Showing posts with label Entho Sundarudamma thanu lyrics. Show all posts
Showing posts with label Entho Sundarudamma thanu lyrics. Show all posts

08 March 2021

Entho Sundarudamma thanu | ఎంతో సుందరుడమ్మ తాను

ఎంతో సుందరుడమ్మ తాను - నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||

ధవళవర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు (2)
అవని పదివేలందు బహు శ్రేష్ఠుడాతండు
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు బహు శ్రేష్ఠుడాతండు (2)
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||

కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)
మరులు మనసున నింపు మహనీయుడాతండు
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)
సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)
విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||

పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు
పాలతో కడిగిన నయనాలు గలవాడు -
విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)
కలుషము కడిగిన కమలాల కనుదోయి ఆ.. ఆ (2)
విలువైన చూపొసగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||

మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)
చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ. (2)
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2)||ఎంతో||

అతడతికాంక్షానీయుండు రాయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
అతడతి కాంక్షానీయుండు రాయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)
ఆతని నొరతి మధురంబు మధురంబు ఆ.. ఆ (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2)||ఎంతో||
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...