేఁడెద ||

1.ప్రాతస్తవము ¹భవత్సన్నిధి స ర్వంబున నగు నాదౌ = ²చేతస్సున ధర్మాత్మను ³సంస్థితి - జేయవె సత్కృపను || వేఁడెద ||

2.నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా - నీవు కరుణజేయు ⁴పాచరణము నందున జిత్తము - బాపుము నాకెపుడు || వేఁడెద ||

3.పాపముఁ గని భీతుఁడనై ⁵శంకా పరత సతము నుండన్ నుంచుము నీదగు సత్కరు - ణా దృష్టిని ప్రేమన్ || వేఁడెద ||

4.నాదగు పాప భరం బంతయు నీ - మీఁదనె యిడుచుందున్ = నీదు మహా కృప నుండి యొసంగుము - నిర్మల గతి నాకున్ || వేఁడద ||

5.అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్ = భవదంఘ్రలపై నాదగు భక్తిని - బ్రబలింపవే యేసు || వేఁడద ||
                                    – విలియం డాసన్.
____________________________
¹సన్నిధి. ²మనస్సు. ³ఉంచథె. ⁴చేయుట. ⁵శంకయందాసక్తి

Sakala Jagajjala Kartha Bhaktha | సకల జగజ్జాల కర్తా భక్త

44   
ఉదయారాధన
రా – బిలహరి, తా – అట
               
సకల జగజ్జాల కర్తా - భక్త - సంఘ హృదయ తాప హర్తా యకలంక గుణమణి - నికర పేటీ కృత - ప్రకట లోకచయ - పరమ దయాలయ ||సకల||

1.నాదు నెమ్మది తొలఁగించుచుఁ - బ్రతి - వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు - బాధలందైనను - సాధులఁబ్రోవ న - నాది యైనట్టి నీ - వాధారమై యుండ ||సకల||

2.దినకృత్యములఁ గష్టమంత - చీఁక - టిని నే నీ కడ భక్తి - మనవిజేయ - వినుచు నా కష్టము - వెస నష్టముగఁ జేయ - ఘనముగ నాయందుఁ గరుణఁ జేసితివి ||సకల||

3.తమ కాపు నన్ను కాపాడఁగ - నేను - తమ నిద్రఁ బొందితిఁ - దనివిఁ దీరఁ = కొమ రొప్ప మేల్కొన్నఁ గూలిన మృత్యు భ - యముబొంద నా డెంద - మందు నెల్లప్పుడు ||సకల ||

4.రాతిరి సుఖనిద్ర జెందఁ - జేసి - రక్షింప నను నీకె - చెల్లు - ప్రాతస్తుతుల్ జేయం - బగలు - జూచు తెల్వి -  ఖ్యాతముగా నాకుఁ - గలుగఁజేసితివి ||సకల||
                                   – విలియం డాసన్

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...