Showing posts with label నీ మేలులు వివరింపతరమా. Show all posts
Showing posts with label నీ మేలులు వివరింపతరమా. Show all posts

25 October 2022

Nee melulu vivarinpatharama | నీ మేలులు వివరింపతరమా

"నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" - కీర్తన 103:2

నీ మేలులు వివరింపతరమా
నీ మేలులు వివరింపతరమా ప్రభువా
నీ కృపలను నే మరువగలనా
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో

1.శోధనలే నన్ను వెన్నంటిఉన్నా 
బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా
నను ధైర్యపరచి నడిపించినావే 
నా హృదయవేధన తొలగించినావే ||ఆద||

2.ఊహించలేని కార్యాలు ఎన్నో 
లెక్కించలేని పర్యాయములలో 
నా జీవితంలో జరిగించినావే 
నీ కృపతో నిత్యము దీవించినావే ||ఆద||

3.మరచిపోలేని నీ మేలులెన్నో 
దయచేసినావు నా జీవితములో 
నీ ప్రేమకు సాటి లేదేది ఇలలో 
నీ కరుణకు బదులు ఏముంది ధరలో ||ఆద||
          రచన & స్వరకల్పన సురేష్ నిటల

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...