Showing posts with label 605 స్తోత్రము సేయరే సోదరులార. Show all posts
Showing posts with label 605 స్తోత్రము సేయరే సోదరులార. Show all posts

17 August 2020

Sthothramu Cheyare Sodarulara | స్తోత్రము సేయరే సోదరులార

605
వీడ్కోలు శుభములు
రా -శంకారాభరణము, తా -ఆది

స్తోత్రము సేయరే - సోదరులార మన - యాత్మలతో దండ్రిన్ = ధాత్రిని మన పర - మాత్ముని వాక్కులు - స్తోత్రము లో గలిపి ||స్తోత్రము||

1.ఇచ్చట ప్రేమల - కిదియే కడవరి - వచ్చియున్న దేమో - అచ్చట మన మం - దరము గలిసికొని - యానందింతుము గా ||స్తోత్రము||

2.ఎక్కువ ప్రేమలు - చక్కని స్తోత్రము - లక్కడ మన మంత = మిక్కిలి ప్రియుడు - దేవుని కిడుదుము - ఒక్క మనను తోను ||స్తోత్రము||

3.కన్నీ రుండదు - చావు కష్టము - లెన్నటి కుండవుగా = కన్నను మన శృం - గారపు బ్రతుకు - లెన్న దరము గాదె ||స్తోత్రము||

4.వాగును వీణేలు - సాగును పాటలు - సతతముగా నచట = రాగము లెంతో - రమ్య మైయుండును - భాగింతన లేము ||స్తోత్రము||

5.మరల నిచట గూ - డుదుమో లేదో - మన మందరము = త్వరలో మన పర - లోక పుదండ్రి - తోడ నుందు మేమో ||స్తోత్రము|| 

6.గొఱ్ఱపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది గాంతుముగా = గురుతరమగు మన దేవుని ప్రేమను - కూర్మితో జూతుముగా ||స్తోత్రము|| 

7.పరమ తండ్రితో - ప్రభుయేసునితో - బరిశుద్ధాత్ము నితో  = స్థిరముగ నుందుము - మరి దూతలతో - బరలోకము నందున్ ||స్తోత్రము|| 
 - గొల్లపల్లి నతానియేలు
DOWNLOAD MP3 SONG HERE 👇

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...