Showing posts with label స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి. Show all posts
Showing posts with label స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి. Show all posts

23 December 2020

Sthothramu Sthuthi Sthothramu | స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి

స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే 
రాజాధిరాజు దేవాదిదేవుడు స్తుతులకు పాత్రుడు 
                                        ||స్తోత్రము||
1. పాపపు వస్త్రము మార్చి - నీతిమంతునిగ తీర్చి
పరిశుద్ధులలో చేర్చి - పరమ సుభాగ్యము నిచ్చి
మహిమ స్వరూపుడు - మహిమ స్వరూపుడు 
                                          ||స్తోత్రము||
2. మనుష్య కుమారుడై - మనుజుల పాపముకై
మహిలోన వెలసెను - మరణించి లేచెను
మహిమ స్వరూపుడు - మహిమ స్వరూపుడు
                                           ||స్తోత్రము||
3. రాజుల రాజగు యేసు - ప్రేమించి మనలనెంతో
రక్షింపవచ్చి మనలన్ - తన రక్తమిచ్చె మనకై
మహిమ స్వరూపుడు - మహిమస్వరూపుడు
                                            ||స్తోత్రము||

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...