నే నానంద భరితుడనైతిని
బలురక్కసి వృక్షపుగాయములు
ప్రేమాహస్తములతో తాకు ప్రభు
పల్లవి: నా హృదయపు వాకిలి తీయుమని
పలు దినములు మంచులో నిలిచితివి
నీ శిరము వానకు తడిసినను
నను రక్షించుటకు వేచితివి
1. ఓ ప్రియుడా నా అతిసుందరుడా
దవళ వర్ణుడా నాకతి ప్రియుడా
వ్యసనా క్రాంతుడుగా మార్చబడి
నీ సొగసును నాకు నొసగితివి ||నా హృదయపు||
2. నీ పరిమళ పుష్ప సుగంధములు
నా రోత హృదయమును నింపినవి
ద్రాక్షారస ధారలకన్న మరి
నీ ప్రేమే ఎంతో అతిమధురం ||నా హృదయపు||
3. ఉన్నత శిఖరములు దాటుచును
ఇదిగో అతడొచ్చు చున్నాడు
నా హృదయపు తలుపులు తెరచుకొని
నా ప్రియుని కొరకు కనిపెట్టెదను ||నా హృదయపు||
4. నీ విందు శాలకు నడిపించి
రాజులు యాజకులతో జేర్చితివి
జీవాహారము నా కందించి
పరమా గీతములను నేర్పితివి ||నా హృదయపు||
- K. హెన్రీ గారు