Showing posts with label Y. Show all posts
Showing posts with label Y. Show all posts

04 June 2026

యేసునే సేవింపరండి మోసపోకండి Yesune sevimparandi mosapokandi

294 
క్రీస్తుని గొప్పతనము 
రా - హిందుస్థాని తోడి, తా - ఆది 

యేసునే సేవింపరండి - మోసపోకండి - ప్రభు = దోసములను బాపు నండి - దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే||

1.దేవుఁ డీతఁడే సుమండి - దిగులుపడకండి - మన = చావు నొంది లేచెనండి - జీవ మితఁడండి - ప్రభు ||యేసునే||

2.పాపులను ప్రేమించె నండి - ప్రాణ మిడె నండి - ప్రభు = దాపుఁజేరి వేఁ డ రండి - దయామయుఁడండి - ప్రభు ||యేసునే||

3.నరకబాధ నొందె నండి - నరులకొర కండి - ప్రభు = దురితములను బాపు నండి - దుఃఖపడకండి - ప్రభు ||యేసునే||

- ఎన్.డి. ఏబేల్ 

యేసు నాథ కథా సుధా రస మిదిగో Yesu naadha kadha sudha rasa midigo

299
యేసు నాథ కథా మాధుర్యము
రా - బిలహరి, తా - త్రిపుట 

యేసు నాథ కథా ¹సుధా రస - మిదిగో పానముఁ జేయరే = దోసకారి జనంబులారా - దురిత భవముల బాయరే ||యేసు||

1.ఇహపరంబు లెవనిచే సృజి - యింపఁబడియెనొ చూడరే = అసహహ యా విభుఁ డవతరించెను - అతని గుణములఁ బాడరే ||యేసు||

2.²దురిత భరితుల దుష్ట ²చరితుల - నరయ వచ్చెను జూడరే=స్థిరముగామది నమ్మి యా ప్రభు - కరుణ మదిఁ గొనియాడరే ||యేసు||

3.పనికిమాలిన ⁴వేలుపుల దెస - పరుగు లెత్తుట మానరే = ⁵తనువు మీ కొఱ కిచ్చు క్రీస్తుని - దయకుఁ బాత్రతఁ బూనరే ||యేసు||

4.మరణ బలి రక్తమున మన యం -దఱిని బ్రోవను వచ్చెను = కరుణతోఁ బాపులఁ బిలుచు గురు - దరికిఁబోవుద మిచ్ఛను ||యేసు||

5.పరమతత్వ విధాన బోధలు - బాగుగఁ బ్రకటించెను = ⁶చిరసుఖాస్పద పదముఁ గోరిన - జీవులకు వినిపించెను ||యేసు||

6.మరణ మొందిన కొందఱికిఁ దా - మరలఁ బ్రాణము లిచ్చెను = వర మహాద్భుత కార్యముల ని - ద్ధర ననేక మొనర్చెను ||యేసు||

7.కుటిల బుద్ధుల ద్రోచి సజ్జన - గోష్టి నుండుట గోరరే = దిటముగను నెమ్మదిని మీరొం - దుటకుఁ క్రీస్తునిఁ జేరరే ||యేసు||

- పురుషోత్తము చౌదరి
______________________________________
¹అమృతము, ²పాపములతో నిండియున్నవారిని, ³దుర్మార్గమైన ప్రవర్తనగలవారిని, ⁴దేవతల, ⁵దేహము, ⁶ఎల్లప్పటికి ముఖకారణమైన. 

01 June 2026

యేసూ, నిన్ జూతు నిందుఁ దేటగా Yesu nin jutu nindu detagaa

284
Here, O my Lord, I see Thee face to face 

1.యేసూ, నిన్ జూతు నిందుఁ దేటగా 
అగోచరార్థముల్ నే ముట్టదున్ 
కృపన్ నేఁ బట్టకొందు గట్టిగా 
నీ మీఁద వేయుదున్ నా భారము

2.నే దైవాహార మిందె తిందును 
ఆత్మీయ ద్రాక్షపాత్ర త్రాగుదున్ 
భూభారముల్ నేఁ బారవేయు దున్ 
క్షమా సౌఖ్యంబు గల్గుఁ క్రొత్తగా.

3.సంగీత భోజనాల కాలము 
ప్రభుండు నాకై బల్ల వేసెను 
విందారగించుచున్ నీ తోడి నా 
మాధుర్య స్వల్ప మైత్ర్రిన్ బెంచుదున్.

4.సాయం బీవే, వేరే నా కెందుకు 
వేరే చేమీఁద నానుకొనను 
ప్రభూ, నిజంబుగా నీదే చాలును 
నీ శక్తిలోనె బలం బుండున్

5.పాపంబు నాది, నీతి నీదెగా 
నేరంబు నాది శుద్ధి నీదెగా 
నీ రక్త నీతియే నా వస్త్రముల్ 
నా కాశ్రయంబు శాంతస్థితులు
- హోరేషియన్ బోనర్

31 May 2026

యెహోవ పురి పునాది యిల Yehova puri punaadi yeela

258
సంఘము
రా - మాధ్యమావతి,  తా - ఆది 

యెహోవ పురి పునాది యిల మహా స్థిరంబైనది

1.మహా సీయోను గుమ్మములు - అవి - యెహోవాకు నతిప్రియములు = ఇఁక - నిహ జను లెల్లరు గొనియాడి - నిను - బహు కీర్తంతురు పట్టణమా ||యెహోవా||

2.భూమిలో సర్వజనాంగముల్ - తమ - నామము లచ్చట వ్రాయన్ = ఆ - స్వామి యెహోవా వారిన్ - అట - జన్మించిరి యని వ్రాయన్ ||యెహోవా||

3.పాటలు పాడి జనాంగమా - తమ - యూటలు నీ కడ గలవే యని = స్తుతియింతురు నిను స్తుతిపాత్రా - యిఁక - భజియింతురు నిను నిజభక్తిన్ ||యెహోవా||

4.ఇది క్రైస్తవ సంఘంబే - కడు - శుభముల నిచ్చు స్థలంబే = ధర-బుధు లేసుని నిటఁ గనుచు - నతి - ముదమును బొందుట నిజమే ||యెహోవా||

5.జనః కుమా రాత్మకును - నిఁక - ఘనమహిమలు గల్గునుగాక = ఆ - దిని నుండిన రీతిని నిపుడు - నిఁక - ననవరతముండును ఆమేన్ ||యెహోవా||
- సరెళ్ల సమూయేలు సుబ్బయ్య 

20 May 2026

యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తీమంతుడు Yese goppa devudu mana yese

 

యేసే గొప్ప దేవుడు - మన యేసే శక్తీమంతుడు - యేసే ప్రేమ పూర్ణుడు - యుగ యుగములు స్తుతి పాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి - ఘనత బలము కలుగును ఆమెన్ (2) ||యేసే||

1.మహా శ్రమలలో - వ్యాధి బాధలలో - సహనము చూపి స్థిరముగా నిలిచిన - యెబు వలెనే జీవించెదను (2)
అద్వితీయుడు.. ఆదిసంభూతుడు - దీర్ఘాశాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

2.ప్రార్ధన శక్తి తో - ఆత్మ బలముతో - లోకమునకు ప్రభువును చాటిన - దానియేలు వలె జీవించెదను (2)
మహోన్నతుడు.. మన రక్షకుడు - ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

3.జీవితమంతా.. ప్రభుతో నడిచి - ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన - హనోకు వలె నేజీవించెదను (2)
అద్భుతకరుడు.. ఆశ్చర్యకరుడు - నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||
-Pas. Philliph Gariki 

21 March 2026

E reethi Sthuthiyinthuno ఏ రీతి స్తుతియింతునో


ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా ||ఏ రీతి||

వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివిరోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2) ||నా ప్రాణ||

మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడిచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ||

ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు సాగెదను (2) ||నా ప్రాణ||

23 August 2025

Yesayya na pranama యేసయ్యా నా ప్రాణమా



యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే 
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను 
నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన 
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా

చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా 
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే

జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని ఉత్సాహగానము నే పాడన
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా

మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా 

స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా

23 November 2024

Yesu chavonde siluvapai యేసు చావొందె సిలువపై

693

ప: యేసు చావొందె సిలువపై- నీ కొరకే, నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను- నీ కొరకే, నా కొరకే

1. నది వలె యేసు రక్తము-సిలువలో నుండి ప్రవహించె పాపము కడిగె మలినము తుడిచె-ఆ ప్రశస్త రక్తమే

2. పాపము కడిగె మలినము తుడిచె- ఆ ప్రశస్త రక్తమే నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో- క్రీస్తు యేసు రక్తములో ॥యేసు॥

3. పాప శిక్ష పొంద తగి యుంటిమి- మనశిక్ష ప్రభువే సహించెను నలుగగొట్ట బడె పొడవ బడె నీకై-అంగీకరించు యేసుని

11 August 2024

Yesosange goppa yagnanu యే సొసంగె గొప్ప యాజ్ఞను

273
పిన్న పెద్దల బాప్తిస్మము
(చాయ: వారు భాగ్యవంతులు)
రా - నీలాంబరి, తా - త్రిపుట 

యే సొసంగె గొప్ప యాజ్ఞను - తన శిష్యులకును - యేసొసంగె గొప్ప యాజ్ఞను = దాసులునుగఁ జేయ బోయి - ధరణిమీఁది రాష్ట్రములకు - ఆ సను బాప్తిస్మ మిచ్చి - నా సుబోధ నేర్పుఁడనుచు ||యేసొసంగె||

1.జనక కుమారాత్మల పేర - బాప్తిస్మ మియ్యఁ - చనుడు మీరు సకల దిశలను = తనయు లైనఁ తల్లులైనఁ - తండ్రులైనఁ బొందవచ్చుఁ - దగిన రీతి దాని నిపుడు - తండ్రియైన దైవ కృపను ||యేసొసంగె||

2.బాలు రెల్ల బొందవచ్చును - బాప్తిస్మ మిపుడు - జాలిఁ జూపు క్రీస్తు సెలవున = బాలు రందుఁ బ్రేమ నుంచి - ప్రభువు పిలుచు వారి నెల్లఁ జాల మేలు సేయ గోరి - సకల కాలముల యందు ||యేసొసంగె||

3.పొందవలయు బాప్తిస్మము - శుద్ధాత్మ చేత - విందుఁ గలుగు మనుజు లందరు = మంద బుద్ధి విడిచి పెట్టి - మహిమ గల్గు దేవు గొల్వ - నందము గను లేచి రండి - హర్ష పూర్ణు లగుచు మీరు ||యేసొసంగె||
- పులిపాక జగన్నాథము 

09 June 2023

Yesu neetho sahavasam యేసు నీతో సహవాసం

యేసు నీతో సహవాసం - నాలోన పెంచింది ఆత్మ బలం (2)
నీలో ఎదిగేందుకు - నీలా మారేందుకు, 
నిన్ను చూచేందుకు - నిన్ను చాటేందుకు (2) ||యేసు||

1.నిశ్చలమైన మనసిచ్చేది - శోధన జయించు బలమిచ్చేదీ (2)
ఉన్నత స్థలముల పైన నిలిపి - నాకు విలువను సమకూర్చేదీ (2)
జయ జీవితమును రుచి చూపించి - విజయము(మోక్షము) పైన కాంక్ష పెంచేది ||యేసు||

2.పరులను ప్రేమించు గుణమిచ్చేదీ - ప్రకృతిపై అధికారమిచ్చేదీ (2)
కుటుంబ కలతలను అంతము చేసి - గృహమును స్వర్గముగా చేసేదీ (2)
సుస్థిరమైన శాంతిని కూర్చి - సిలువ బాటలో నడిపించేది ||యేసు||

DOWNLOAD MP3 SONG HERE 👇

12 May 2023

Yesayya na pranamu యేసయ్యా నా ప్రాణము

యేసయ్యా నా ప్రాణము నా ప్రాణము  నీదేనయ్యా నా యేసయ్యా (2)
నాకున్న సర్వము నీవేనయ్యా నాదంటు ఏదీ లేనే లేదయ్యా (2) ||యేసయ్యా||

నా తల్లి గర్భమున నేనున్నప్పుడే - నీ హస్తముతో నన్ను తాకితివే (2)
రూపును దిద్ది ప్రాణము పోసి (2) 
నను ఇలనిలిపిన నా యేసయ్యా ||యేసయ్యా||

బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు - గుప్తమై యున్నవి నీయందే (2)
జ్ఞానమునిచ్చి ఐశ్వర్యముతో (2) 
నను ఇలమలచిన నా యేసయ్యా ||యేసయ్యా||

లోకములోనుండి నన్ను వేరుచేసి - నీదు ప్రేమతో ప్రత్యేకపరచి (2)
అభిషేకించి ఆశీర్వదించి (2) 
నన్నిల నడిపిన నా యేసయ్యా ||యేసయ్యా||

Yesu vaipu chuchuchu యేసు వైపు చూచుచు

యేసు వైపు చూచుచు - పందెములో ఓపికతో పరుగెత్తుదము (2)
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక (2) సాగి పోవాలీ (2) ||యేసు||

వాక్యమనే ఖడ్గమును పట్టుకొని - వీడని విశ్వాసమును కట్టుకొని (2)
అపవాది తంత్రములను అణగత్రొక్కుదాం - అంధకార క్రియలను అణిచివేయుదాం (2)
రక్షణనే శిరస్త్రాణము ధరియించుదము - నిరీక్షణ కలిగి మనము సాగిపోదము (2)
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక (2) సాగి పోవాలీ (2) ||యేసు||

సత్యమనే దట్టిని కట్టుకొని, నీతిఅనే మైమరువును తొడుగుకొని (2)
సమాధాన శుభవార్తను ప్రకటించుదాం ,సిద్ధమనసు అను జోడు తొడుగుకుందము (2)
అపవాది అగ్ని పొదిని ఆర్పి వేయుదాం, ఆత్మలో ప్రతి సమయము ప్రార్థింతుము (2)
వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక (2) సాగి పోవాలీ (2) ||యేసు||

Yududavaina anudavaina యూదుడవైనా అన్యుడవైనా

యూదుడవైనా అన్యుడవైనా (2) 
తీర్పు రోజున నీవుందువు
పరమ తీర్పరి లెక్కచూసి - నీ క్రియలకు జీతమిచ్చును (2)

విలువపెట్టి కొనబడిన నీ దేహముతో వ్యభిచార సాంగత్యము చేసెదవా (2)
దేవుని నివాసమైన నీ హృదయములో మోసకరమైనవి యోచింతువా (2)
అయ్యో! ఎలా మనము తప్పించుకొందుము, ఆ దినము ఏల సహింతుము (2)
||యూదుడ||

ఇతరులకు బోధించుచున్న నీవు, నీకు నీవే బోధించుకొనవా (2)
ప్రేమ ప్రేమని చెప్పి ప్రేమించకపోతే యేసయ్య నిన్ను ప్రశ్నించడా (2)
అయ్యో! ఎలా మనము తప్పించుకొందుము, ఆ దినము ఏల సహింతుము (2)
||యూదుడ||

ఆకాశ భూమికి మధ్య వ్రేలాడి, ఉభయులకూ యేసు సంధి చేసెను (2)
దేవుని కోపమును చల్లార్చెను, మనకు శాంతికర్తయై యుండెను
అదిగో ఆ యేసును చూడు నేడే క్షమ వేడు, ఆ నిత్య రాజ్యములో నీవుందువు (2)
||యూదుడ||

10 May 2023

Yesu nee adbutha prema యేసు నీ అద్భుత ప్రేమ

1.యేసు నీ అద్భుత ప్రేమ నేనేల మరిచెద దేవా
నీ ప్రేమ మాధుర్యమును రుచి చూచి యెరిగినవాడను
ఎండిన నా బ్రతుకులో జీవముగా నీవు చేరితివి
నీ ప్రేమ జలములతో నను తడిపి బ్రతికించితివి

నీ వాత్సల్యమును - నీ కారుణ్యమును
స్మరియించుచు దేవా
నే పాడేదనూ స్తుతి గీతము
నే పాడేదనూ స్తుతి గీతము
ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు
కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతమి

2.పాపమును ఎరుగని దేవా నాకై పాపముగా మారి
నా వ్యసనములను భరియించి సిలువలో ప్రాణము విడిచితివి
అమూల్యమైన నీ రక్తముచే నను నీవు విమోచించితివి
నీ ప్రేమ లోతులలో శాశ్వతముగా నను బందించితివి

నీ కల్వరి యాగం - కనపరచిన ప్రేమ
తలపోయుచు దేవా
నే పాడేదనూ స్తుతి గీతము
నే పాడేదనూ స్తుతి గీతము
ఈ గీతము స్తుతిగీతము అంకితము నీకే ప్రభు
కృతజ్ఞతతో నిను పొగిడెదను నే పాడుచు స్తుతిగీతమి

Yesayya polamuraa epuga | యేసయ్య పొలమురా ఏపుగా వుందిరా

యేసయ్య పొలమురా - ఏపుగా వుందిరా
ఎగసాయం సూడరా - ఎంతో బాగుందిరా (2)

నారొకడు నాటేనురా ... నీరొకడు పోసేనురా (2)
పైరిచ్చినాడురా... పైనున్న వాడురా (2) ||యేసయ్య||

ఎలుకలున్నాయిరా... ఏర్లు కొరికేనురా (2)
నక్కలున్నాయిరా.. నక్కి చూస్తాయిరా (2) ||యేసయ్య||

వరదలలొచ్చెనురా ... బురద తెచ్చెనురా (2)
బురదలో నా పైరు ... మురిగి చచ్చేనురా (2) ||యేసయ్య||

పనివాళ్ళు లేరురా ... పంటలు పాడౌనురా (2)
పనివార్ని పంపమని .... ప్రభుయేసుని అడగరా (2)||యేసయ్య||

Yesayya rakadaku siddapadu | యేసయ్య రాకడకు సిద్ధపడు సోదరుడా

యేసయ్య రాకడకు - సిద్ధపడు సోదరుడా
గడుపులు గడిచిపోయె - రాకడ సమీపమాయె

సింహంబువలె ప్రభువు గర్జించి రానుండె - మేఘారుడుడై ఆర్బటించు
మేఘమున - కొండసందులో దూరి గుండె బాదుకొందురయ్యా 

ఆర్చటించగ ప్రభువు ఆకాశమదరెను - భూమి దద్దరిత్లే - భూకంపములు
కలిగెను - లోకములో జనులంతా - గుండె చెదరి కూలెడరు

మేఘ ములోదేవునిబూర - హోరముగ మృోగగనె - భూరాజు లెల్లరను
బోరియలో దూరెదరు - భూతములు మిక్కటపమైప వెండ్రముతో లయమగును 

ప్రభుని నమ్మినచో పై కెత్తబడియెదరు - పరలోక రాజ్యములో ప్రవేశింతువు
ప్రియుడా - ప్రభువుని నమ్మనిచో విడువబడెదవా శ్రమలు

ఎంతకాలంబు నీవు పంతముతో నుండెదవు - పంతమిడచి ప్రభుని
సన్నిధి చేరని యెడల - అంత్యదినమునందు చింతపడి యేడ్చెదవు

Yavanudaa santhoashapadumaa |యౌవనుడా సంతోషపడుమా

యౌవనుడా సంతోషపడుమా - యౌవన కాలమున

అనుపల్లవి: అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను - జ్ఞప్తినుంచుకో

1.లేత వయస్సు నడి ప్రాయమును - గతించిపోవునవి
గనుక నీదు హృదయములో - వ్యాకులమును
తొలగించుకొనుము - యువకుడా వినుము

2.దుర్దినములు రాబోకముందే - వీటి యందిపుడు
సంతోషము లేదనియెడు సంవత్సరములు
రాబోకముందే - చెడుగును విడుమా

3.పశ్చాత్తాపమున పాపములను - ఒప్పుకొనుచు నేడే
రక్షణార్థము - రక్షకుడేసును
రయమున క్షమాపణ వేడిన - రక్షణ నీదే

4.మన్నయినది వెనుకటివలెనే - మంటిలో కలియున్
ఆత్మ దాని దయ చేసిన
దేవుని సన్నిధికి మరల - వెళ్ళును యౌవనుడా

06 May 2023

Yesu rakhaka shathakoti | యేసు రక్షకా శతకోటి స్తోత్రం


యేసు రక్షకా శతకోటి స్తోత్రం
జీవన దాత కోటి కోటి స్తోత్రం
యేసు భజియించి పూజించి ఆరాధించెదను (2)
నా సమస్తము అర్పించి ఆరాధించెదను (2)
యేసు ఆరాధించెదను - ఆరాధించెదను

శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు
నన్ను రక్షింప నర రూపమెత్తాడు (2)
నా సిల్వ మోసి నన్ను స్వర్గ లోకమెక్కించాడు (2) 
చల్లని దేవుడు నా చక్కని యేసుడు (2) ||యేసు రక్షకా ||

పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు
ఎన్నటికిని ఎడబాయనన్నాడు (2) 
తన ప్రేమ చూప నాకు నేల దిగినాడు (2)
నా సేద దీర్చి నన్ను జీవింపజేసాడు (2) ||యేసు
రక్షకా ||

యేసు ఆరాధించెదను - ఆరాధించెదను
నా సమస్తము అర్పించి - ఆరాధించెదను
నా సర్వము అర్పించి - ఆరాధించెదను
శరణం శరణం యేసు స్వామి శరణం (3) ||యేసు ఆరాధించెదను | |

12 February 2023

Yesu neeve kaavalayya యేసూ నీవే కావాలయ్యా

యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా
ఘనుడా నీదివ్య సన్నిధి - నను ఆదుకొనే నా పెన్నిధి (2)

అ.ప|| నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా..
  
నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు
 
నీవే నాతో వస్తే - కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - క్షయత నన్నంటదు
 
నీవే నాతో వస్తే - ఓటమి నా కుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - చీకటి నన్నంటదు 
 DOWNLOAD MP3 SONG HERE 👇 

03 December 2022

Emmanuyelu manaku thodu | యూదయా దేశమునందు


యూదయా దేశమునందు - బెత్లహేమను గ్రామమందు -
యూదుల రాజైన యేసు - ఉదయించెను నేటి దినము (2)

ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు - మనకు తోడు ఆ దేవుడు (2)

జగన్నుత కీర్తనానంద చరిత (4)

సర్వోన్నతమైన స్థలములలో - దేవునికి మహిమయూ ఆయన కిష్టులైనా వారికీ ధరయందు సమాధానము (2)

ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు - మనకు తోడు ఆ దేవుడు (2)

చీకటిలోనున్న మనుజులకు - అరుణోదయ దర్శనం
చెదరిన గొర్రెలను వెదకునట్టి - మందకు ఆ మంచి కాపరి (2)

ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు - మనకు తోడు ఆ దేవుడు (2) 
యూదయా దేశమునందు - బెత్లహేమను గ్రామమందు -
యూదుల రాజైన యేసు - ఉదయించెను నేటి దినము (2)

ఇమ్మానుయేలు ఇమ్మానుయేలు - మనకు తోడు ఆ దేవుడు (2)

జగన్నుత కీర్తనానంద చరిత (4)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...