Showing posts with label నడిపించు చున్నాడు నజరేయుడు. Show all posts
Showing posts with label నడిపించు చున్నాడు నజరేయుడు. Show all posts

25 August 2023

Nadipinchu chunnadu najaraeyudu నడిపించు చున్నాడు నజరేయుడు


నడిపించు చున్నాడు - నజరేయుడు
నడక నేర్పుచున్నాడు - నను విడువని దేవుడు
గాఢాంధకారములైనా - కన్నీటి లోయలైనా
కష్టాల తీరములైన - కఠినమైన మార్గములైనా ||నడి||

1.నా కాళ్ళు తడబడగా - నడువ లేక నిలబడగా (2)
అడుగులో అడుగేసి - చేతిలో చెయ్యేసి (2)
ఊసుచెప్పినాడు - బాసచేసినాడు (2)
ఆదరించే దేవుడు నా యేసయ్యా 
ఆశీర్వదించే దేవుడు నా యేసయ్య ||నడి||

2.ముదిమిలో బలముడిగి - నిలువలేక తూలిపోగా (2)
చంకలో ఎత్తుకొని - ముద్దులతో ముంచెత్తి (2)
ప్రేమ చూపినాడు - ప్రాణమిచ్చినాడు (2)
ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా 
ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా ||నడి||

DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...