Showing posts with label ప్రభువా నీ కలువరి త్యాగము. Show all posts
Showing posts with label ప్రభువా నీ కలువరి త్యాగము. Show all posts

30 March 2021

Prabhuva Nee Kaluvari Thyagamu | ప్రభువా నీ కలువరి త్యాగము

ప్రభువా నీ కలువరి త్యాగము
చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన 
అల్పా ఓమేగా నీవైతివే (2)
                                 || ప్రభువా ||
1. నీ రక్షణయే ప్రాకారములని -
    ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2
    లోకములోనుండి ననువేరు చేసినది
    నీదయా సంకల్పమే (2)
                                 || ప్రభువా ||
2. జీవపు వెలుగుగ నను మార్చుటకే
    పరిశుద్ధాత్మను నాకొసగితివే (2)
    శాశ్వత రాజ్యముకై నను నియమించినది
    నీ అనాది సంకల్పమే (2)
                                 || ప్రభువా ||
3. సంపూర్ణునిగా నను మార్చుటకే -
    శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే (2)
    పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
    నీ నిత్యసంకల్పమే (2)

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...