Showing posts with label నా బ్రతుకు దినములు లెక్కింప. Show all posts
Showing posts with label నా బ్రతుకు దినములు లెక్కింప. Show all posts

16 August 2021

Naa brathuku dinamulu నా బ్రతుకు దినములు

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| 

1.ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగా చిగురువేయనీ ||నా బ్రతుకు|| 

2.నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
యేసు నీచేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేషజీవితం ||నా బ్రతుకు||
DOWNLOAD MP3 SONG HERE 👇
 

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...