Showing posts with label ar Stevenson songs. Show all posts
Showing posts with label ar Stevenson songs. Show all posts

01 December 2024

Ninnu chudaga vachhinadura నిన్ను చూడగ వచ్చినాడురా

నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు -
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు (2)
లోకమే సంతోషించగా - ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లెహేమను ఊరిలో.. కన్యకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో.. హాయిగా నిద్దరోయెరా ||నిన్ను||

దేవుని కోపము నుండి
తప్పించే ప్రియ పుత్రుడాయనే (2)
ముట్టుకో ముద్దు పెట్టుకో (2) ||బెత్లెహేమను||

గుండెలో కొలువైయుండి
దీవించే ధనవంతుడాయనే (2)
ఎత్తుకో బాగా హత్తుకో (2) ||బెత్లెహేమను||

తోడుగ వెంటే ఉండి
రక్షించే బలవంతుడాయనే (2)
చేరుకో నేడే కోరుకో (2) ||బెత్లెహేమను||

30 March 2023

Daveedu suthuniki jayamu | దావీదు సుతునికి జయము జయం


దావీదు సుతునికి జయము జయం స్తుతులు చెల్లించెదం (2)
యేరుషలేముకు యేసునిరాక - ఆర్భాటముతో జరుగు వేడుక 
స్వరమెత్తి పాడాలి విజయ గీతిక - స్వరమెత్తి పాడాలి విజయ గీతిక
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
1.రాజుల రాజు సాత్వికుడై - నీతి సామ్రాజ్యపు స్థాపకుడై (2)
ఏతెంచుచుండెను నీ యొద్దకు - ప్రవచనము నెరవేర్చుటకు (2)
ప్రవచనములు నెరవేర్చుటకు 
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
2.కట్టబడియున్న గాడిదను - విప్పి తోలుకొని తెమ్మనెను (2)
కూర్చుండి సాగెను సీయోనుకు - సమాధానము ప్రకటించుటకు (2)
సమాధానమును ప్రకటించుటకు
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||
 
3.బాలుర పసిపిల్లల నోట - ఉంచిన స్తోత్రధ్వనుల చేత (2)
స్థాపించియుండెను దుర్గమును - అణిచివేయను శత్రువును (2)
అణిచివేయుటకు శత్రువును
హోసన్నా హోసన్నా హోసన్నా ఓహో - యేసన్న మాయన్న హోసన్నా ||దావీదు||

12 February 2023

Yesu neeve kaavalayya యేసూ నీవే కావాలయ్యా

యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా
ఘనుడా నీదివ్య సన్నిధి - నను ఆదుకొనే నా పెన్నిధి (2)

అ.ప|| నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా..
  
నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు
 
నీవే నాతో వస్తే - కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - క్షయత నన్నంటదు
 
నీవే నాతో వస్తే - ఓటమి నా కుండదు
నీవే ఆజ్ఞాపిస్తే - చీకటి నన్నంటదు 
 DOWNLOAD MP3 SONG HERE 👇 

30 January 2023

Siramu vanchenu sarva lokam | శిరము వంచెను సర్వ లొకము

శిరము వంచెను సర్వ లొకమ్ - యేసు దేవా నీ ముందు (2)
సంతసించె ప్రతి హృదయం (2)- రక్షక నీ జన్మయందు (2) ||శిరము||

1.పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము - రాజుగానే ఉదయించినావు చిత్రము (2)
మహిమ సింహాసనం - విడిచి నాకోసము (2)
పశుల పాకలో పుట్టినావు స్తోత్రము (2) ||శిరము||

2.యుద్ధముచేసి రాజ్యమేలేది సహజము - శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము (2)
పరలోకానందము - చేసితివి త్యాగము (2)
మంటిదేహము దాల్చినావు స్తోత్రము (2) ||శిరము||

3.పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము - ముందే యెరిగి జన్మించినావు చిత్రము (2)
మార్పు చేసుకొని నీ మహిమ రూపము (2)
మనిషి రూపులో – వచ్చినావు స్తోత్రము (2) ||శిరము||
DOWNLOAD MP3 SONG HERE 👇

05 July 2022

Em korukonu neeve nakundaganu | ఏం కోరుకోను నీవే నాకుండగాను

ఏం కోరుకోను నీవే నాకుండగాను యేసూ (2)
వేరై నీకు నేను - క్షణమైనా బ్రతకలేను (2)
కలిమికి నెలవగు నిను కలిగిన నేనేంకోరుకోను నీవే నాకుండగాను

నిర్మించావు నీనోటి మాటతో - భూమ్యాకాశములను (2)
రూపించి నరుని హెచ్చించావు - నియమించి ఏలుటకును (2)
చెలిమికి తులువను నను పిలిచిన - నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను

పంపించావు ఏకైక పుత్రుని - పాప లోకమునకు (2)
చెల్లించి ఋణము అర్పించావు - తన ప్రాణం మరణమునకు (2)
నను కనుగొని కలుషము కడిగిన 
నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను

పోషించావు లోటేమి చేయక తోడై నేటివరకు (2) 
దర్శించి కరము అందించావు నను ఆదుకొనుట కొరకు (2)
మొరలను విని ఎదురుగ నిలిచిన - నిన్నేంకోరుకోను నీవే నాకుండగాను
వేరై నీకు నేను - క్షణమైనా బ్రతకలేను (2)
కలిమికి నెలవగు నిను కలిగిన నేనేంకోరుకోను నీవే నాకుండగాను

01 June 2021

Palle Pallello Pattanala Mulallo | పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో

పల్లె పల్లెల్లో పట్టణాల మూలల్లో వాడ వాడల్లో సొగసైన మేడల్లో (1)
యేసు వార్త చాటను పదరో తమ్ముడా నాకేమని అనబోకురో (2)

1. ఈ సువార్త అసలు వినని జనులెందరో -యేసు లేక నశియించు ప్రజలెందరో (2)
ప్రకటించే బాధ్యత నీమీద ఉన్నది- దారి చూపే భారం నీకీయబడినది (2)
యేసయ్య నిజ దేవుడని ఎలుగెత్తి చాటరో (2)
                                              ||పల్లె పల్లెల్లో||
2. నువ్వు మాత్రం తెలుసుకొని ఊరకుంటావా - సొంత పనులు చూసుకొంటూ సంతసిస్తావా(2) కోతెంతోవున్నా పనివారు లేరని -అడుగు చున్నాడేసు తనపని చేయమని(2) యేసయ్యను నమ్ముకోమని ఎలుగెత్తి చాటరో (2)
                                                ||పల్లె పల్లెల్లో||
3. రాకడకు గురుతులు కనిపించు చుండగా- అంతం అతి దగ్గరగా వచ్చుచుండగా(2)
సమయం అసమయమనక సందేహపడక- దొరికిన అవకాశమేది జారవిడువక(2) 
యేసయ్య తిరిగొస్తాడని ఎలుగెత్తి చాటరో(2)
                                                    ||పల్లె పల్లెల్లో||

DOWNLOAD MP3 SONG HERE 👇

Chusthunnadamma Chelli | చూస్తున్నాడమ్మా చెల్లీ చూస్తున్నాడమ్మా

చూస్తున్నాడమ్మా చెల్లీ చూస్తున్నాడమ్మా -
నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా -
అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా -
తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా (2)

1. చీకట్లో చేశానని- నన్నెవరు చూస్తారని చూసినా నాకేమని -ఎవరేమి చేస్తారని (2)
భయమసలే లేకున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా?(2)||చూస్తు||

2. విదేశాల్లో ఉన్నానని- చాలా తెలివైనదాన్నని - అధికారాలున్నాయని- ఏం చేసినా చెల్లుతుందని(2) 
విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా?(2)||చూస్తు||

3. సువార్తను విన్నాగాని - నాకుమాత్రం కానేకాదని ఇప్పుడే తొందరేమని - ఎపుడైనా చూడొచ్చులేఅని(2) 
వాయిదాలు వేస్తున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా?(2)||చూస్తు||
DOWNLOAD MP3 SONG HERE 👇

30 May 2021

Sakkanaina Yesuraju Makkuvatho | సక్కనైన యేసురాజు మక్కువతో

సక్కనైన యేసురాజు మక్కువతో పిలిసినాడు- ఒక్కమారు ఇన్ని మరి ఎన్నియాలో -
నిక్కముగా నీదు బతుకు లెక్కలన్ని ఎరిగినోడు- సక్కజేయ పిలిసె మరి ఎన్నియాలో (2)

1. రాజ్యాలనేలెటోడు ఎన్నియాలో - నిన్ను రాజుగా చేయగోరె ఎన్నియాలో (2)
పూజలందుకునెటోడు ఎన్నియాలో నీతో భోజనం చేయగోరె ఎన్నియాలో (2)
                                                 ||సక్కనైన||
2. ఆకసమే పట్టనోడు ఎన్నియాలో - నీకై పాకలోన పుట్టినాడు ఎన్నియాలో (2)
సిరిగలిగిన గొప్పోడు ఎన్నియాలో - నీకై దరిద్రుడుగ మారినాడు ఎన్నియాలో (2)
                                                 ||సక్కనైన||
3. పాపాలను బాపెటోడు ఎన్నియాలో నీకై - శాపమాయె సిలువలోన ఎన్నియాలో (2)
నరకాన్ని తప్పించి ఎన్నియాలో - నిన్ను సొరగానికి సేర్చదలిచె ఎన్నియాలో(2)
                                      ||సక్కనైన||
DOWNLOAD MP3 SONG HERE 👇

Jayajaya gaanamu cheyuma | జయజయ గానము చేయుమా

జయజయ గానము చేయుమా - 
జయ శీలుని కొనియాడుమా 
జయమును పొందెను మరణము పై - 
విజయుండాయెను అపవాదిపై 

1.మరణపు ముల్లును విరిచెను - 
మృత్యువును గెల్చి లేచెను 
తనను నమ్మిన పిల్లలను - 
రాకడలో తిరిగి లేపును 

2.సిద్ధము చేయను నివాసము - 
వెళ్ళెను యేసు పరలోకము 
కొనిపోవను తన భక్తులను - 
తిరిగొచ్చును మధ్యాకాశము

Mruthini Gelichina Vijayudu | మృతిని గెలిచిన విజయుడు మన

మృతిని గెలిచిన విజయుడు మనయేసుడు 
స్తుతికి పాత్రుడు పూజ్యుడు ఘనయేసుడు హల్లెలూయ (8) 

1. ఘనత నొందిన ఎందరి చరితలో - మరణముతోనే ముగిసి పోయెను 
మనుజ కొమరుడు యేసు మాత్రమే - మరణపు కోరలు త్రుంచివేసెను - త్రుంచివేసెను 

2. యేసు దేహమును సమాధినుంచియు - ముద్రలు వేసి భద్రపరచినా 
మూడవ రోజున మహిమతో లేచెను - మృత్యువు యేసుని ఆపగలిగెనా - ఆపగలిగెనా 

3. మొదటివాడుగా తాను లేచెను - నమ్మిన వారిని సయితము లేపును 
విశ్వాసికి బలము యేసు విజయమే - నిరీక్షణకు గురి పునరుత్థానమే - పునరుత్థానమే

Sanghama Santhoshapaduma | సంఘమా సంతోష పడుమా

సంఘమా సంతోష పడుమా - ఉల్లాసముతో గంతులేయుమా 
విజయుండు నీదు ప్రాణ ప్రియుడు - మృతి గెల్చిన ఏకైక వీరుడు
                                              ||సంఘమా||
1. నీ విభుడు సామాన్యుడు కాడు - మనుజుండై దిగివచ్చిన రేడు 
నీ కొరకై ప్రాణమిచ్చినాడు - మరణము నోడించి లేచినాడు 
                                             ||సంఘమా||
2. ఏ విధమున పరము కెక్కిపోయెనో - ఆ విధమున తిరిగి వచ్చు త్వరలో 
నిదురనే మరచి ఎదురు చూడు - నీ ప్రభునికి స్వాగతం పాడుు
                                              ||సంఘమా||

Siluvapai Prabhu Yesu Palukulu | సిలువ పై ప్రభు యేసు పలుకులు

సిలువ పై ప్రభు యేసు పలుకులు - విలువ కలిగిన దివ్యవాక్కులు 
హృదయమును కరిగించు సూక్తులు - ఎదగదిని వెలిగించు దివ్వెలు 
                                                   ||సిలువ||
1. కఠిన శ్రమ కలిగించు యూదులను క్షమియింప
 తండ్రినడిగిన యేసు పలుకులు 
శరణు కోరిన దొంగకభయమిచ్చి పరమ పురికి చేర్చిన దివ్యవాక్కులు 
                                                   ||సిలువ||
2. నా దేవ నన్నేల విడనాడితివియని వేదనొందిన యేసు పలుకులు 
ఇదిగో నీ తల్లియని శిష్యుడొకనికి మరియ నప్పగించిన దివ్యవాక్కులు 
                                                   ||సిలువ||
3. ఎర్రటెండలో కొయ్య సిలువ పై వ్రేలాడి దాహమనిన యేసు పలుకులు 
నా ఆత్మ గైకొనుము నా పని సమాప్తమని తలను వాల్చిన దివ్య వాక్కులు
                                                   ||సిలువ||

Mouniyaye Yesu Raju Manakorakai మౌనియాయె యేసురాజు మనకొరకై

మౌనియాయె యేసురాజు - మనకొరకై ఆ రోజు 
మలినమెరుగని మహరాజు - శిలగ నిలిచె ఆ రోజు 

1. స్వస్థత నొసగిన కరముల మేకులు నాటిన రోజు
 ప్రేమ నిండిన యేసు హృదిలో బళ్ళెము గ్రుచ్చిన రోజు 

2. చావునే గద్దించిన స్వరము దీనముగా మారిన
 రోజు 
జీవజలపు దాత క్రీస్తు దాహమని అడిగిన రోజు 

3. సుందర రూపుని దేహము అందము కోల్పోయిన రోజు 
రోషము గల దైవసుతుడు దూషణ పాలైన రోజు

28 May 2021

Keerthinchedanu Keerthaneeyuda Naa | కీర్తించెదను కీర్తనీయుడా నా ప్రాణప్రియుడా

కీర్తించెదను కీర్తనీయుడా - నా ప్రాణప్రియుడా నా స్నేహితుడా (2)
ఆశ్చర్యకార్యములు చేసినవాడా - 
అద్భుత మేళ్ళతో నింపిన నా విభుడా (2)
సా..నిద.. పా.. గమ.. పా.. గరి..సాగామాపని.. స 

1.నీ ప్రియ పిల్లలు నిద్రించుచుండగ - 
నీవే వారికి కృప చూపుచుంటివి (2)
అడగకముందే అక్కరనెరిగి(2)
అత్యధికముగా దయచేయుచుంటివి (2)
సనిదప నిదపమ.. దపమగ పమగరి... సా, గా, మా... పా.. నీ..గరి.. స ||కీర్తించెదను||

2.నీ అరచేతిలో మము చెక్కుకుంటివి - 
తొట్రిల్లనీయక నడిపించుచుంటివి (2)
పగలు వేడిమి రాతిరి వెన్నెల (2)
మమునంటకుండా కాపాడుచుంటివి (2)
ససస గాగగా... రిరిరి నీనినీ... ససస నీని దద... ద పాప గమపని... స ||కీర్తించెదను||

3.రాకపోకలలో తోడుగనుంటివి - 
రాతిరి జామైనా కునుకక యుంటివి (2)
శోధనసమయమున వేదన చెందినా(2) 
కన్నీటి బిందువులన్నీ తుడుచుచుంటివి (2)
సాస నీనిదా.. పాప మామగరి.. సగా గమా మప.. , పనీ గరిసని.. స ||కీర్తించెదను||
DOWNLOAD MP3 SONG HERE 👇

Vache Vache Thammudo Yesu Saami | వచ్చె వచ్చె తమ్ముడో యేసు సామి


వచ్చె వచ్చె తమ్ముడో - యేసు సామి వచ్చే వేళాయె సూడరో 
మేఘాల పీఠమెక్కి - మెరుపోలె నింగికి 

1. ఆళ్ళీళ్ళని లేకుండా ఆయనొంక చూస్తరు
 భూజనులేసుని చూసి రొమ్ము కొట్టుకుంటరు 

2. రెక్కల దూతలతో సక్కగ దిగివస్తడు 
టక్కరోడు సాతాను కొమ్ములిరగదీస్తడు 

3. భూతాలే కరిగిపోయి భూమి కాలిపోవును 
ఆకాశం అంతలోనే ఆవిరిగా మారును 
 
4. నమ్మి బతికున్నోళ్ళు నింగికెగిరిపోతరు 
నమ్మి చనిపోయినోళ్ళు లేచి బయటికొస్తరు

Jeevamugala devaa jeevinchuchunnavada | జీవముగల దేవా జీవించుచున్నవాడా

జీవముగల దేవా జీవించుచున్నవాడా (2)
జీవనరాగం జీవితగమ్యం (2) 
జీవనజ్యోతివయా యేసయ్యా - 
పావనమూర్తివయా (2) ||జీవము||

1.నను రక్షించిన నిన్ను మరువను - 
నా శిక్షబాపిన నిన్ను విడువను (2)
నిన్న నేడు మారని దేవా - 
కన్నుల నిన్నే నిలుపు కొంటిని (2) ||జీవము||

2.నను మార్చిన నిను ఘనపరచెదను - 
ప్రాణమిచ్చిన నిను కొనియాడెదను (2)
సత్యము నీవే శాంతి ప్రదాతా - 
నిత్యము నా హృది నీదు నివాసం (2) ||జీవము||
DOWNLOAD MP3 SONG HERE 👇

Throvalo Neevuntivo Throvaprakka Padi | త్రోవలో నీవుంటివో త్రోవప్రక్క పడియుంటివో


త్రోవలో నీవుంటివో - త్రోవప్రక్క పడియుంటివో 
త్రోవ చూపిన నజరేయుని కనలేని అంధుడవైయుంటివో 
అ.ప: జీవితపు ఈ యాత్రలో నీ పరిస్థితి తెలుసుకో
 జీవమార్గం క్రీస్తులో నిన్ను నీవు నిలుపుకో 

1. చెరిపివేసుకున్నావు నీదు మార్గమును - 
చెదిరి ఎన్నుకున్నావు స్వంత మార్గమును 
పాపపు అంధకారంతో మార్గం కనరాకయుంటివే -
చీకటి దారిన పయనంతో మరణం కొనితెచ్చుకుంటివే
 
2. సిద్ధపరచెను యేసు నూతన మార్గమును 
బలిగ అర్పణగ చేసి శరీరరక్తమును 
సత్యమైన ఆ మార్గంలో జీవం క్షేమం ఉందిలే
 నిత్యుడు ఆ దేవుని చేరే ధైర్యం కలిగించిందిలే 

3. నడచి వెళ్ళుచున్నావా అరణ్యమార్గమున
 గమ్యమెరుగకున్నావా జీవనగమనమున
 పర్వతములు త్రోవగ చేసి నీటి యొద్దకు చేర్చులే
 త్రోవలను తిన్నగ చేసి ఆత్మదాహమును తీర్చులే

Maruvakura Maruvakura Devuni | మరువకురా మరువకురా దేవుని


మరువకురా మరువకురా దేవుని ప్రేమను మరువకురా ..
విడువకురా విడువకురా ఆ ప్రభు సన్నిధి విడువకురా..
అ.ప: ఆ ప్రేమే నిత్యమురా - ప్రభు సన్నిధి మోక్షమురా (2)
                                         ||మరువకురా||
1. పరమును చేరే మార్గము ఇరుకని - శ్రమలుంటాయని ఎరుగుమురా (2)
నశించు సువర్ణము అగ్నిపరీక్షలో - శుద్ధియగునని గమనించరా (2)
                                         ||మరువకురా||
2. లోక సంద్రములో ఎదురీదాలని - సుడులుంటాయని ఎరుగుమురా (2)
తీరము చేరిన మెప్పును మహిమ - ఘనత కలుగునని గమనించరా (2)
                                         ||మరువకురా||
3. విశ్వాసపరుగులో శోధనవలన - దుఃఖముందని ఎరుగుమురా (2)
కడముట్టించిన నిత్యానందము - బహుమానముందని గమనించరా(2)
                                         ||మరువకురా||

Naa Hrudayamunaku Aashrayama | నా హృదయమునకు ఆశ్రయమా నమ్మదగిన


నా హృదయమునకు ఆశ్రయమా 
నమ్మదగిన నా సహాయమా 
నా దుర్గము నా కేడెమా నా స్వాస్థ్యము నా గానమా 

1. ఆకసములో నీవు గాక నాకెవరున్నారు నా యేసయ్యా 
ప్రభువా నీవే నాకుండగా లోకములోనిది నే కోరను 

2. తెలివిలేని పశుప్రాయుడను చేయివిడువక నడి పెదవు 
నీ ఆలోచననిచ్చెదవు మహిమలో నను చేర్చెదవు 

3. నా శరీరమె కృశించినా నా ఎముకలే క్షీణించినా
 నాకైతే ఇల ఎల్లప్పుడు దేవుని పొందు ధన్యకరం

Thandri Chentha Chere Dhari Yesanna | తండ్రి చెంత చేరే దారి యేసన్నా


తండ్రి చెంత చేరే దారి యేసన్నా - యేసుగాక వేరే దిక్కు లేదన్నా 

అ.ప. : శరణం వేడన్నా - స్తోత్రం పాడన్నా

1. పాపివైన నిన్ను ప్రేమించె పరలోకమహిమ త్యజించె 
బలియాయె నీ కోసం తండ్రి ప్రేమ తెలుసుకో 
అర్పించె తన ప్రాణం మనసులోన నిలుపుకో 

2. సత్యమైన దారిని విడిచి నిత్యుడైన తండ్రిని మరచి 
ఎందాక నీ పయనం వెనుదిరిగి చూసుకో 
నీ కొరకు వేచియున్న తండ్రి వైపు మరలుకో 

3. శాశ్వతం కాదు ఈ లోకం నీటిబుడగ నీదు జీవితం
సరియైన దారిలో నీ బ్రతుకు నిలుపుకో 
గురివైపు నీ పయనం సాగించ నేర్చుకో

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...